Friday, November 15, 2024

దేవదేవ ధవళాచలమందిర (Bhookailas)

Song Name :Deva deva dhavalachala
Movie:Bhookailas
Singers:Ghantasala garu
Lyricist:Samudrala Raghavacharya (Sr Samudrala) garu
Composer:Sudarsanam Govardhanam garu
DirectorK. Shankar garu

దేవదేవ ధవళాచలమందిర గంగాధరా హర నమోనమో  

దైవతలోక సుధాంభుధిహిమకర లోకశుభంకర నమోనమో

దేవదేవ ధవళాచలమందిర గంగాధరా హర నమోనమో  

దైవతలోక సుధాంభుధిహిమకర లోకశుభంకర నమోనమో

పాలితకింకర భవనాశంకర శంకరపురహర నమోనమో

పాలితకింకర భవనాశంకర శంకరపురహర నమోనమో

హాలహలధర శూలయుధకర శైలసుతావర నమోనమో

హాలహలధర శూలయుధకర శైలసుతావర నమోనమో 

దేవదేవ ధవళాచలమందిర గంగాధరా హర నమోనమో  

దైవతలోక సుధాంభుధిహిమకర లోకశుభంకర నమోనమో

దురుతవిమోచనా ఆఆ....

దురుతవిమోచన ఫాలవిలోచన పరమదయాకర నమో నమో  

కరిచర్మాంబర చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో

కరిచర్మాంబర చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో   

దేవదేవ ధవళాచలమందిర గంగాధరా హర నమోనమో  

దైవతలోక సుధాంభుధిహిమకర లోకశుభంకర నమోనమో

నమోనమో నమోనమో  నమోనమో నమోనమో 

నమోనమో నమోనమో  నమోనమో నమోనమో 

నారాయణహరి నమోనమో నారాయణహరి నమోనమో 

నారాయణహరి నమోనమో నారాయణహరి నమోనమో 

నారద హృదయ విహారి నమోనమో నారద హ్రుదయ విహారి నమోనమో  

నారాయణహరి నమోనమో నారాయణహరి నమోనమో 

పంకజనయన పన్నగశయనా .. ఆ....

పంకజనయన పన్నగశయనా 

పంకజనయన పన్నగశయనా 

శంకరవినుతా నమోనమో  శంకరవినుతా నమోనమో 

నారాయణహరి నమోనమో నారాయణహరి నారాయణహరి  నారాయణహరి  నమోనమో  

నరుడా ఓ నరుడా ఏమి కోరిక (Bhairava dweepam)

Song Name :Naruda o Naruda
Movie:Bhairava Dweepam
Singers:S. Janaki garu
Lyricist:Veturi Sundararama Murthy garu
Composer:Madhavapeddi Suresh garu
DirectorSIngeetam Sreenivasa Rao garu

నరుడా ఓ నరుడా ఏమి కోరిక
నరుడా ఓ నరుడా ఏమి కోరిక 
కోరుకొ కోరిచేరుకో చేరిఏలుకో బాలకా 
కోరుకొ కోరిచేరుకో చేరిఏలుకో బాలకా 
నరుడా ఓ నరుడా ఏమి కోరికా 

రా దొరా ఒడి వలపుల చెరసాలరా
లే వరా ఇవి దొరకని సరసాలురా 
దోర దోర శోకులేరి దొచుకో సఖా 
ఋతువే వసంతమై పువ్వులు విసరగా
యదలే పెదవులై సుధలే కొసరగా
ఇంత పంతమేల బాలకా
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
కోరుకొ కోరిచేరుకో చేరిఏలుకో బాలకా 
నరుడా ఓ నరుడా ఏమి కోరిక

నా గిలి నిను అడిగెను తొలి కౌగిలి 
నీ చలీ స్వరమెరుగని ఒక జావళి
లేతలేత వన్నెలన్ని వెన్నెలేనయా
రగిలేవయసులో రసికత నాదిరా
పొగలే మనసులో మసకలు కమ్మెరా  
ఇంక బికమేల బాలకా  
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
కోరుకొ కోరిచేరుకో చేరిఏలుకో బాలకా 
కోరుకొ కోరిచేరుకో చేరిఏలుకో బాలకా 

నరుడా ఓ నరుడా ఏమి కోరిక 
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
నరుడా ఓ నరుడా ఏమి కోరిక 
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
కోరుకొ కోరిచేరుకో చేరిఏలుకో బాలకా 
కోరుకొ కోరిచేరుకో చేరిఏలుకో బాలకా 
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
నరుడా ఓ నరుడా ఏమి కోరిక 

Sunday, November 10, 2024

కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో (Letha manasulu)

Song Name :Kodi oka konalo
Movie:Letha manasulu
Singers:P. Suseela garu
Lyricist:Arudra garu
Composer:M.S. Viswanathan garu
DirectorKrishnana, Panju garlu

కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో, పిల్లలేమొ తల్లడిల్లె ప్రేమలేని కానలో 

కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో, పిల్లలేమొ తల్లడిల్లె ప్రేమలేని కానలో 

పాలకొరకు లేగదూడ పరుగులెత్తి సాగును 

పాలకొరకు లేగదూడ పరుగులెత్తి సాగును 

పక్షికూడ కూడు తెచ్చి పంచిపెట్టి మురియును 

పక్షికూడ కూడు తెచ్చి పంచిపెట్టి మురియును 

తత తెలుసునా జాలి కలుగునా 

తత తెలుసునా జాలి కలుగునా 

విడివిడిగా జీవించే వేదనలే తీరునా, వేదనలే తీరునా 

కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో, పిల్లలేమొ తల్లడిల్లె ప్రేమలేని కానలో 

పొరుగువాళ్ళ పాపలాగ పెట్టిపుట్టలేదులే..

పొరుగువాళ్ళ పాపలాగ పెట్టిపుట్టలేదులే..

అమ్మతో నాన్నతో హాయినోచుకోములే 

అమ్మతో నాన్నతో హాయినోచుకోములే 

అమ్మా మరవదూ, నాన్నా తలవడూ 

అమ్మా మరవదూ, నాన్నా తలవడూ 

కన్నవాళ్ళ కలపుటకూ మాకు వయసు లేదులే, మీకు మనసు రాదులే 

కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో, పిల్లలేమొ తల్లడిల్లె ప్రేమలేని కానలో 

అట్లాంటి ఇట్లాంటి హీరోని నేను (chantabbai)

Song Name :Atlanti itlanti
Movie:Chantabbai
Singers:S.P. Balasubramanyam garu, S.P. Sailaja garu
Lyricist:Veturi Sundararama Murthy garu
Composer:Chakravarthi garu
DirectorJandhyala garu

అట్లాంటి ఇట్లాంటి హీరోని నేను

మరి ఎట్లాంటి ఎట్లాంటి హీరో తమరు

స్విస్సు మిస్సునే సిటీబస్సులో కిస్సు చేసిన హీమాన్నీ

ఫ్రాన్సు లాన్సులో ఫ్రీలాన్సుగా డాన్సుచేసిన మొనగాణ్ణి

లాస్యానికీ డాల్ఫిన్నీ, హాస్యానికి చాప్లిన్నీ .. నే చార్లీ చాప్లిన్నీ 

నార్వేలోని మ్యారిమణుల గుండెల దాగిన ఖైదీని 

చల్లపిల్లిలో పిల్లిపిల్లలా దొరికిపోయిన ఖైదీవా 

హాంకాంగులో కింగ్ కాంగ్ నే తలదన్నిన మగధీరుణ్ణీ

బందరులోన బల్లిని చూసి బావురుమన్న మగధీరుడివా.. యా..

నా భాషకూ గ్రామర్ హ్యూమర్, నా ఫేసుకూ గ్లామర్ హ్యూమర్ 

ఇది ఎవరూ నమ్మని రూమర్, ఇక వెయ్యకు నాకీ హేమర్..

నే చార్లీ చాప్లిన్నీ....

అట్లాంటి ఇట్లాంటి హీరోని నేను

మరి ఎట్లాంటి ఎట్లాంటి హీరో తమరు

స్విస్సు మిస్సునే సిటీబస్సులో కిస్సు చేసిన హీమాన్నీ

ఫ్రాన్సు లాన్సులో ఫ్రీలాన్సుగా డాన్సుచేసిన మొనగాణ్ణి

లాస్యానికీ డాల్ఫిన్నీ, హాస్యానికి చాప్లిన్నీ .. నే చార్లీ చాప్లిన్నీ 

సిడ్నీ వెళ్ళి కిడ్నీ తీసి దానమిచ్చిన విజేతనూ 

వడ్లపూడి ఇడ్లీ పోటిలో ఓడిపోయిన విజేతవా 

మాస్కో డిస్కో ఒలింపిక్సులో కాస్కోమన్న రాజునీ .. మగమహారాజునీ 

మంగళగిరిలో మహిళామండలి అధ్యక్షతకే అర్హతవున్న మగువరాజువా.. మగమహారాజువా 

నా కంటికి రెప్పలు కామెడి, నా వొంటికి ఊపిరి కామెడి 

వనమంతా చెరిచెను తా చెడీ..డి డి డీ.. అది కోతికి చెందిన ట్రాజెడీ...డి డి డీ...

నే చార్లీ చాప్లిన్నీ....

అట్లాంటి ఇట్లాంటి హీరోని నేను

మరి ఎట్లాంటి ఎట్లాంటి హీరో తమరు

స్విస్సు మిస్సునే సిటీబస్సులో కిస్సు చేసిన హీమాన్నీ

ఫ్రాన్సు లాన్సులో ఫ్రీలాన్సుగా డాన్సుచేసిన మొనగాణ్ణి

లాస్యానికీ డాల్ఫిన్నీ, హాస్యానికి చాప్లిన్నీ .. నే చార్లీ చాప్లిన్నీ 

Thursday, November 7, 2024

ఉత్తరాన లేవంది ధృవ నక్షత్రం (Chantabbai)

Song Name :Uttaraana levandi
Movie:Chantabbai
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Veturi Sundararama Murthy garu
Composer:Chakravarthi garu
DirectorJandhyala garu

ఉత్తరాన లేవంది ధృవ నక్షత్రం, దక్షిణాన లేవంది మలయ పర్వతం

నింగిలేని తారకా నీవెక్కడా నీవెక్కడా

చెప్పవే నీ చిరునామ, చెప్పవే నీ చిరునామ

ఉత్తరాన లేవంది ధృవ నక్షత్రం, దక్షిణాన లేవంది మలయ పర్వతం

చుక్కపాపనడిగాను వెన్నెలమ్మ ఏదని..పిల్లగాలినడిగాను పూలకొమ్మ ఏదని

జాణవున్న తావునే జాజిమల్లె తావులు, ప్రాణమున్న చోటికే పరుగులెత్తు ఆశలు 

వెతికాయి నీ చిరునామ, వెతికాయి నీ చిరునామ 

తెలుపరాదటే ఓ ప్రియభామా...

ఉత్తరాన లేవంది ధృవ నక్షత్రం, దక్షిణాన లేవంది మలయ పర్వతం

ఈ నిశీధి వీధిలో బాటసారినై, ఈ విశాల జగతిలో బ్రహ్మచారినై 

నీ దర్శనభాగ్యమే కోరుకున్న కనులతో, నీ సన్నిధి కోసమే బ్రతుకుతున్న కలలతో 

వెతికాను నీ చిరునామా, వెతికాను నీ చిరునామా

తెలుపరాదటే ఓ ప్రియభామా...

ఉత్తరాన లేవంది ధృవ నక్షత్రం, దక్షిణాన లేవంది మలయ పర్వతం

నింగిలేని తారకా నీవెక్కడా నీవెక్కడా

చెప్పవే నీ చిరునామ, చెప్పవే నీ చిరునామ

Tuesday, November 5, 2024

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా (Swayamkrushi)

Song Name :Sinni sinni
Movie:Swayamkrushi
Singers:S. Janaki garu
Lyricist:Sirivennela Seetaraama Sastry garu
Composer:Ramesh Naidu garu
DirectorK. Viswanath garu

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

ఎరిగిన మనసుకు ఎరలేలే..ఏలిక శెలవిక శెరణేలే..

ఎరిగిన మనసుకు ఎరలేలే..ఏలిక శెలవిక శెరణేలే..

ఎవరికి తెలియని కథలివిలే ..ఎవరికి తెలియనీ కథలివిలే ..

ఎవరో చెప్పాగ ఇక ఏలే..

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

నెలత తలపులే నలుగులుగా..కలికి కనులతో జలకాలూ..

నెలత తలపులే నలుగులుగా..కలికి కనులతో జలకాలూ..

సందిటనేసిన చెలువములే.. సందిటనేసిన చెలువములే.. 

సుందరమూర్తికి చేలములూ...

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

కలల ఒరుపులే కస్తురిగా.. వలపు వందనపు తిలకాలూ..

వలపు వందనపు తిలకాలూ..

అంకము చేరిన పొంకాలే.. అంకము చేరిన పొంకాలే 

శ్రీవేంకట పతికికా.. వేడుకలు..

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ (SwayamKrushi)

Song Name :Siggu Poobanti
Movie:Swayamkrushi
Singers:S.P. Balasubramanyam garu, S. Janaki, S.P. Sailaja garu
Lyricist:Sirivennela Seetaraama Sastry garu
Composer:Ramesh Naidu garu
DirectorK. Viswanath garu

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

మొగ్గా సింగారం ఇరిసే సుదతీ మీనాచ్చీ...

సొగసూ సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా

సొగసూ సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా

రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా..

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

విరజాజి.. పూలబంతి అతసేతా మోయలేని

విరజాజి పూలబంతి అతసేతా మోయలేని సుకుమారి ఈ సిన్నదేనా..

శివునివిల్లు మోసిన జాణ.. ఈ సిన్నదేనా..

ఔరా అని రామయకన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు 

ఔరా అని రామయకన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు 

సూసీ అలకలొచ్చిన కలికీ 

సూసీ అలకలొచ్చిన కలికీ, ఏసినాది కులుకుల మలికి 

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

మొగ్గా సింగారం ఇరిసే సుదతీ మీనాచ్చీ...

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

శిరసొంచీ కూరుసున్నా, గురిసూసి సేరుకున్నా 

శిరసొంచీ కూరుసున్నా, గురిసూసి సేరుకున్నా.. సిలకమ్మ కొనసూపు సౌరూ..

బొండుమల్లె సెండు జోరు 

సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ రూపు

సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ రూపు

మెరిసే నల్లమబ్బైనాదీ 

మెరిసే నల్లమబ్బైనాదీ, వలపుజల్లు వరదైనాది

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

మొగ్గా సింగారం ఇరిసే సుదతీ మీనాచ్చీ...

సొగసూ సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా 

సొగసూ సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా

రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా..

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చి 

Sunday, November 3, 2024

కన్యాకుమారీ కనపడదా దారి (Bobbili Raaja)

Song Name :Kanya kumari kanapada daari
Movie:Bobbili Raaja
Singers:S.P. Balasubramanyam garu, S. Janaki garu
Lyricist:Sirivennela Seetaraama Sastry garu
Composer:Illayaraja garu
DirectorB. Gopal garu

కన్యాకుమారీ కనపడదా దారి, కయ్యాలమారి పడతావే జారి

పాతాళం కనిపెట్టేలా, ఆకాశం పనిపట్టేలా

ఊగకే మరి, మతిలేని సుందరి

జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం

గోపాలబాలా ఆపరఈగోల, ఈ కైపుఏలా ఊపర ఉయ్యాల 

మైకంలో మయసభ చూడు మహరాజ రా నా తోడు 

సాగనీ మరి సరదాల గారడీ 

జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం

కొండలూ గుట్టలూ చిందులాడే తదిగిణతోం..

వాగులూ వంకలూ ఆగిచూసే కథచెబుదాం 

తూనీగ రెక్కలెక్కుదాం సూరీడి పక్క నక్కుదాం

కుందేటి కొమ్ము వెతుకుదాం, బంగారు జింకనడుగుదాం

చూడమ్మా హంగామా, అడివంతారంగేట్రం సాగించే వెరైటీ ప్రోగ్రాం..

కళ్ళవిందుగా పైత్యాల పండగ 

జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం

కన్యాకుమారీ కనపడదా దారి.. ఆహ 

కయ్యాలమారి పడతావే జారి.. 

మైకంలో మయసభ చూడు మహరాజ రా నా తోడు 

సాగనీ మరి సరదాల గారడీ 

జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం

డేగతో ఈగలే ఫైటుచేసే చెడుగుడులో 

చేపలే చెట్టుపై పళ్ళుకోసే గడబిడలో 

నేలమ్మా తప్ప తాగెనో, ఏ మూలో తప్పిపోయెనో

మేఘాల కొంగు పట్టుకో, తూలేటి నడకనాపుకో 

ఓయమ్మో.. మాయమ్మో ..దిక్కుల్నే ఆటాడించే కిక్కుల్లో గందరగోళం..

వొళ్ళు వూగగా ఎక్కిళ్ళు రేగగా 

జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం

ఏయ్..గోపాలబాలా ఆపరఈగోల, ఈ కైపుఏలా ఊపర ఉయ్యాల  

పాతాళం కనిపెట్టేలా, ఆకాశం పనిపట్టేలా

ఊగకే మరి, మతిలేని సుందరి

జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం

సాగనీ మరి సరదాల గారడీ 

జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం 

జాబిలమ్మ నీకు అంత కోపమా (Pelli)

Song Name :Jaabilamma neeku antha kopama
Movie:Pelli
Singers:S.P. Bala subramanyam garu
Lyricist:Sirivennela Seeta raama Sastry garu
Composer:S.A Rajkumar garu
DirectorKodi Ramakrishna garu

జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా..

జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా..

నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదా రేయి ఆపుమ

జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా..

ఓ...ఓ..ఓ..

చిగురు పెదవిపైన, చిరునవ్వై చేరాలనుకున్నా 

చెలియ మనసులోన, సిరిమువ్వై ఆడాలనుకున్నా 

ఉన్నమాట చెప్పలేని గుండెలో, విన్నపాలు వినపడలేదా 

హారతిచ్చి స్వాగతించు కళ్ళలో, ప్రేమకాంతి కనపడలేదా

మరీ అంత దూరమా, కలలు కన్న తీరమా 

జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా..

ఓ... ఓ..ఓ..

మనసు చూడవమ్మా, కొలువుందో లేదో నీ బొమ్మా 

మనవి ఆలకించి, మన్నిస్తే చాలే చిలకమ్మా 

ప్రాణమున్న పాలరాతి శిల్పమా, ప్రేమనీడ చేరుకోని పంతమా

తోడుకోరి దగ్గరైతె దోషమా, తీయ్యనైన స్నేహమంటె ద్వేషమా

ఒక్కసారి నవ్వుమా, నమ్ముకున్న నేస్తమా..

జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా..

జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా..

నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదా రేయి ఆపుమ

జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా..

Friday, November 1, 2024

వాన వాన తేనెల వాన (Daddy)

Song Name :Vaana Vaana Tenela Vaana
Movie:Daddy
Singers:Udit Narayan garu, K.S. Chitra garu
Lyricist:Chandra Bose garu
Composer:S.A Rajkumar garu
DirectorSuresh Krishna garu

వాన వాన తేనెల వాన 

వాన వాన వెన్నెల వాన 

కురవని కురవనీ నే నిలువునా కరగనీ 

పాప కంటి చూపులలో పాలపంటి నవ్వులలో 

బాల మేఘమాలికలో జాలువారు తొలకరిలో 

తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోనీ 

తడిసి తడిసిపోనీ ముడి బిగిసి బిగిసిపోనీ 

చిరు చిరు పలుకుల చినుకులలో బిర బిర పరుగుల వరదలలో  

తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోనీ 

వాన వాన తేనెల వాన 

వాన వాన వెన్నెల వానా...

హైల హైల హలాలారే  హైల హైల హైలారే 

హైల హైల హలాలారే  హైల హైల హైలారే 

ముంగిట్లో మబ్బే వచ్చే మనసులోన మెరుపొచ్చే 

పన్నీటి చినుకే వచ్చే ప్రాణంలోన చిగురొచ్చే 

బుల్లి బుజ్జి వానదేవతొచ్చె గుండెపైన నీళ్ళుజల్లి లాలపోసె నేడే  

ఘల్లు ఘల్లు గాలిదేవతొచ్చె జీవితాన ప్రేమచల్లి లాలిపాట పాడే

ఒహో...శ్రావణలా రాణివచ్చీ, ఉన్న చీకూ చింతా చీకట్లన్ని కడిగే 

ఇంకా ఇంకా ఏంకావాలో అడిగే 

మధురంగా కథే సాగుతుంటే మనబెంగా ఇలా కరుగుతుంటే 

వేగంగా కలే తీరుతుంటే ఆ గంగా ఇలకు జారుతుంటే 

తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోనీ 

వాన వాన తేనెల వాన 

వాన వాన వెన్నెల వానా...

చిన్నతనం ముందరికొచ్చే, పెద్దరికం మరుపొచ్చే 

ఏటిగట్లు ఎదురుగవచ్చే, ఇసకగూళ్ళు గురుతొచ్చే 

కారుమబ్బు నీరుచిందుతుంటే, కాగితాల పడవలెన్నో కంటిముందుకొచ్చే 

నీటిలోన ఆటలాడుతుంటే, అమ్మ నోటి తీపితిట్లు జ్ఞాపకానికొచ్చే 

ఒహో.. పైటకొంగే గొడుగుకాగా, ఈ చాటు చోటు ఎంతో ఎంతో ఇరుకే 

ఎమైందంటే నీకు నాకు ఎరుకే 

ఒక్కటిగా ఇలా పక్కనుంటే, ఇద్దరమై సదా సర్దుకుంటే 

ముగ్గురిదీ ఒకే ప్రాణమంటూ, ముద్దులతో కథే రాసుకుంటూ 

తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోనీ 

వాన వాన తేనెల వాన 

వాన వాన వెన్నెల వానా...

కురవని కురవనీ నే నిలువునా కరగనీ 

పాప కంటి చూపులలో పాలపంటి నవ్వులలో 

బాల మేఘమాలికలో జాలువారు తొలకరిలో 

తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోనీ 

తడిసి తడిసిపోనీ ముడి బిగిసి బిగిసిపోనీ