Saturday, December 6, 2025

Manasuna manasuga [మనసున మనసుగ నిలచిన కలవా] - Love Birds

Title :Manasuna manasuga
Movie:Love birds
Singers:Hariharan గారు, K.S. Chitra గారు
Lyricist:Sirivennela Sitarama sastry గారు
Composer:A.R. Rahman గారు
Director:P. Vasu గారు

మనసున మనసుగ నిలచిన కలవా

పిలిచిన పలకగ ఎదుటనే కలవా 

దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరిమార్గం

మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే ...


మేఘం నేలవొళ్ళో మీటే రాగమల్లే, ప్రేమా వరాలజల్లు కావా

పిలుపే అందుకోని బదులే తెలుపుకొను కౌగిట ఒదిగి ఉండనీవా 

నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా తగున 

మల్లెపూల మాలై నిన్నే వరించి పూజించే వేళ 

నిరీక్షించు స్నేహం కోరి జతనే రానా రానా

ఉప్పొంగిపోయే ప్రాయం నిన్నువిడువదు ఏవేళైన 

నా శ్వాశ ప్రతిపూట వినిపించు నీ పాట 

ఏడేడు జన్మాలు నేనుంట నీ జంట

మనసున మనసుగ నిలచిన కలవా

పిలిచిన పలకగ ఎదుటనే కలవా 

దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరిమార్గం

మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే ...


పూవ్వై నవ్వులని తేనై మాధురిని పంచే పాట మన ప్రేమా..

విరిసే చంద్రకళ ఎగసే కడలి అల పలికే కవిత మన ప్రేమా 

కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమై 

వేటాడు ఏ ఎడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై 

నూరేళ్ళ కాలం కూడా ఒక్క క్షణమై క్షణమై 

నువునేను చెరిసగమౌదాం వయస్సుపండించే వరమై 

ప్రియమైన అనురాగం పలికింది మధుగీతం 

తుదేలేని ఆనందం వేచేనే నీకోసం 

మనసున మనసుగ నిలచిన కలవా

పిలిచిన పలకగ ఎదుటనే కలవా 

దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరిమార్గం

మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే .. 

Sunday, November 23, 2025

Gundello emundo [గుండెల్లో ఎముందో కళ్ళల్లో తెలుస్తుంది] - Manmadhudu

Title :Gundello emundo kallallo
Movie:Manmadhudu
Singers:Venu గారు, Sumangali గారు
Lyricist:Sirivennela Sitarama sastry గారు
Composer:Devi Sri prasad గారు
Director:Vijay bhaskar గారు

గుండెల్లో ఎముందో కళ్ళల్లో తెలుస్తుంది

పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

నిలవదు కద హృదయం, నువ్వు ఎదురుగ నిలబడితే 

కదలదు కద సమయం, నీ అలికిడి వినకుంటే 

కలవరమో తొలివరమో తెలియని తరుణమిది 

గుండెల్లో ఎముందో కళ్ళల్లో తెలుస్తుంది

పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

మనసా మనసా మనసా ఓ మనసా 


పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నదీ

నువ్వు ఇప్పుడన్నదీ నేనెప్పుడూ విననిదీ 

నిన్నిలా చూసి పైనించీ, వెన్నెలే చిన్నబోతోందీ 

కన్నులే దాటి కలలన్ని, ఎదురుగా వచ్చినట్టుంది 

ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది 

గుండెల్లో ఎముందో కళ్ళల్లో తెలుస్తుంది

పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది


ఎందుకో తెలియనీ కంగారు పుడుతున్నది

ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది

పరిమళం వెంట పయనించే, పరుగు తడబాటు పడుతోంది 

పరిణయం దాక నడిపించే పరిచయం తోడుకోరింది 

దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది 

గుండెల్లో ఎముందో కళ్ళల్లో తెలుస్తుంది

పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

నిలవదు కద హృదయం, నువ్వు ఎదురుగ నిలబడితే 

కదలదు కద సమయం, నీ అలికిడి వినకుంటే 

కలవరమో తొలివరమో తెలియని తరుణమిది 

మనసా మనసా మనసా ఓ మనసా 

Aakasavidhilo [ఆకాశవీధిలో..వెన్నెల్లో ఆడపిల్ల నువ్వైతే] - Akasavidhilo

Title :Aakasavidhilo
Movie:Aakasavidhilo
Singers:Devi Sri Prasad గారు, Ganga గారు
Lyricist:bhuvana chandra గారు
Composer:M.M. Keeravani గారు
Director:Singeetam Srinivasarao గారు

వెన్నెల్లో ఆడపిల్ల నువ్వైతే, వెచ్చని అల్లరి నాదైతే 

ఊహలకేవో రెక్కలురాగా, ఎగిరిపోతుంటే ఆకాశవీధిలో..

వెన్నెల్లో ఆడపిల్ల నేనైతే, వెచ్చని అల్లరి నీదైతే 

ఊహలకేవో రెక్కలురాగా, ఎగిరిపోతుంటే ఆకాశవీధిలో..


మేఘాలె ముగ్గులుపెట్టే మేడల్లో, దేహాలె ఉగ్గులుకోరే నాదంలో 

చందమామే మంచం సర్దుకుందాం కొంచెం 

అహో రాత్రులు, ఒకే యాత్రలు, రహస్యాల రహదారిలో 

ఆకాశవీధిలో..

వెన్నెల్లో ఆడపిల్ల నేనైతే, వెచ్చని అల్లరి నాదైతే 


భూదేవే బిత్తరపోయే వేగంలో, నాదేవే నిద్దురలేచే విరహంలో 

తొకచుక్కై చూస్తా, ఒహోహో సోకులెక్కే రాస్తా 

ముల్లోకాలకే ముచ్చెమటేయగా ముస్తాబంత ముద్దాడుకో 

ఆకాశవీధిలో..

వెన్నెల్లో ఆడపిల్ల నువ్వైతే, వెచ్చని అల్లరి నాదైతే 

ఊహలకేవో రెక్కలురాగా, ఎగిరిపోతుంటే ఆకాశవీధిలో..

Saturday, November 22, 2025

Narmada nadi teeramlo [నర్మదా నదితీరంలో] - Rathasarathi

Title :Narmada nadi teeramlo
Movie:Rathasarathi
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Raj Koti గారు
Director:Sarath గారు

నర్మదా నదితీరంలో, నవమన్మధ అనుకుంట

నర్మదా నదితీరంలో, నవమన్మధ అనుకుంట

గౌతమీ నదితీరంలో, సుఖవీణలో చలిగంట

కన్నులా గీటుకో, గీటుతో గిచ్చుకో 

చూపులా చుట్టుకో ఊపులో..

నర్మదా నదితీరంలో, నవమన్మధ అనుకుంట

గౌతమీ నదితీరంలో, సుఖవీణలో చలిగంట


ఎగుడు దిగుడు ఎదలోన మొగలిపొదలు రగిలేనే

పగలె మసక పడుతుంటే పెదవి పెదవినడిగేనే 

తోయకే మల్లెలా మాయలో మత్తులా 

చేయకూ చిత్తిలా అందనీ ఎత్తులా 

సొంపుకో సొగసుని చూపి, దింపకే దిగులు సఖి

చెపకో చెరుకుల ముద్దు పంపర పదసరుకి

ప్రేమలో ఏదటో ఏదిటో....

నర్మదా నదితీరంలో, నవమన్మధ అనుకుంట

గౌతమీ నదితీరంలో, సుఖవీణలో చలిగంట


చిలిపి చిలిపి కలలెన్నో, నెమలి కనులు నెమరేసే 

వదులు వదులు వలదంటే చిగురు వలపు ముదరేసే 

పాడకే కోకిలా ఈడులో కోడిలా 

ఆడితే షోకిలా వేడిలో వెన్నెలా 

సందెకో చలి అటువచ్చీ అందమే వణికెనుగా 

పొద్దుకో పొడుపులు వచ్చీ నిద్దరే చిరిగెనులే 

ప్రేమలో ఏవిటో ఈడిటో..

నర్మదా నదితీరంలో, నవమన్మధ అనుకుంట

గౌతమీ నదితీరంలో, సుఖవీణలో చలిగంట

కన్నులా గీటుకో, గీటుతో గిచ్చుకో 

చూపులా చుట్టుకో ఊపులో.. 

Sunday, November 16, 2025

Meghama maruvake [మేఘమా మరువకే, మోహమా విడువకే] - Seetharatnam gari abbayi

Title :Meghama maruvake
Movie:Seetharatnam gari abbayi
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Bhuvana chandra గారు
Composer:Raj Koti గారు
Director:E.V.V Satyanarayana  గారు

మేఘమా మరువకే, మోహమా విడువకే 

మాఘమాస వేళలో మల్లెపూల మాలగా 

మరుని కూడి మెల్లగా మరలి రావె చల్లగా 

మదిలో మెదిలే మధువై....

మేఘమా మరువకే, మోహమా విడువకే 


నిదుర కాచిన కన్నె పానుపే రా రా రమ్మంటుంటే 

కురులు విప్పి నా అగరువత్తులే అలకలు సాగిస్తుంటే

సిగ్గే ఎరుగని రేయిలో తొలిహాయిలో అలివేణీ 

రవికే తెలియని అందము అందించనా నెలరాజా

కలలా అలలా మెరిసీ ...

మేఘమా మరువకే, మోహమా విడువకే 


గడుసు ఒడుపులే పరుపు విరుపులై గిచ్చే సందండిలోనా 

తడవ తడవకి పెరుగుతున్నది ఏదో మైకం భామ 

మరుగే ఎరుగని కోనలో ఆ మోజులో మహరాజా 

నలిగే మల్లెల సవ్వడి వినిపించనా నెరజాణా 

జతగా కలిసి అలిసి...

మేఘమా మరువకే, మోహమా విడువకే