Wednesday, October 29, 2025

Jagada jagada jagadam [జగడ జగడ జగడం చేసేస్తాం] - Geetanjali

Title :Jagada jagada jagadam
Movie:Geetanjali
Singers:S.P. Balasubramanyam గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Mani Rathnam గారు

జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం

మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం, భుగల భగల గరళం మా పిలుపే ఢమరుకం 

మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రం పం పం పం 

జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం

మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం, భుగల భగల గరళం మా పిలుపే ఢమరుకం 

ఆడేదే వలపు నర్తనం, పాడేదే చిలిపి కీర్తనం, సయ్యంటే సయ్యాటరో..హే హే

మా వెనకే ఉంది ఈ తరం, మా శక్తే మాకు సాదనం, ఢీ అంటే ఢీయ్యాటరో..

నేడేరా నీకు నేస్తమూ రేపేలేదు, నిన్నటే నిండుసున్నరా రానేరాదూ

ఏడేడు లోకాలతోన బంతాటలాడాలి ఈనాడే.. తకతకధిమి తకఝణు 

జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం

మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం, భుగల భగల గరళం మా పిలుపే ఢమరుకం 

పడనీరా విరిగి ఆకశం, విడిపోనీ భూమి ఈ క్షణం, మా పాట సాగేనులే.. హో హో 

నడిరేయే సూర్య దర్శనం, రగిలింది వయసు ఇంధనం, మా వేడి రక్తాలకే 

ఓ మాటా ఒక్క బాణము మా సిద్ధాంతం, పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం

జోహారుచెయ్యాలి లోకం మా జోరు చూశాక ఈనాడే.. తకతకధిమి తకఝణు 

జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం

మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం, భుగల భగల గరళం మా పిలుపే ఢమరుకం 

మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రం పం పం పం 

జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం

తకిట తకిట తకఢిమి తకధిమితక 

తకిట తకిట తకఢిమి తకధిమితక 

తకిట తకిట తకఢిమి తకధిమితక తాం తాం తాం తాం 

Saturday, October 25, 2025

Nandi konda vagullona [నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో] - Geetanjali

Title :nandi konda vaagullo
Movie:Geetanjali
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitraగారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Mani Rathnam గారు

ఓ... ఓ... 

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో

చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో 

నీడల్లే ఉన్నా, నీతో వస్తున్నా 

నా ఊరేది ఏదీ, నా పెరేది ఏదీ..నా దారేది ఏదీ, నా వారేరీ... ఓ... ఓ... 

ఏనాడో ఆరింది నావెలుగు, నీ దరికే నా పరుగు

ఆనాడే కోరాను నీ మనసు, నీ వరమే నన్నడుగు 

మోహినీ పిశాచి నా చెలిలే, డాకినీ విశూచి నా సఖిలే 

మోహినీ పిశాచి నా చెలిలే, డాకినీ విశూచి నా సఖిలే 

విడవకురా వదలనురా ప్రేమే రా నీ నీడా 

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో

భూత ప్రేత పిశాచ బేతాళ మారిచం భం జడం భం భం 

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో

చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో 

నీడల్లే ఉన్నా, నీతో వస్తున్నా 

నీ కబళం పడతా నిను కట్టుకుపోతా, నీ భరతం పడతా నిను పట్టుకుపోతా 

ఆ.... ఓ....

ఢాకిని ధక్కా ముక్కల చెక్కా ఢంబో తినిపిస్తాన్, తాటకివనిపిస్తే తాటను వొలిచేస్తాన్

తుంటరి నక్క డొక్కల చొక్క అంభో అనిపిస్తాన్, నక్కను తొక్కిస్తాన్ చుక్కలు కక్కిస్తాన్ 

రక్కసి మట్ట తొక్కిస బుట్ట పంబేదులిపేస్తాన్, తీతువు పిట్ట ఆయువుచిట్టా నేనే తిరగేస్తాన్

రక్కసి మట్ట తొక్కిస బుట్ట పంబేదులిపేస్తాన్, తీతువు పిట్ట ఆయువుచిట్టా నేనే తిరగేస్తాన్

అస్త్రాయ ఫట్ ఫట్ ఫట్ ఫట్, వస్త్రాయ ఝట్ ఝట్ ఝట్ ఫట్

గోపాలా మసజసతతగ శార్ధూలా 

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో

చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో 

నీడల్లే ఉన్నా.. న...నా , నీతో వస్తున్నా 

నీ కబళం పడతా నిను కట్టుకుపోతా, నీ భరతం పడతా నిను పట్టుకుపోతా 

ఆ.... ఓ....

నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో

చంద్రవంక కోనల్లోన సందెపొద్దు సీకట్లో  

Oh Priya priya [ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా] - Geetanjali

Title :Oh priya priya
Movie:Geetanjali
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitraగారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Mani Rathnam గారు

ఆ....

ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా

ఏల గాలిమేడలు రాలు పూలదండలు 

నీదో లోక నాదో లోకం, నింగినేల తాకేదెలాగా

ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా

ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా

ఏల జాలిమాటలు మాసిపోవు ఆశలు 

నింగినేల తాకెవేళ నీవే నేనైపోయె వేళయి

నేడు కాదులే రేపు లేదులే, వీడుకోలిదే వీడుకోలిదే 

నిప్పులోన కాలదు నీటిలోన నానదు, గాలిలాగ మారదు ప్రేమ సత్యము 

రాచవీటి కన్నెది రంగు రంగు స్వప్నము, పేదవాడి కంటిలో ప్రేమరక్తము

గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో, జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో  

ఎన్ని బాధలొచ్చినా ఎదురులేదు ప్రేమకు, రాజశాశనాలకి లొంగిపోవు ప్రేమలు

సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమ 

ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా

ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా

కాళిదాసు గీతికి, కృష్ణ రాసలీలకి, ప్రణయమూర్తి రాధకి ప్రేమ పల్లవి

ఆ అనారు ఆశకి, తాజ్‌మహల్ శొభకి, పేదవాడిప్రేమకి చావుపల్లకి 

నిధికన్న ఎదమిన్న గెలిపించు ప్రేమని, కథకాదు బ్రతుకంటే బలికానీ ప్రేమని

వెళ్ళీపోకు నేస్తమా ప్రాణమైన బంధమా, పెంచుకున్న పాశమే తెంచివెళ్ళిపోకుమ 

జయించేదిఒక్కటే ఓ నీ ప్రేమ 

ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా

ఓ.. ప్రియ ప్రియా... నా ప్రియ ప్రియా

కాలమన్న ప్రేయశి తీర్చమంది లే కసి 

నింగినేల తాకెవేళ నీవే నేనైపోయె క్షణాన, లేదు శాశనం లేదు బంధనం 

ప్రేమకే జయం, ప్రేమదే జయం.. 

Monday, October 20, 2025

Kurisenu virijallule [కురిసేను విరిజల్లులే, ఒకటయ్యేను ఇరుచూపులే] - Gharshana

Title :kurisenu virijallule
Movie:Gharshana
Singers:S.P. Balasubramanyam గారు, Vani Jayaram గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Mani Rathnam గారు

కురిసేను విరిజల్లులే, ఒకటయ్యేను ఇరుచూపులే 

అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను

శృంగారమునకీవె శ్రీకారమేకావే 

కురిసేను విరిజల్లులే, ఒకటయ్యేను ఇరుచూపులే 

ఆకులపై రాలు... ఆ... ఆ...

ఆకులపై రాలు హిమబిందువు వోలె, నా చెలి వొడిలోన పవళించనా 

ఆకులపై రాలు హిమబిందువు వోలె, నా చెలి వొడిలోన పవళించనా 

రాతిరిపగలు, మురిపాలు పండించు చెలికాని ఎదచేర్చి లాలించనా

నేను నీకు రాగతాళం, నీవు నాకు వేదనాదం

ఆ... ఆ... 

కురిసేను విరిజల్లులే, ఒకటయ్యేను ఇరుచూపులే 

అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను

శృంగారమునకీవె శ్రీకారమేకావే 

కురిసేను విరిజల్లులే, ఒకటయ్యేను ఇరుచూపులే 

కన్నుల కదలాడు ఆశలు శృతిపాడు వన్నెల మురిపాల కథ ఏమిటో 

తలపుల మాటుల్లో వలపుల తోటల్లో ఊహలు పలికించు కలలేవిటో  

పెదవుల తెరలోన మధురాల సిరివాన మధురిమలందించు సుధలేమిటో 

పరవశమే సాగి పరువాలు చెలరేగి మనసులు కరిగించు సుఖమేమిటో 

పల్లవించే మోహబంధం ఆలపించే రాగబంధం 

ఆ... ఆ... 

కురిసేను విరిజల్లులే, ఒకటయ్యేను ఇరుచూపులే 

అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను

శృంగారమునకీవె శ్రీకారమేకావే 

కురిసేను విరిజల్లులే, ఒకటయ్యేను ఇరుచూపులే  

Sunday, October 19, 2025

Kuchi kuchi kunamma [కుచ్చికుచ్చి కూనమ్మ ] - Bombay

Movie : Bombay
Song : Kuchi kuchi kunamma
Music Dir: A.R. Rahman garu
Singer: Hari Haran garu, Swarna latha garu
Director: Mani Rathnam garu
Lyrics: Veturi Sundara Rama murthy garu

కుచ్చికుచ్చి కూనమ్మ పిల్లనివ్వు, కుందనాల కూనమ్మ పిల్లనివ్వు

ఊరువాడా నిద్దరోయే, కోడికూడా సద్దుచేసే, కుచ్చి కుచ్చి కూనమ్మ, కుందనాల కూనమ్మ

కుచ్చికుచ్చి కూనమ్మ పిల్లనివ్వు, ఏ కుందనాల కూనమ్మ పిల్లనివ్వు

ఊరువాడా నిద్దరోయే, కోడికూడా సద్దుచేసే, కుచ్చి కుచ్చి కూనమ్మ, కుందనాల కూనమ్మ

కుచ్చికుచ్చి కూనమ్మ ఇవ్వదంటా, నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట 

ఊరువాడా సద్దులాయె, కోడికూడా నిద్దరోయె 

కుచ్చికుచ్చి కూనమ్మ ఇవ్వదంటా, నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట 

ఆటనెమిలికీ మెరుపు సుఖం, గానకోకిలకు పిలుపు సుఖం 

చెట్టువేరుకు పాదు సుఖం, హే అమ్మడన్ను పిలుపు సుఖం  

రాకుమారుడికి గెలుపు సుఖం, చంటి కడుపుకి పాలు సుఖం 

మొగుడు శ్రీమతి అలకలలో ముద్దు కన్న ముడుపు సుఖం 

రేయిపగలు కన్నీట్లో ఉన్నా రాదు మీనుకి చలికాలం 

అల్లిబిల్లిగా లాలిస్తుంటే గారాల పూబాల కోరేది సరసం 

బుజ్జి బుజ్జి పాపనివ్వు, పోకిరాట వేషమొద్దు 

బుజ్జి బుజ్జి పాపనివ్వు, పోకిరాట వేషమొద్దు 

వేడెక్కా అందాలెపెట్టు వేధిస్తే నామీదే ఒట్టు 

కుచ్చికుచ్చి కూనమ్మ ఇవ్వదంటా, నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట 

ఊరువాడా సద్దులాయె, కోడికూడా నిద్దరోయె 

కుచ్చికుచ్చి కూనమ్మ ఇవ్వదంటా, నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట 

ఊరువాడా సద్దులాయె, కోడికూడా నిద్దరోయె 

కుచ్చికుచ్చి కూనమ్మ ఇవ్వదంటా, నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట 

ఊరువాడా సద్దులాయె, కోడికూడా నిద్దరోయె 

చిరుత రెక్కలే పక్షివిలే, చిటికె వెలుగులే దివ్వెవిలే  

తోడు నీడ ఇక నీదేలే, తరగని పుణ్యమిదే 

తనువు తోటివే తపనలులే, ఉరుముతోటివే మెరుపులులే 

ఉన్న తోడు ఇక నీవేలే విలువలు తెలియవులే 

భూమి తిరగడం నిలబడితే, భువిని కాలమే మారదులే 

మగని ఆదరణ కరువైతే ఇల్లాలి ప్రేమంత వేసంగిపాలే 

పొద్దుకోరుకున్న ఆశ అంటుకుంది అగ్గిలాగ 

పొద్దుకోరుకున్న ఆశ అంటుకుంది అగ్గిలాగ 

బుద్ది ఉంటె మంచిదంట దూరాలు కోరింది ఆశ 

కుచ్చి కూనమ్మ, కుందనాల కూనమ్మ

కుచ్చికుచ్చి కూనమ్మ ఇవ్వదంటా, నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట 

ఊరువాడా సద్దులాయె, కోడికూడా నిద్దరోయె 

కుచ్చికుచ్చి కూనమ్మ ఇవ్వదంటా, నీ కొంటె వేషమింక చాలు వెళ్ళమంట 

ఊరువాడా సద్దులాయె, కోడికూడా నిద్దరోయె 

Kanulu kanulu kalise samayam [కనులు కనులు కలిసే సమయం] - Pallavi anupallavi

Movie : Pallavi anupallavi
Song : kanulu kanulu lakise
Music Dir: Illayaraja garu
Singer: S.P. Balasubramanyam garu, S. Janaki garu
Director: Mani Ratnam garu
Lyrics: Raja Sri garu

కనులు కనులు కలిసే సమయం, మనసు మనసు చేసే స్నేహం

నీ చేరువలో నీ చేతలలో వినిపించెను శ్రీరాగం 

కనులు కనులు కలిసే సమయం, మనసు మనసు చేసే స్నేహం

నీ నవ్వులో విరిసె మందారము, నీ చూపులో కురిసె శృంగారము 

నీ మాటలోవుంది మమకారము, నా ప్రేమకేనువ్వు శ్రీకారము 

పరువాలు పలికేను సంగీతము, నయనాలుపాడేను నవగీతము 

నేనే నీకు కానా ప్రాణం, నీవే నాకు కావా లోకం 

కనులు కనులు కలిసే సమయం, మనసు మనసు చేసే స్నేహం

నీ గుండెగుడిలో కొలువుండనీ, నీ వెంటనీడల్లె ననుసాగని

నీపూల ఒడిలో నను చేరనీ, నీ నుదుట సింధూరమై నిలవనీ

చెవిలోన గుసగుసలు వినిపించనీ, ఎదలోన మధురిమలు పండించనీ 

నీలో నేనే కరగాలంట, రోజూ స్వర్గం చూడాలంట  

కనులు కనులు కలిసే సమయం, మనసు మనసు చేసే స్నేహం

నీ చేరువలో నీ చేతలలో వినిపించెను శ్రీరాగం  

Saturday, October 18, 2025

Ni andam na prema gita [నీ అందం నాప్రేమగీత గోవిందం] - Vaarasudochchadu

Movie : Vaarasudochchadu
Song : ni andam na prema gita
Music Dir: Illayaraja garu
Singer: S.P. Balasubramanyam garu, K.S. Chitra garu
Director: Mohan Gandhi garu
Lyrics: Veturi Sundara Rama murthy garu

నీ అందం నాప్రేమగీత గోవిందం, నీ వర్ణం నా కీరవాణి సంకేతం 

నీ రఘం ఏ ప్రేమవీణ సంగీతం, ఈ యోగం ఏ జీవధార సంయోగం 

వొయ్యారి రూపం గాంధార శిల్పం శృంగారదీపం వెలిగిస్తే 

నీ చూపుకోణం సంధించు బాణం నాలేత ప్రాణం వేధిస్తే

నీ అందం నాప్రేమగీత గోవిందం, ఈ యోగం ఏ జీవధార సంయోగం 

జీరాడు కుచ్చిళ్ళ పారాడు పాదాల మారాణి వేదాలు గమకించగా 

కోరాడు మీసాల తారాడు మోసాల నామందహాసాలు చమకించగా 

ఆరారు రుతువుల్లొ అల్లారు ముద్దుల్లో ఎదజంట తాళాలు వినిపించగా 

ఆషాఢ మేఘాల ఆవేశ గీతాలు సరికొత్త భావాలు సవరించగా 

నీకోసమే ఈడూనేనూ వేచాములే, నీకోసమే నాలో నన్నే దాచానులే 

నిను పిలిచాను మలిసందే పేరంటం, ఇక మొదలాయె పొదరింటి పోరాటం ఆరాటం 

నీ అందం నాప్రేమగీత గోవిందం, ఈ యోగం ఏ జీవధార సంయోగం

హంసల్లే వచ్చింది హింసల్లే గిచ్చింది నీ నవ్వు నా పువ్వు వికసించగా 

మాటల్లే వచ్చింది మనసేదో విప్పింది వద్దన్న నీ మాట వలపించగా   

రెప్పల్లోకొచ్చింది రేపల్లెకాడింది నానువ్వు నీనేను క్రీడించగా 

గాధల్లో నిదరోయి రాధమ్మ లేచింది నా వేణువే నాకు వినిపించగ 

నీ పింఛమే కిలికించితాలు చేసిందిలే నాకోసమే ఈ పారిజాతం పూసిందిలే 

మన హృదయాలలో ప్రేమ తారంగం, స్వరబృందావిహారాల చిందేటి ఆనందం 

నీ రఘం ఏ ప్రేమవీణ సంగీతం, ఈ యోగం ఏ జీవధార సంయోగం 

వొయ్యారి రూపం గాంధార శిల్పం శృంగారదీపం వెలిగిస్తే 

నీ చూపుకోణం సంధించు బాణం నాలేత ప్రాణం వేధిస్తే

నీ అందం నాప్రేమగీత గోవిందం, ఈ యోగం ఏ జీవధార సంయోగం  

Vivaha Bhojanambu vintaina vantakambu [వివాహభోజనంబు వింతైన వంటకంబు] - Maya bazar

Movie : Maaya bazaar
Song : Vivaha bhojanambu 
Music Dir: Ghantasala garu
Singer: Ghantasala Venkateswara rao garu
Director: K. V. Reddy garu
Lyrics: Pingali Nagendra rao garu

వివాహభోజనంబు వింతైన వంటకంబు 

వియ్యాలవారివిందు ఒహ్హొహ్హొ నాకెముందూ

వివాహభోజనంబు వింతైన వంటకంబు 

వియ్యాలవారివిందు ఒహ్హొహ్హొ నాకెముందూ

అహహ్హ ఆహహ్హ అహహ్హ ఆహహ్హ 

ఔరౌర గారెలల్ల అయ్యరె బూరెలిల్ల 

ఔరౌర గారెలల్ల అయ్యరె బూరెలిల్ల ఒహ్హోరె అరిసెలిల్ల హహహ్హహా 

ఈవెల్ల నాకె చెల్ల...  

వివాహభోజనంబు వింతైన వంటకంబు 

వియ్యాలవారివిందు ఒహ్హొహ్హొ నాకెముందూ

అహహ్హ ఆహహ్హ అహహ్హ ఆహహ్హ 

భళీరె లడ్డులందు, వహ్ ఫేణిపోణిలిందు 

భళీరె లడ్డులందు, వహ్ ఫేణిపోణిలిందు 

భలే జిలేబిముందు ఈవెల్ల నాకె విందు హహహ్హహ్హా

వివాహభోజనంబు వింతైన వంటకంబు 

వియ్యాలవారివిందు ఒహ్హొహ్హొ నాకెముందూ

అహహ్హ ఆహహ్హ అహహ్హ ఆహహ్హ 

మఝారె అప్పడలు పులిహోర దప్పడాలు  

మఝారె అప్పడలు పులిహోర దప్పడాలు  

వహ్వారె పాయసాలు హహహ్హహ్హా

ఈవెల్ల నాకె చాలు  

వివాహభోజనంబు వింతైన వంటకంబు 

వియ్యాలవారివిందు ఒహ్హొహ్హొ నాకెముందూ

అహహ్హ ఆహహ్హ అహహ్హ ఆహహ్హ 

Saturday, October 11, 2025

Chinnari Ponnari kittayya [చిన్నారి పొన్నారి కిట్టయ్య] - Swathi Muthyam

Movie : Swathi Muthyam
Song : Chinnari Ponnari kittayya
Music Dir: Illayaraja garu
Singer: S.P. Balasubramanyam garu, S. Janaki garu
Director: K. Viswanath garu
Lyrics: Acharya Aatreya garu

చిన్నారి పొన్నారి కిట్టయ్య, నిన్నెవరు కొట్టారయ్యా 

చిన్నారి పొన్నారి కిట్టయ్య, నిన్నెవరు కొట్టారయ్యా 

చిన్నారి పొన్నారి కిట్టయ్య, నిన్నెవరు కొట్టారయ్యా 

అమ్మ నన్ను కొట్టింది బాబోయ్, అమ్మ నన్ను తిట్టింది బాబోయ్ 

ఊరుకో నా నాన్న, నిన్నూరడించ నేనున్నా

చిన్నారి పొన్నారి కిట్టయ్య, నిన్నెవరు కొట్టారయ్యా 

చిన్నారి పొన్నారి కిట్టయ్య, నిన్నెవరు కొట్టారమ్మా

నల్లనయ్య కనరాక కన్నవాళ్ళు నిదరోక 

తల్లిమనసు తానెంత తల్లడిల్లిపోయిందో

వెన్నకై దొంగలా వెళ్ళితివేమో

మన్నుతిని చాటుగా దాగితివేమో

అమ్మా మన్నుతినంగనే శిశువును ఆకొంటినో వెర్రినో 

చూడూ నోరు ఆ...

వెర్రిదీ అమ్మేరా... 

వెర్రిదీ అమ్మేరా పిచ్చిదాని కోపం రా 

పచ్చికొట్టి వెళ్దామా బూచికిచ్చి పోదామా 

ఆ..ఏడుపొస్తోంది నాకేడుపొస్తోంది 

పచ్చికొట్టిపోయామా పాలెవరిస్తారు కదూ..

బూచాడికి ఇచ్చామా బువ్వెవరు పెడతారు చెప్పు 

అమ్మతోనె ఉంటాము అమ్మనొదిలిపోలేము 

అన్నమైన తింటాము తన్నులైన తింటాము 

కొట్టమ్మా కొట్టు బాగా కొట్టు ఇంకా కొట్టు కొట్టూ 

చిన్నారి పొన్నారి కిట్టయ్య, నిన్నెవరు కొట్టారయ్యా 

చిన్నారి పొన్నారి కిట్టయ్య, నిన్నెవరు కొట్టారునాన్నా ఎవరమ్మా 

చిన్నవాడవైతేను చెయ్యెత్తి కొట్టేను 

పెద్దవాడవైతేను బుద్ధిమతి నేర్పేను 

ఎశోదనుకానురా నినుదండింపా 

సత్యనూ కానురా నిను సాధించా 

ఎవ్వరు నువ్వనీ .... ఎవ్వరు నువ్వని నన్ను అడగకు 

ఎవరూ కానని విడిచివెళ్ళకు నన్నూ విడిచివెళ్ళకు 

వెళ్ళము వెళ్ళము లేమ్మా 

చిన్నారి పొన్నారి కిట్టయ్య, నిన్నెవరు కొట్టారయ్యా 

చిన్నారి పొన్నారి కిట్టయ్య, నిన్నెవరు కొట్టారయ్యా 

అమ్మ నన్ను కొట్టింది బాబోయ్, అమ్మ నన్ను తిట్టింది బాబోయ్ 

ఊరుకో నా నాన్న అహా ఊరుకోను, నిన్నూరడించ నేనున్నా

చిన్నారి పొన్నారి కిట్టయ్య, నిన్నెవరు కొట్టారయ్యా 

చిన్నారి పొన్నారి కిట్టయ్య, నిన్నెవరు కొట్టారయ్యా