Monday, March 3, 2025

Mounamgane edagamani [మౌనంగానే ఎదగమని ] - Naa Autograph

Song Name :Mounamgane edagamani
Movie:Naa Autograph
Singers:K.S. Chitra garu
Lyricist:Chandra bose garu
Composer:M.M. Keeravani garu
DirectorS. Gopal reddy garu 


మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగినకొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగినకొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది

అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది , ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగినకొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది

అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది , ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

 

దూరమెంతొ ఉండనీ దిగులుపడకు నేస్తమా, దరికిచేర్చు దారులు కూడా ఉన్నాయిగా

భారమెంతొ ఉండనీ బాధపడకు నేస్తమా, బాధవెంట నవ్వులపంట ఉంటుందిగా 

సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషిచేస్తేనే అమృతమిచ్చింది 

అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుంది 

తెలుసుకుంటె సత్యమిది తలచుకుంటె సాధ్యమిది 

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగినకొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది


చెమటనీరు చిందగా నుదుటిరాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో 

పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో 

తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలీ 

మా ధైర్యాన్ని దర్శించి దైవాలు తలదించగా 

మా ధైర్యాన్ని దర్శించి దైవాలు తలదించగా 

మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి 

అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి 


మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగినకొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది

అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది , ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది 

No comments:

Post a Comment