Sunday, February 9, 2025

Tilottamma priya vayyarama [తిలోత్తమా ప్రియ వయ్యారమా ] - Master

Song Name :Tilottama Priya vayyarama
Movie:Master
Singers:Hariharan garu, Sujatha garu
Lyricist:Chandrabose garu
Composer:Deva garu
DirectorSuresh Krishna garu


తిలోత్తమా ప్రియ వయ్యారమా ప్రభతమా సుభ వసంతమ

నే మోయలేనంటు హృదయాన్ని అందించా

నేనున్నా లెమ్మంటు అది నాలొ దాచేశా 

ఏ దారిలో సాగుతున్నా ఎద, నీ వైపుకే లాగుతోంది

ఏ వేళలో ఎప్పుడైనా మది, నీ ఊహలో ఊగుతోంది

తిలోత్తమా ప్రియ వయ్యారమా ....


పెదవే ఓ మధుర కవిత చదివే 

అడుగే నా గడపనొదిలి కదిలే 

ఇన్నాళ్ళు లేని ఈ కొత్త బాణి, ఇవ్వాళే మనకెవరు నేర్పారమ్మా 

ఈ మాయ చేసింది ప్రేమే ప్రియ ప్రేమంటె ఒకటైన మనమే 

తిలోత్తమా సుభ వసంతమ


కలలే నా ఎదుట నిలిచె నిజమై

వలపే నా ఒడికి దొరికె వరమై

ఏ రాహువైన ఆషాఢమైన ఈ బాహుబంధాన్ని విడదీయ్యునా 

నీ మాటలే వేదమంత్రం చెలి నువ్వన్నదే నా ప్రపంచం 


తిలోత్తమా ప్రియ వయ్యారమా ప్రభతమా సుభ వసంతమ 

నే మోయలేనంటు హృదయాన్ని అందించా

నేనున్నా లెమ్మంటు అది నాలొ దాచేశా 

ఏ దారిలో సాగుతున్నా ఎద, నీ వైపుకే లాగుతోంది

ఏ వేళలో ఎప్పుడైనా మది, నీ ఊహలో ఊగుతోంది

 


No comments:

Post a Comment