| Title : | devude icchadu |
| Movie: | Antuleni kadha |
| Singers: | K.J. Yesudas గారు |
| Lyricist: | Aacharya Aatreyaగారు |
| Composer: | M.S. Viswanathan గారు |
| Director: | K. Bala chander గారు |
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేలా సొంత ఇల్లేలా
ఇక ఊరేలా సొంత ఇల్లేలా ఓ చెల్లెలా..
ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం
ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం
నన్నడిగి తల్లితండ్రి కన్నారా...ఆ...ఆ...
నన్నడిగి తల్లితండ్రి కన్నారా, నా పిల్లలే నన్నడిగి పుట్టారా..
పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా
నారు పోసి నీరు పోసే నాథుడు వాడమ్మా
ఏది నీది ఏది నాది, ఈ బేధాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
శిలలేని గుడికేల నైవేద్యం, ఈ కలలోని సిరికేల నీ సంబరం
ముళ్ళచెట్టుకు చుట్టూ కంచె ఎందుకు పిచ్చమ్మా
కళ్ళులేని కబోది చేతి దీపం నీవమ్మా
తొలుత ఇల్లు తుదకు మన్ను, ఈ బ్రతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం
తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం, అది తెలియకపోతేనే వేదాంతం
మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా
నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా
ఏది సత్యం ఏది నిత్యం, ఈ మమకారం వొట్టి అహంకారం ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి




