| Title : | ye teega puvvuno |
| Movie: | Maro charitra |
| Singers: | P. Suseela గారు |
| Lyricist: | Aatreya గారు |
| Composer: | M.S. Viswanathan గారు |
| Director: | K. Balachander గారు |
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
అప్పిడి ఎన్నా .. అర్థం కాలేదా
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో..
మనస్సు మూగది మాటలు రానిది మమత ఒక్కటే అది నేర్చినది
మనస్సు మూగది మాటలు రానిది మమత ఒక్కటే అది నేర్చినది
ఆహా.. అప్పిడియా ..పెద్ద అర్థమైనట్టు
బాషలేనిది బంధమున్నది మన ఇద్దరిని జతకూర్చినది
మన ఇద్దరిని జతకూర్చినది
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో..
వయసే వయసును పలకరించినది, వలదన్నా అది నిలువకున్నది
హేయ్ నీ రొంబ అళహార్కే.. ఆ రొంబ అంటే
ఎల్లలు ఏవీ ఒల్లనన్నవి నీదీ నాదొక లోకమన్నది
నీదీ నాదొక లోకమన్నది
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో..
తొలిచూపే నను నిలవేసినది మరుమాపై అది కలవరించినది
నల్ల పొణ్ణు అంటే నల్ల పిల్ల
మొదటి కలయికే ముడివేసినది, తుదిదాకా ఇది నిలకడైనది
తుదిదాకా ఇది నిలకడైనది
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో..
