Saturday, August 8, 2026

Life of Ram -E daareduraina [ఏ దారెదురైనా ఎటువెళుతుందో అడిగానా] - Jaanu

Title :E dareduraina 
Movie:Jaanu
Singers:Pradeep Kumar గారు
Lyricist:Sirivennela Sitarama sastry గారు
Composer:Govind Vasanth గారు
Director:C. Prem Kumar గారు

ఏ దారెదురైనా ఎటువెళుతుందో అడిగానా

ఏం తోచని పరుగై ప్రవహిస్తూ.. పోతున్నా

ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా

ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా

కదలని ఓ శిలనే అయినా తృటిలో కరిగే కలనే అయినా 

ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా 

ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్నా

ఎదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా

నా వెంటబడి నువ్వెంత ఒంటరి అనవద్దు అనొద్దు దయుంచి ఎవరూ 

ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు

నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది 

నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి 

ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇపుడే నను కనగా

అనగనగా అంటూనే ఉంటా ఎపుడూ పూర్తవనే అవ్వక తుదిలేని కథ నేనుగా

గాలివాటం లాగా ఆగే అలవాటేలేక కాలునిలవదు ఏ చోటా.. నిలకడగా 

ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేఖ ఎందుకు వేస్తోందో కేక .. మౌనంగా

నా వెంటబడి నువ్వెంత ఒంటరి అనవద్దు అనొద్దు దయుంచి ఎవరూ 

ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు

నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది 

నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి 

లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా.. విన్నారా 

నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా రాకూడదు ఇంకెవరైనా.. 

అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరిస్తూఉంది .. జాబిల్లి

అంత దూరనున్నా వెన్నెలగా చెంతనె ఉన్నా అంటూ ఊయలలూపింది .. జోలాలి 

తానే..నానే నా నినే .... 

Sunday, August 2, 2026

Errani kurradanni gopala [ఎర్రాని కుర్రదాన్ని గోపాల అహ చుర్రుమంది నీచూపు నాకేలా] - Premikudu

Title :errani kurradanni 
Movie:Premikudu
Singers:S.P. Balasubramanyam గారు, S. Janaki గారు
Lyricist:Rajasree  గారు
Composer:A.R. Rahman గారు
Director:Shankar గారు

ఎర్రాని కుర్రదాన్ని గోపాల అహ చుర్రుమంది నీచూపు నాకేలా

ఎర్రాని కుర్రదాన్ని గోపాల అహ చుర్రుమంది నీచూపు నాకేలా

కోడికోసమొచ్చావా గోపాల దాన్ని బుట్ట కింద దాచాను గోపాల

పుట్ట తేనె కావాల గోపాల దాన్ని ముంతలోన ఉంచాను గోపాల

గోపాల గోపాల రేపల్లె గోపాల

గోపాల గోపాల రేపల్లె గోపాల

కొండంత సింగారమందిస్తనియ్యాల రేపల్లే గోపాల

కోడికోసమొచ్చావా గోపాల దాన్ని బుట్ట కింద దాచాను గోపాల

పుట్ట తేనె కావాల గోపాల దాన్ని ముంతలోన ఉంచాను గోపాల

ఈ ఊరి పువ్వుకోసం అమ్మడు ఏరుదాటి వచ్చానే 

చిన్నవాడి రాక కోసం కళ్ళతో వేచివేచి చూసానే

ఆయాసం వచ్చేలా ఐదారు కిలోమీటర్లు నడిచానే

హాయి హాయి హాయి భలే హాయి హాయి లే

ఈ జోరు నీకేలా సందెపొద్దు దాక నువ్వు ఆగలేవా 

ఆగలేను నేను గుండెలో ఆగడాలు రగిలే

చీకటి పడితే పంచుకో చెంగుచాటు సిరులే

చెలియా నీ దేహం తళతళ మెరిసే బంగారం 

అరెరే నీ నోటా కవితలు పలికెను ఎన్నో

కోడికోసమొచ్చావా గోపాల దాన్ని బుట్ట కింద దాచాను గోపాల

పుట్ట తేనె కావాల గోపాల దాన్ని ముంతలోన ఉంచాను గోపాల

గోపాల గోపాల రేపల్లె గోపాల

గోపాల గోపాల రేపల్లె గోపాల

కొండంత సింగారమందిస్తనియ్యాల రేపల్లే గోపాల

ఎర్రాని కుర్రదాన్ని గోపాల అహ చుర్రుమంది నీచూపు నాకేలా

చక్కాని చుక్క నేను గోపాల నీకు చిక్కుతాను సయ్యంటే ఈయాల   

బుగ్గమీద ముద్దుపెడితే ఎక్కడో కలిగెను గిలిగింత

చెవిలోన ముద్దుపెడితే హమ్మమ్మా కళ్ళలోన కవ్వింత 

మావయ్యా మావయ్యా సిగ్గుమొగ్గలేసెను లేవయ్యా 

లె లె లె లె లె లె.. సన్నాయిలే 

అయ్యయ్యో అయ్యయ్యో సిత్తరాలు చూసాను నీలోనా

చిక్కుబుక్కు రయిలే జోరుగా వదిలెను పొగలే 

ఎత్తుపల్లమొస్తే నడకలో ఇక తికమకలే 

అహహా ఈ పూటా కనివిని ఎరుగని యోగం 

దొరికే ఈ చోటా ఎవరికి అందని స్వర్గం 

కోడికోసమొచ్చావా గోపాల దాన్ని బుట్ట కింద దాచాను గోపాల

పుట్ట తేనె కావాల గోపాల దాన్ని ముంతలోన ఉంచాను గోపాల

గోపాల గోపాల రేపల్లె గోపాల

గోపాల గోపాల రేపల్లె గోపాల

కొండంత సింగారమందిస్తనియ్యాల రేపల్లే గోపాల

ఎర్రాని కుర్రదాన్ని గోపాల అహ చుర్రుమంది నీచూపు నాకేలా

చక్కాని చుక్క నేను గోపాల నీకు చిక్కుతాను సయ్యంటే ఈయాల   

ఎర్రాని కుర్రదాన్ని గోపాల అహ చుర్రుమంది నీచూపు నాకేలా

చక్కాని చుక్క నేను గోపాల నీకు చిక్కుతాను సయ్యంటే ఈయాల   

Saturday, August 1, 2026

Dheevara Asama Souryadhaara [ధీవర ప్రసర శౌర్యధార ఉత్సర స్థిరగంభీరా] - Baahubali 1 / Bahubali 1

Title :Dhivara prasara souradhara
Movie:Baahubali - The Beginning
Singers:Ramya Behera గారు, Deepu గారు
Lyricist:Ramajogayya Sastry గారు, Siva sakthi datta  గారు
Composer:M.M. Keeravani గారు
Director:S.S. Rajamouli గారు

హునన హూనన హూనన హూన నచ్చానా

హునన హూనన హూనన హూన అంతగానా 

అందనిలోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా అల్లరి ఆశల అభిసారికనై నీకైచూస్తున్నా ఆ..

ధీవర ప్రసర శౌర్యధార ఉత్సర స్థిరగంభీరా  

ధీవర ప్రసర శౌర్యధార ఉత్సర స్థిరగంభీరా  

నననన యువ యువ యువ యువన యువయువన

అలసినా సొలసినా ఒడిలో నిన్ను లాలించనా 

అడుగునై నడపనా నీ జంట పయనించనా 

పడిపడి తలపడి వడివడి త్వరపడి వస్తున్నా ఎదేమైనా  

సిగముడి విడిచిన శిఖరపు జలసిరి ధారల్ని జటాజూటంలా ఢీకొని సవాళ్లని తెగించి నీవైపు దూసుకొస్తున్నా  

ఉత్క్రమ అసమశౌర్యధామ ప్రోద్గమ తవ భీతిర్మ

ఉత్క్రమ అసమశౌర్యధామ ప్రోద్గమ తవ భీతిర్మ 

నిలువునా ఎదగరా నినురమ్మంది నాతొందరా  

కదలికే కదనమై గగనానికెదురీదరా   

విజితరిపు రుధిరధారా కలిత అసిధర కఠోరా    

పులకుధర తులిత గంభీరా జయవిరాట్ వీరా  

విలయగగనతలభీకరా  గర్జద్ధారాధరా హృదయరసకాసారా  విజితమధుపారాపార 

భయకరం శౌ విభవసింధు  శుభరదం గం భరణరంధిం  

భయకరం శౌ విభవసింధు  శుభరదం గం భరణరంధిం  

భయకరం శౌ విభవసింధు  శుభరదం గం భరణరంధిం   

ధీవర ప్రసర శౌర్యధార ఉత్సర స్థిరగంభీరా  

ధీవర ప్రసర శౌర్యధార ఉత్సర స్థిరగంభీరా  

ధీవర ప్రసర శౌర్యధార దరికిచేరరారా ఉత్సర సుందరా స్థిరగంభీరా చెలి నీదేరా 

Oh Vennela [ఓ వెన్నెలా తెలిపేదెలా] - Prema Desam

Title :Oh vennela 
Movie:Prema Desam
Singers:Unni Krishnan గారు
Lyricist:Bhuvana Chandra గారు
Composer:A.R. Rahman గారు
Director:Kathir గారు

ఓ వెన్నెలా తెలిపేదెలా .. ఓ నేస్తమా నిలిచేదెలా

కళ్ళు కళ్ళూ కలిసాయంటా, వలపే పూవై పూసిందంట

నమ్మినవారే పూవ్వుని కోస్తే, నీ ఎదలో బాధ తీరేదెట్టా 

కళ్ళు కళ్ళూ కలిసాయంటా, వలపే పూవై పూసిందంట

నమ్మినవారే పూవ్వుని కోస్తే, నీ ఎదలో బాధ తీరేదెట్టా 

ఓ వెన్నెలా తెలిపేదెలా .. ఓ నేస్తమా నిలిచేదెలా

జడివాన నింగిని తడిచేయునా, గంధాలు పూవ్వుని విడిపోవునా

నన్నడిగి ప్రేమ ఎదచేరెనా, వలదన్న ఎదను విడిపోవునా 

మరిచాను అన్నా మరిచేదెలా, మరిచాక నేను బ్రతికేదెలా 

ఓ వెన్నెలా తెలిపేదెలా .. 

వలపించు హృదయం ఒకటే కదా, ఎడమైతే బ్రతుకు బరువేకదా 

నిలిపాను ప్రాణం నీకోసమే, కలనైన కూడా నీ ధ్యానమే 

మదిలోని ప్రేమా చనిపోదులే, ఏనాటికైనా నిను చేరులే 

ఓ వెన్నెలా తెలిపేదెలా .. 

ఓ నేస్తమా నిలిచేదెలా

కళ్ళు కళ్ళూ కలిసాయంటా, వలపే పూవై పూసిందంట

నమ్మినవారే పూవ్వుని కోస్తే, నీ ఎదలో బాధ తీరేదెట్టా 

కళ్ళు కళ్ళూ కలిసాయంటా, వలపే పూవై పూసిందంట

నమ్మినవారే పూవ్వుని కోస్తే, నీ ఎదలో బాధ తీరేదెట్టా 

Vennela vennela [వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే] - Premedesam

Title :vennela vennela
Movie:Prema Desam
Singers:Unni Krishnan గారు, S.P. Balasubramanyam గారు
Lyricist:Bhuvana Chandra గారు
Composer:A.R. Rahman గారు
Director:Kathir గారు

వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ 

కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళ 

వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

ఆశ ఎన్నడు విడువదా, అడగరాదని తెలియదా 

నా ప్రాణం చెలియా నీవేలే 

విరగబూసిన వెన్నెలా వదిలివేయకే నన్నిలా

రారాదా ఎదనీదే కాదా 

నిదురనిచ్చే జాబిలి నిదురలేక నీవే వాడినావా 

వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

మంచుతెరలో అలిసిపోయే మదన సంధ్య తూకెనే **

పుడమి ఒడిలో కలలు కంటూ పాపానీవు నిదురపో

మల్లె అందం మగువకెరుక మనసుబాధ తెలియదా

గుండెనిండా ఊసులే ఎదుటనుంటే మౌనమే 

జోలపాట పాడినానే నిదురలేక వాడినా 

వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ 

కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళ 

వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

Ledani cheppa nimushamu [లేదని చెప్ప నిముషము చాలు] - Priyuralu pilichindi

Title :Ledani cheppa
Movie:Priyuralu pilichindi
Singers:Shankar Mahadevan గారు
Lyricist:A.M. Ratnam, Siva Ganesh గారు
Composer:A.R. Rahman గారు
Director:Rajiv Menon గారు

లేదని చెప్ప నిముషము చాలు, లేదన్నమాట తట్టుకోమంటే

మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలె ఏమి చేయమందువే .. 

గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా.. న్యాయమా

ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా.. మౌనమా

చెలియా నాలో ప్రేమను తెలుపా ఒక గడియ చాలులే

అదే నేను రుజువే చేయా నూరేళ్ళూ చాలవే

లేదని చెప్ప నిముషము చాలు, లేదన్నమాట తట్టుకోమంటే

మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలె ఏమి చేయమందువే .. ఏమి చేయమందువే  

హృదయమొక అద్దమని నీరూపు బింబమని, తెలిపేను హృదయం నీకు సొంతమని

బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి, అద్దాల ఊయల బింబమూగె చెలీ..

నువ్వు తేల్చి చెప్పవే పిల్లా, లేక కాల్చి చెప్పవే లైలా 

నా జీవితం నీ కనుపాపలతో వెంటాడీ ఇక వేటాడొద్దే 

లేదని చెప్ప నిముషము చాలు, లేదన్నమాట తట్టుకోమంటే

మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలె ఏమి చేయమందువే .. ఏమి చేయమందువే  

గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా.. న్యాయమా

ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా.. మౌనమా

తెల్లారిపోతున్నా విడిపోని రాత్రేది, వాసనలు వీచే నీ కురులే సఖి 

లోకాన చీకటైనా వెలుగున్న చోటేది, సూరీడు మెచ్చే నీ కనులే చెలి

విశ్వ సుందరీమణులె వచ్చి నీ పాదపూజ చేస్తారే 

నా ప్రియసఖియా ఇక భయమేలా నా మనసెరిగి నా తోడుగరావే 

ఏమి చేయమందువే ఏమి చేయమందువే.. న్యాయమా... న్యాయమా 

ఏమి చేయమందువే ఏమి చేయమందువే.. మౌనమా.. మౌనమా 

ఏమి చేయమందువే   

Sasivadane sasivadane [శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా] - Iddaru

Title :Sasivadane sasivadane
Movie:Iddaru
Singers:Unni Krishnan గారు, Bombay jayashree  గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:A.R. Rahman గారు
Director:Mani Rathnam గారు

శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా

అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకుసిరి నీదా

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకుసిరి నీదా

నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట

శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా

మదనమోహిని చూపులోన మాండురాగమేలా

మదనమోహిని చూపులోన మాండురాగమేలా

పడుచువాడు నీ కన్ను వీక్షణ పంచదార కాదా

కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడిరాగం 

కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడిరాగం 

చందనం కలిసిన ఊపిరిలో, కరిగే మేఖల కటినివిల్లే

శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా

చందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకుసిరి నీదా

నెయ్యం వియ్యం ఏదేదైనా తనువు నిలువదేలా

నెయ్యం వియ్యం ఏదేదైనా తనువు నిలువదేలా

నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేలా

ఒకే ఒక ఛైత్రవేళ పురేవిడి పూతలాయె

ఒకే ఒక ఛైత్రవేళ పురేవిడి పూతలాయె

అమృతం కురిసిన రాతిరివో జాబిలి హృదయం జతచేరే 

నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట

శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకుసిరి నీదా 

Friday, July 31, 2026

Hello guru. [హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం] - Nirnayam

Title :Hello guru prema kosameroy
Movie:Nirnayam
Singers:S.P. Balasubramanyam గారు
Lyricist:Sirivennela Seetharama sastry గారు
Composer:Illayaraja గారు
Director:Priyadarshan గారు

హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం

ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహామహా సుందరాంగులే పొందలేనివాణ్ణి హార్నీ

హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం

ఉంగరాల జుట్టువాన్ని ఒడ్డుపొడుగు వున్నవాణ్ణి, చదువు సంధ్య గల్గినోడ్ని చౌకబేరమా

గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతటోడ్ని, కోరి నిన్ను కోరుకుంటే పెద్దనేరమా

నాకన్నా నీకున్న తాకీదులేంటమ్మా, నా ఎత్తు నా బరువు నీకన్న మోరమ్మా

నేనంటే కాదన్న లేడీసే లేరమ్మ, నాకంటె ప్రేమించే మొనగాడు ఎవరమ్మ 

I love you darling. because you are charming 

ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్లే, why not

హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం

ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహామహా సుందరాంగులే పొందలేనివాణ్ణి Yeah Yeah 

హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం , మగాడితో ఆడదానికేలా పౌరుషం

కట్టుకుంటె నిన్నే  తప్ప కట్టుకోనె కట్టుకోను, ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే

అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా, అల్లుకోవె నన్నెనీవు  మల్లెతీగలా 

నీచేతే పాడిస్తా లవ్‌సాంగ్లు డ్యూయెట్లు, నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లూ 

ఆహా నా పెళ్ళంట ఓహో నాపెళ్ళంటా, అభిమన్యుడు శశిరేఖ  అందాల జంటంటా 

అచ్చా మైనె ప్యార్ కియా, లుచ్చా కాం నహీ కియా , అమీ తుమీ తేలకుంటె నిను లేవదీస్కుపోతా 

are you ready?

హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం

ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహామహా సుందరాంగులే పొందలేనివాణ్ణి హార్నీ  

Wednesday, July 29, 2026

Undiporade gundenidele [ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే] - Husharu

Title :undiporade gunde nidele
Movie:Husharu
Singers:Sid Sriram గారు
Lyricist:Kittu Vissapragada గారు
Composer:Radhan గారు
Director:Sri Harsha konuganti గారు

ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే

అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది

మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నది

అందం అమ్మాయైతే నీలావుందా అన్నట్టుందే

మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే

ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే

నిశిలో శశిలా నిన్నే చూసాక, మనసే మురిసే ఎగసే అలలాగ

ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే

మండేఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెపుడూ చూడలే

చీకట్లో కూడా నీడలా నీవెంటే నేనుండగా 

వేరే జన్మంటూ నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలులే

అందం అమ్మాయైతే నీలావుందా అన్నట్టుందే

మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే

ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే

Sad version

నిన్నే నమ్మి చేసానే నేరం, కళ్ళే తెరిచి వెళుతున్నా దూరం

ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ఉందే నువ్వుచేసిన మోసమే

గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే నీతో గడిపిన ఆ కాలమే 

కన్నీరంటూ రాకున్నదే బాధే తీరే దారుండదే 

మగువకి మరుపంటే ఎంతో తేలికని నిన్నే చూసాకే తెలిసెను నేడే 

కాలం చేసే గాయం మానేదారే లేనేలేదా 

నా గుండెల్లో ముళ్ళే గుచ్చి చంపేసావే నన్నిలా 

చెప్పుకోలేనే బాధ నీతోనే .. 

Sunday, July 26, 2026

Neevega naa pranam [నీవేగా నా ప్రాణం అంట] - Oh Paapa laali

Title :Neevegaa naa pranam anta
Movie:Oh paapa laali
Singers:K.J. Yesudasu గారు, K.S. Chitra
Lyricist:Rajasri గారు
Composer:Illayaraja గారు
Director:Vasanth గారు

నీవేగా నా ప్రాణం అంట, నేడు నీ తోడే నాలోకం అంటా

నీవేగా నా ప్రాణం అంట, నేడు నీ తోడే నాలోకం అంటా

నీ నీడగా నే సాగేనులే నీ వెంటా...

నీవేగా నా ప్రాణం అంట, నేడు నీ తోడే నాలోకం అంటా

వెల్లివిరిసే వెన్నెలల్లే విరుల గంధం నీవుకావే 

ఆలపించే పాటలోని తేనెపలుకే నీవుకావే

పలికించే నే దిద్దుకున్న బొట్టుకొక అర్థముంది అంటనే

పల్లవించే నీ బంధనాల చందనాలు నాకుతెలుసు విన్నానే 

కలిసేనులే నే కరిగేనులే నీలోనా..

నీవేగా నా ప్రాణం అంట, నేడు నీ తోడే నాలోకం అంటా

నీవేగా నా ప్రాణం అంట, నేడు నీ తోడే నాలోకం అంటా

కంటివెలుగై నిలిచిపోనా మనసులోనా నిండిపోనా

కలలలోని కథను నేనై చివరివరకు తోడురానా 

స్వర్గమేలా నా గుండెలోన ఊపిరల్లే నీవు వుంటే అంతేగా

నన్ను పిలిచే నీ మాటలోని శృతినేనే అంతేలే 

నువ్వు లేనిదే ఇక నే లేనులే ఏనాడూ...

నీవేగా నా ప్రాణం అంట, నేడు నీ తోడే నాలోకం అంటా

నీ నీడగా నే సాగేనులే నీ వెంటా...

నీవేగా నా ప్రాణం అంట, నేడు నీ తోడే నాలోకం అంటా 

Oh paapa laali [ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి] - Geetanjali

Title :Oh paapa laali
Movie:Geetanjali
Singers:S.P. Balasubramanyam గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Mani Rathnam గారు

ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి... పాడనా తియ్యగా

ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి.. పాడనా 

నా జోలలా లీలగా తాకాలని, గాలినే కోరనా జాలిగా 

నీ సవ్వడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరిక

కలలారని పసిపాప తలవాల్చిన ఒడిలో 

తడినీడలు పడనీకే ఈ దేవత గుడిలో

చిరు చేపల కనుపాపలకిది నా మనవి

ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి... పాడనా తియ్యగా.. ఓ పాపా లాలి

ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి, గాలిలో తేలిపో వెళ్ళిపో

ఓ కోయిలా పాడవే నా పాటని, తీయ్యనీ తేనెలే చల్లిపో

ఇరు సందెలు కదలాడే ఎదఊయల ఒడిలో

సెలయేరుల అలపాటే వినిపించని గదిలో 

చలిఎండకు సిరివెన్నెలకిది నా మనవి

ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి... పాడనా తియ్యగా 

ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి.. పాడనా.. ఓ పాపా లాలి 

Amani paadave hayiga [ఆమనీ పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళ ] - Geetanjali

Title :Amani paadave haayiga
Movie:Geetanjali
Singers:S.P. Balasubramanyam గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Mani Rathnam గారు

ఆమనీ పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళ 

రాలేటిపూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో 

మంచు తాకి కోయిలా మౌనమైన వేళల

ఆమనీ పాడవే హాయిగా .. ఆమనీ పాడవే హాయిగా 

వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా 

మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక 

పదాల నా ఎద స్వరాల సంపద 

తరాల నా కథ క్షణాలదే కదా 

గతించిపోవు గాథ నేననీ...

ఆమనీ పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళ.. రాలేటిపూలా రాగాలతో 

శుకాలతో పికాలతో ధ్వనించిన మధూదయం 

దివి భువి కలా నిజం స్పృసించిన మహోదయం

మరో ప్రపంచమే మరింత చేరువై 

నివాళి కోరిన ఉగాదివేళలో 

గంతించిపోని గాథ నేననీ... 

ఆమనీ పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళ 

రాలేటిపూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో 

మంచు తాకి కోయిలా మౌనమైన వేళల

ఆమనీ పాడవే హాయిగా 

Saturday, July 11, 2026

ne tolisariga / ni aatemito [నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా / నీ ఆటేమిటో ఏనాటికీ ఆపవు కదా] - Santosham

Title :nE tolisariga / nI Atemito
Movie:Santosham
Singers:Usha గారు
Lyricist:Sirivennela seetarama sastry గారు
Composer:R.P. Patnaik గారు
Director:Dasaradh గారు

నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా 

నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా 

స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా 

మౌనమో మధురగానమో తనది అడగవేం హృదయమా 

ఇంతలో చేరువై అంతలో దూరమై, అందవా స్నేహమా

నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా 

నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా 

రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా 

ఎక్కడ వాలను చెప్పు నువ్వే సావాసమా 

హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా

వద్దకు రాకని ఆపకిలా అనురాగమా 

నడకలు నేర్పిన ఆశవు కదా, తడబడనీయ్యకు కదిలిన కథ 

వెతికే మనసుకు మమతే పంచుమా 

నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా 

నా కళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా 

ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా

అమృతమనుకొని నమ్మడమే ఒక శాపమా 

నీ ఒడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా 

తీయ్యని రుచిగల కటిక విషం నువ్వే సుమా 

పెదవులపై చిరునవ్వుల దగా, కనపడనీయ్యవు నిప్పుల సెగ 

నీటికి ఆరని మంటల రూపమా...

నీ ఆటేమిటో ఏనాటికీ ఆపవు కదా

నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా 

తెంచుకోనీయవు పంచుకోనీయవు ఇంత చెలగాటమా 

చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా 

పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా పంతమా బంధమా 

నీ ఆటేమిటో ఏనాటికీ ఆపవు కదా

నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా  

E chota unna [ఏ చోట ఉన్నా .. నీ వెంట లేనా] - Nuvve Nuvve

Title :E chota unna
Movie:Nuvve Nuvve
Singers:K.S. Chitra గారు
Lyricist:Sirivennela Seetaraama sastryగారు
Composer:Koti గారు
Director:Trivikram Srinivas గారు

ఏ చోట ఉన్నా .. నీ వెంట లేనా

సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే 

ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటే 

రేపులేని చూపు నేనై శ్వాశలేని ఆశ నేనై మిగలనా..

నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం 

నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతిక్షణం నా మౌనం 

ఏ చోట ఉన్నా .. నీ వెంట లేనా

సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే 

ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటే 

నేలవైపు చూసే నేరం చేసావని, నీలిమబ్బు నిందిస్తుందా వానచినుకుని

గాలివెంట వెళ్ళే మారం మానుకోమని, తల్లితీగ బంధిస్తుందా మల్లెపూవుని

ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం, ఇకనైనా చాలించమ్మా వేధించడం 

చెలిమై కురిసే సిరివెన్నెలవా, క్షణమై కరిగే కలవా 

నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం 

నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతిక్షణం నా మౌనం 

రేపులేని చూపు నేనై శ్వాశలేని ఆశ నేనై మిగలనా..

వేలుపట్టి నడిపిస్తుంటే చంటిపాపలా , నా అడుగులు అడిగేతీరం చేరేదెలా 

వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కల, కంటిపాప కోరే స్వప్నం చూసేదెలా 

నాక్కూడ చోటేలేని నా మనసులో , నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో 

వెతికే మజిలీ దొరికే వరకు, నడిపే వెలుగై రావా 

నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం 

నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతిక్షణం నా మౌనం 

ఏ చోట ఉన్నా .. నీ వెంట లేనా 

సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే 

ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటే  

ni kosame ee anveshana [నీ కోసమే ఈ అన్వేషణ ] - Nuvvu Nenu

Title :ni kosame ee anveshana
Movie:Nuvvu Nenu
Singers:K K  గారు
Lyricist:Kula Sekhar గారు
Composer:R.P. Patnaik గారు
Director:Teja గారు

నీ కోసమే ఈ అన్వేషణ , నీ ధ్యాసలో ఈ ఆలాపన

ఎడబాటు రేపిన విరహ వేదన, నరకయాతన

కాలమే దీపమై దారిచూపునా

నీ కోసమే ఈ అన్వేషణ , నీ ధ్యాసలో ఈ ఆలాపన

కళ్ళలోన నిను దాచిన, ఊహల్లోన ఊసులాడినా

స్వప్నంలోన ఎంత చూసినా విరహమే తీరదే

జాజికొమ్మ గాని ఊగినా, కాలిమువ్వ గాని మోగినా

చల్లగాలి నన్ను తాకినా నీవనే భావనే

ఎదురుగ లేనిదే నాకేం తోచదే, రేపటి వేకువై రావే...

నీ కోసమే ఈ అన్వేషణ , నీ ధ్యాసలో ఈ ఆలాపన

నిన్ను తప్ప కన్ను చూడదే, లొకమంతా చిమ్మ చీకటే

నువ్వు తప్ప దిక్కు లేదులే, ఓ సఖీ నమ్మవే

గుండెగూడు చిన్నబోయనే, గొంతు ఇంక మూగబోవునే 

నీవులేక ఊపిరాడదే, ఓ చెలి చేరవే

ఆశలు ఆవిరై మోడై పోతినే, తొలకరి జల్లువై రావే 

నీ కోసమే ఈ అన్వేషణ , నీ ధ్యాసలో ఈ ఆలాపన

ఎడబాటు రేపిన విరహ వేదన, నరకయాతన

కాలమే దీపమై దారిచూపునా

నీ కోసమే ఈ అన్వేషణ , నీ ధ్యాసలో ఈ ఆలాపన 

Wednesday, July 8, 2026

sarigamapadani rasa nasa [సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస] - Marana Mrudangam

Title :Sarigama padanisa rasa nasa
Movie:Marana Mrudangam
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Kondanda Rami Reddy గారు

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

ముద్దుపెట్టు ముద్దుపెట్టు పద, ముద్దులేక పొద్దుపోని కథ

ముద్దుకాటు పడ్డ కన్నె ఎద, విచ్చుకున్న ముద్దబంతి కద

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

రెండు హృదయాల పిట్టపోరు తీరనంటుంది ఎందుకో 

దొంగయోగాల కొంగ గారు గాలమేసేది ఎందుకో 

చేతికందాక జాబిలి చుక్కతో నాకు ఏంపని 

తట్టుకున్నాక కౌగిలి ఏమికావాలో చెప్పనీ

కస్సుమన్నదాని సోకు కసిగా ఉంటుంది

తుమ్మెదొచ్చి వాలినాకా పువ్వేమంటుంది 

సిగ్గో చీనీలపండు బుగ్గో బత్తాయిపండు అల్లో నేరేడుపండు నాదీ 

అరె నా నా నా నా నా.. నేనే కాదంటున్నానా ..

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

ముద్దుపెట్టు ముద్దుపెట్టు పద, ముద్దులేక పొద్దుపోని కథ

ముద్దుకాటు పడ్డ కన్నె ఎద, విచ్చుకున్న ముద్దబంతి కద

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

వయసు వడగళ్ళ వాన నీరు, వంటపట్టింది పిండుకో 

నన్ను దులిపేసి వలపు గాలి, నిన్ను తాకింది తట్టుకో 

లేత అందాల దోపిడి ఇప్పుడే కాస్త ఆపనీ 

ఆపినా ఆగి చావదు అందచందాల ఆ పని 

ఇంతదాక వచ్చినాకా ఇంకేమౌతుంది 

లబ్జు లబ్జు మోజు మీద లంకే అవుతుంది 

అబ్బో నా బోయ్‌ఫ్రెండు ముద్దిస్తే నోరు పండు వాటేస్తే వొళ్ళుపండునమ్మా 

అరె నా నా నా నా నా.. నేనే కాదంటున్నానా ..

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

ముద్దుపెట్టు ముద్దుపెట్టు పద, ముద్దులేక పొద్దుపోని కథ

ముద్దుకాటు పడ్డ కన్నె ఎద, విచ్చుకున్న ముద్దబంతి కద

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస 

Saturday, July 4, 2026

Punnami rathri [పున్నమి రాత్రి పువ్వుల రాత్రి] - Punnami Nagu

Title :punnami ratri
Movie:punnami nagu
Singers:S.P. Balasubramanyam గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Chakravarthi గారు
Director:Rajasekhar గారు

పున్నమి రాత్రి పువ్వుల రాత్రి, వెల్లువ నాలో పొంగిన వెన్నెల రాత్రి

పున్నమి రాత్రి పువ్వుల రాత్రి, వెల్లువ నాలో పొంగిన వెన్నెల రాత్రి

మగువ సోకులే మొగలి రేకులై మత్తుగ పిలిచే రాత్రి

మరుడు నరుడిపై మల్లెలు చల్లి మైమరపించే రాత్రి

ఈ వెన్నెలలో ఆ వేదనలో 

ఈ వెన్నెలలో ఆ వేదనలో, నాలో వయసుకు నవరాత్రి 

కలగా మిగిలే కడరాత్రి 

పున్నమి రాత్రి పువ్వుల రాత్రి, వెల్లువ నాలో పొంగిన వెన్నెల రాత్రి

కోడె నాగుకై కొదమ నాగిని కన్నులు మూసే రాత్రి

కామదీక్షలో కన్నెలందరూ మోక్షం పొందే రాత్రి 

నా కౌగిలిలో ఈ రాగిణితో 

నా కౌగిలిలో ఈ రాగిణితో తొలకరి వలపుల తొలిరాత్రి 

ఆఖరి పిలుపుల తుదిరాత్రి 

పున్నమి రాత్రి పువ్వుల రాత్రి, వెల్లువ నాలో పొంగిన వెన్నెల రాత్రి 

Friday, July 3, 2026

Swara raga ganga pravahame [స్వరరాగ గంగా ప్రవాహమే] - Sarigamalu

Title :swara raga ganga pravahame
Movie:Sarigamalu
Singers:K.J. Yesudas గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Bombay Ravi గారు
Director:Kranthi Kumar గారు

ప్రవాహమే... గంగా ప్రవాహమే  

స్వరరాగ గంగా ప్రవాహమే, అంగాత్మ సంధాన యోగమే 

ప్రాప్తేవ సంతేతికాలికే పలికే కుహుగీతికా.. గానసరసీ రుహమాలిక

స్వరరాగ గంగా ప్రవాహమే, అంగాత్మ సంధాన యోగమే 

ప్రాప్తేవ సంతేతికాలికే పలికే కుహుగీతికా.. గానసరసీ రుహమాలిక

స్వరరాగ గంగా ప్రవాహమే

కొండలలోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి 

పిల్లనగ్రోవిలో పిలవని మోవిలో కురిసెను రాగం ఈనాటికి 

మట్టింటి రాయే మాణిక్యమైపోయే, సంగీత రత్నాకరానా 

స్వరసప్తకాలే కెరటాలుకాగా, ఆ గంగ పొంగింది లోన 

స్వరరాగ గంగా ప్రవాహమే, అంగాత్మ సంధాన యోగమే 

ప్రాప్తేవ సంతేతికాలికే పలికే కుహుగీతికా.. గానసరసీ రుహమాలిక 

స్వరరాగ గంగా ప్రవాహమే

చైతన్య వర్ణాల ఈ చైత్రసుమగీతి వినిపించు రాగాలనంతాలులే

ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు జగమంత విహరించు రాగాలులే 

పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు పులకింతలా పుష్యరాగాలులే 

మలిసంధ్య దీపాలు గుడిగంట నాదాలు మౌనాక్షరీ గాన వేదాలులే 

స్వరరాగ గంగా ప్రవాహమే, అంగాత్మ సంధాన యోగమే 

ప్రాప్తేవ సంతేతికాలికే పలికే కుహుగీతికా.. గానసరసీ రుహమాలిక

స్వరరాగ గంగా ప్రవాహమే

స్వరరాగ గంగా ప్రవాహమే 

Sunday, June 28, 2026

ade neevu ade nenu [అదే నీవు అదే నేను అదే గీతం పాడనా] - Abhinandana

Title :ade neevu ade nenu 
Movie:Abhinandana
Singers:గానగంధర్వ  S.P. Balasubramanyam గారు
Lyricist:Aatreya గారు
Composer:Illayaraja గారు
Director:Ashok Kumar గారు

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా 

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా 

కథైనా కలైనా కనులలో చూడనా 

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా 

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా 

కొండ కోన గుండెల్లో ఎండ వానలైనాము 

కొండ కోన గుండెల్లో ఎండ వానలైనాము 

గువ్వా గువ్వ కౌగిల్లో గూడు చేసుకున్నము 

అదే స్నేహము, అదే మోహము

అదే స్నేహము, అదే మోహము

ఆది అంతం ఏదీ లేని గానము..

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా 

కథైనా కలైనా కనులలో చూడనా 

నిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావు 

నిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావు 

కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావు 

అదే బాసగా అదే ఆశగా 

అదే బాసగా అదే ఆశగా 

ఎన్ని నాళ్ళు ఈ నిన్న పాటే పాడను 

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా 

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా 

కథైనా కలైనా కనులలో చూడనా 

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా 

Prema enta madhuram [ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం] - Abhinandana

Title :Prema enta madhuram
Movie:Abhinandana
Singers:గానగంధర్వ  S.P. Balasubramanyam గారు
Lyricist:Aatreya గారు
Composer:Illayaraja గారు
Director:Ashok Kumar గారు

ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం 

ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం 

చేసినాను ప్రేమక్షీరసాగర మధనం, మింగినాను హలాహలం

ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం 

ప్రేమించుటేనా నా దోషము, పూజించుటేనా నా పాపము 

ఎన్నాళ్ళని ఈ ఎదలో ముళ్ళు, కన్నీరుగయి కరిగే కళ్ళు 

నాలోని నీ రూపము, నా జీవనాధారము 

అది ఆరాలి పోవాలి ప్రాణము 

ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం 

నేనోర్వలేను ఈ తేజము, ఆర్పేయరాదా ఈ దీపము 

ఆ చీకటిలో కలిసేపోయి, నా రేపటిని మరిచేపోయి

మానాలి నీ ధ్యానము, కావాలి నే శూన్యము

అపుడాగాలి ఈ మూగ గానము

ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం 

చేసినాను ప్రేమక్షీరసాగర మధనం, మింగినాను హలాహలం

ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం

Aalanaga paalanaga [ఆలనగా పాలనగా అలసినవేళల అమ్మవుగా] - Kumkuma Tilakam

Title :Aalanaga paalanaga
Movie:Kumkuma tilakam
Singers:K.J. Yesudas గారు
Lyricist:Mailavarapu Gopi గారు
Composer:Satyam గారు
Director:B. Bhaskar Rao గారు

ఆలనగా పాలనగా అలసినవేళల అమ్మవుగా

లాలించు ఇల్లాలిగా దేవి పాలించు నా రాణిగా

ఆలనగా పాలనగా అలసినవేళల అమ్మవుగా

లాలించు ఇల్లాలిగా దేవి పాలించు నా రాణిగా

నీ చిరునవ్వే తోడైవుంటే, నే గెలిచేను లోకాలన్ని 

నీ చిరునవ్వే తోడైవుంటే, నే గెలిచేను లోకాలన్ని 

అర ఘడియైనా నీ ఏడబాటు, వెన్నెల కూడా చీకటి నాకు 

లాలించు ఇల్లాలిగా దేవి పాలించు నా రాణిగా

మోమున మెరిసే కుంకుమ తిలకం, నింగిని వెలిగే జాబిలి కిరణం 

మోమున మెరిసే కుంకుమ తిలకం, నింగిని వెలిగే జాబిలి కిరణం 

నేనంటే నీ మంగళ సూత్రం, నువ్వంటే నా ఆరో ప్రాణం

లాలించు ఇల్లాలిగా దేవి పాలించు నా రాణిగా

ఆలనగా పాలనగా అలసినవేళల అమ్మవుగా

లాలించు ఇల్లాలిగా దేవి పాలించు నా రాణిగా

Friday, June 26, 2026

kaastanduko darakhastanduko [కాస్తందుకో దరఖాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో] - Rendu rellu Aaru

Title :Kaastanduko darakhaastanduko
Movie:Rendu rellu aaru
Singers:గానగంధర్వ  S.P. Balasubramanyam గారు,
S. Janaki 
 గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Rajan Nagendran గారు
Director:హాస్యబ్రహ్మ  Jandhyala గారు

కాస్తందుకో దరఖాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో

ముద్దులతోనే ముద్దరవేసి ప్రేయసి కౌగిలి అందుకో

కాస్తందుకో దరఖాస్తందుకో భామ దరఖాస్తందుకో

దగ్గర చేరి దస్ఖతుచేసి ప్రేయసి కౌగిలి అందుకో

కాస్తందుకో దరఖాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో

చిరుగాలి దరఖాస్తు లేకుంటె కరిమబ్బు 

చిరుగాలి దరఖాస్తు లేకుంటె కరిమబ్బు 

మెరుపంత నవ్వునా చినుకైన రాలునా

జడివాన దరఖాస్తు పడకుంటే సెలయేరు 

జడివాన దరఖాస్తు పడకుంటే సెలయేరు 

వరదల్లే పొంగునా కడలింక చేరునా 

శుభమస్తు అంటే దరఖాస్తు ఓకే 

కాస్తందుకో దరఖాస్తందుకో భామ దరఖాస్తందుకో

చలిగాలి దరఖాస్తు తొలి ఈడు వినకుంటే 

చలిగాలి దరఖాస్తు తొలి ఈడు వినకుంటే 

చెలి జంట చేరునా, చెలిమల్లే మారునా

నెలవంక దరఖాస్తు, లేకుంటే చెక్కిళ్ళు 

నెలవంక దరఖాస్తు, లేకుంటే చెక్కిళ్ళు 

ఎరుపెక్కి పోవునా ఎన్నెల్లు పండూనా 

దరిచేరు కూడా దరఖాస్తులేలా 

కాస్తందుకో దరఖాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో

దగ్గర చేరి దస్ఖతుచేసి ప్రేయసి కౌగిలి అందుకో

కాస్తందుకో దరఖాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో 

Monday, June 22, 2026

Raade cheli nammaraade cheli [రాదేచెలి నమ్మరాదేచెలి మగవారినిలా నమ్మరాదేచెలి] - Mr Pellam

Title :Raade cheli nammaraadecheli
Movie:Mr Pellam
Singers:K.S. Chitra గారు
Lyricist:Aarudra గారు
Composer:M.M. Keeravani గారు
Director:Bapu గారు

రాదేచెలి నమ్మరాదేచెలి మగవారినిలా నమ్మరాదేచెలి

రాదేచెలి నమ్మరాదేచెలి మగనాలీమనసమ్మ రాదేచెలి

నాడు పట్టుచీర కట్టవద్దు బరువన్నాడే 

నేడు నూలుచీరకే డబ్బులు కరువన్నాడే 

నెలపట్టిన నెలత తనకు పరువన్నాడే

నేడు నెలబాలుని చేతికిస్తే బరువన్నాడే

ముంగురులని చూసి తాను మురిసిపోయాడే 

ఆ కురులకి విరులివ్వడమే మరిచిపోయాడే

ప్రేమించు సీజన్లో పెద్దమాటలు, పెళ్ళయ్యాకా ప్లేటు ఫిరాయింపులు

మొదటివలపు మధురకథలు మరచెను ఘనుడు.. మగవారినిలా నమ్మరాదేచెలి

రాదేచెలి నమ్మరాదేచెలి మగవారినిలా నమ్మరాదేచెలి

మాటల్తో కోటకట్టాడే.. అమ్మో.. నా మహారాణి నీవన్నాడే

కాలు కింద పెడితేనే కందిపోవునన్నాడే 

గాలితాకితే మోమున పాలు విరుగునన్నాడే 

కవ్వించుకున్నాడే కౌగిలికోసం

ఆ కాస్తా తీరాకా మొదటికి మోసం 

మనవి వినడు, మనసు కనడు మాయల మొగుడు.. మగవారినిలా నమ్మరాదేచెలి

రాదేచెలి నమ్మరాదేచెలి మగవారినిలా నమ్మరాదేచెలి

రాదేచెలి నమ్మరాదేచెలి మగనాలీమనసమ్మ రాదేచెలి

తలలో నాలుకలా పూసలలో దారంబుమాట్టే 

సతిమదిలోనన్ మెలగెడు పురుషుడు కలుగుట

తొలిజన్మము నోముఫలము తోయుజనేత్రా 

తనుగా వలచిన వరుడేనా ఈ పురుషోత్తముడు 

వ్రతములు సలిపిన సతులకు గతికలదా 

వినదా కలదా లేదా 

Sunday, June 21, 2026

Srirastu Subhamastu [శ్రీరస్తు శుభమస్తు] - Pelli Pustakam

Title :Srirastu subhamastu
Movie:Pelli pustakam
Singers:S.P. Balasubramanyam గారు, P. Suseela గారు
Lyricist:Aarudra గారు
Composer:K.V. Mahadevan గారు
Director:Bapu గారు

శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తూ శుభమస్తు 

శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తూ శుభమస్తు 

శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్తజీవితం 

శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్తజీవితం 

శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తూ శుభమస్తు 

తలమీద చెయ్యివేసి ఒట్టుపెట్టీనా, తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా

తలమీద చెయ్యివేసి ఒట్టుపెట్టీనా, తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా

సన్నికల్లు తొక్కినా, సప్తపదులు మెట్టినా 

సన్నికల్లు తొక్కినా, సప్తపదులు మెట్టినా  

మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం 

శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తూ శుభమస్తు 

అడుగడుగున తొలిపలికులు గుర్తుచేసుకో, తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో 

అడుగడుగున తొలిపలికులు గుర్తుచేసుకో, తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో 

ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని

ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని

మసకేయని పున్నమిలా మనికి నింపుకో...

శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తూ శుభమస్తు 

శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్తజీవితం 

శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తూ శుభమస్తు 

Sarikotta chira oohinchinanu [సరికొత్త చీర ఊహించినాను] - Pelli pustakam

Title :Sarikotta chira
Movie:Pelli pustakam
Singers:S.P. Balasubramanyam గారు
Lyricist:Aarudra గారు
Composer:K.V. Mahadevan గారు
Director:Bapu గారు

సరికొత్త చీర ఊహించినాను, సరదాల సరిగంచు నేయించినాను

మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను

ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశికి సిరిజోత 

నా వన్నెల రాశికి సిరిజోత 

ముచ్చటగొలిపే మొగలిపొద్దుకు, ముళ్ళూ వాసన ఒక అందం

అభిమానం గల ఆడపిల్లకు, అలక కులుకు ఒక అందం 

ఈ అందాలన్ని కలబోశా, నీ కొంగుకు చెంగున ముడివేస్తా 

నీ అందాలన్ని కలబోశా, నీ కొంగుకు చెంగున ముడివేస్తా 

ఇది ఎన్నో కలల కలనేత, నా వన్నెల రాశికి సిరిజోత

నా వన్నెల రాశికి సిరిజోత 

చుర చుర చూపులు ఒక మారు, నీ చిరు చిరు నవ్వులు ఒక మారు

మూతివిరుపులు ఒక మారు, నువ్వు ముద్దుకు సిద్ధం ఒక మారు 

నువ్వు ఏ కళనున్నా మా బాగే, ఈ చీర విశేషం అల్లాగే 

నువ్వు ఏ కళనున్నా మా బాగే, ఈ చీర విశేషం అల్లాగే 

సరికొత్త చీర ఊహించినాను, సరదాల సరిగంచు నేయించినాను

మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను

ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశికి సిరిజోత 

నా వన్నెల రాశికి సిరిజోత 

Krishnam kalayasakhi [కృష్ణం కలయ సఖి సుందరం] - Pelli Pustakam

Title :Krishnam kalayasakhi
Movie:Pelli pustakam
Singers:S.P. Sailaja గారు
Lyricist:Aarudra గారు
Composer:K.V. Mahadevan గారు
Director:Bapu గారు

కృష్ణం కలయ సఖి సుందరం, బాల కృష్ణం కలయ సఖి సుందరం

కృష్ణం కథవిషయ తృష్ణం

కృష్ణం కథవిషయ తృష్ణం జగత్‌ప్రభ విష్ణుం సురరిగణ జిష్ణుం సదా 

బాలకృష్ణం కలయసఖి సుందరం 

శృంగార రసభర సంగీత సాహిత్య 

శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరి ఖేల సంగం సదా 

బాలకృష్ణం కలయసఖి సుందరం 

బాలకృష్ణం కలయసఖి సుందరం 

రధారుణతర సుథాపం సచ్చిదానంద

రధారుణతర సుథాపం సచ్చిదానందరూపం జగత్రయభూపం సదా

బాలకృష్ణం కలయసఖి సుందరం 

బాలకృష్ణం కలయసఖి సుందరం 

అర్థంసిథిలీకృతానర్ధం శ్రీనారాయణ

అర్థంసిథిలీకృతానర్ధం శ్రీనారాయణ తీర్థం పరమపురుషార్ధం సదా

బాలకృష్ణం కలయసఖి సుందరం 

బాలకృష్ణం కలయసఖి సుందరం  

Ammukutti ammukutti [అమ్ముకుట్టి అమ్ముకుట్టి మనసిలాయో] - Pelli Pustakam

Title :Ammukutti ammukutti
Movie:Pelli pustakam
Singers:S.P. Balasubramanyam గారు, P. Suseela గారు
Lyricist:Aarudra గారు
Composer:K.V. Mahadevan గారు
Director:Bapu గారు

అమ్ముకుట్టి అమ్ముకుట్టి మనసిలాయో... కిట్టమూర్తి కిట్టమూర్తి తెలుసులేవోయ్ 

అమ్ముకుట్టి అమ్ముకుట్టి మనసిలాయో... కిట్టమూర్తి కిట్టమూర్తి తెలుసులేవోయ్ 

ఓ.. అసెలే విరహం అయ్యో దూరం ఎల్లాగున్నావు 

హా.. చారెడు పిడికెడు బారెడు పిల్లా ఎల్లాగున్నావు 

ఎందా..

చెంపకు కన్నులు చారెడు, సన్నని నడుము పిడికెడు

దువ్వీ దువ్వక పువ్వులు ముడిచిన నల్లని నీ జడ బారెడు 

మనసిలాయో....

అమ్ముకుట్టి అమ్ముకుట్టి మనసిలాయో... కిట్టమూర్తి కిట్టమూర్తి తెలుసులేవోయ్ 

హా.. అయ్యో పావం ఆషాద్రికాయం ఎందా ఈ..అదేవిటి 

ఓ.. గుటకలు చిటికెలు కిటుకులు అబ్బో చాలా గడుసు

హూ.. గుటకలు చిటికెలు కిటుకులు... ఎంటి సంగతి

హా.. కులుకు చూస్తే గుటకలు, సరసకు రమ్మని చిటికెలు 

చక్కని చిన్నది అందం చందం చేజిక్కాలని కిటుకులు 

మనసిలాయో... కిట్టమూర్తి కిట్టమూర్తి మనసిలాయో

మనసిలాయో మనసిలాయో అమ్ముకుట్టి

గుండెల్లోన గుబ గుబలాడే ఊహల ఊరెను ఉవ్విళ్ళు 

పరవశమైన మా శ్రీవారికి పగ్గాల్లేని పరవళ్ళు 

చుట్టూ చూస్తే అందాలు, లొట్టలు వేస్తూ మావారు 

చుట్టూ చూస్తే అందాలు, లొట్టలు వేస్తూ మావారు 

అక్కడ తమకు, ఇక్కడ మనకు విరహంలోన వెక్కిళ్ళు

మనసిలాయో...

అమ్ముకుట్టి అమ్ముకుట్టి మనసిలాయో... కిట్టమూర్తి కిట్టమూర్తి తెలుసులేవోయ్ 

అమ్ముకుట్టి ..అమ్ముకుట్టి అమ్ముకుట్టి మనసిలాయో... కిట్టమూర్తి కిట్టమూర్తి తెలుసులేవోయ్ 

Saturday, June 20, 2026

Aaku chaatu pinde tadise [ఆకుచాటు పిందె తడిసే] - Vetagadu

Title :Aakuchaatu pinde tadise
Movie:Vetagadu
Singers:S.P. Balasubramanyam గారు, P. Suseela గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Chakravarthi గారు
Director:K. Raghavendra Rao గారు

ఆకుచాటు పిందె తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే

ఆకుచాటు పిందె తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే

ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది

గోదారి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది

గూడుచాటు గువ్వ తడిసే, గుండెమాటు గుట్టు తడిసే

గూడుచాటు గువ్వ తడిసే, గుండెమాటు గుట్టు తడిసే

ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది

గోదారి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది

ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే.. అహ అహ అహ అహ

చిగురాకు పాదాలా సిరిమువ్వ అవుతుంటే.. అహ అహ అహ అహ

ఓ చినుకు నినుతాకి తడి ఆరిపోతుంటే 

ఓ చినుకు నినుతాకి తడి ఆరిపోతుంటే 

ఓ చినుకు నీ మెడలో నగలాగా నౌతుంటే 

నీ మాట విని మబ్బు మెరిసే, ఆహా 

జడివానలే కురిసి కురిసి, వొళ్ళు తడిసీ వెల్లి విరిసి 

చిలిపి చినుకుల్లో తలదాచు కోవాలి .. అహ అహ ఆహ అహ అహ ఆహ 

ఆకుచాటు పిందె తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే

ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది

గోదారి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది

మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే.. అహ అహ అహ అహ

ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే.. అహ అహ అహ అహ

ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే 

ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే 

ఆహ.. నీ ఫట విని మెరుపులొచ్చి

ఆహ.. నీ విరుపులే ముడుపులిచ్చి 

చలిని పెంచి చెలిమి పంచి, తలలు వెచ్చంగ తడి ఆర్చుకోవాలి .. అహ అహ ఆహ అహ అహ ఆహ 

ఆకుచాటు పిందె తడిసే.. అహ అహ అహ అహ

కొమ్మచాటు పువ్వు తడిసే.. అహ అహ అహ అహ

ఆకుచాటు పిందె తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే

ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది

గోదారి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది 

Friday, June 19, 2026

Aaresukoboyi paaresukunnanu [ఆరేసుకోబోయి పారేసుకున్నాను ] - Adavi Ramudu

Title :Aresukoboyi
Movie:Adavi Ramudu
Singers:S.P. Balasubramanyam గారు, P. Suseela గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:K.V. Mahadevan గారు
Director:K. Raghavendra Rao గారు

ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరె అరె అరె అరె

కోకెత్తుకెళ్ళింది కొండగాలి

నువ్వు కొంటెచూపు చూస్తేనే చలి చలి,చలి చలి  చలి చలి

పారేసుకోవాలనారేసుకున్నవు అరె అరె అరె అరె

నీ ఏత్తు తెలిపింది కొండగాలి, నాకు ఉడుకెత్తిపోతోంది హరి హరి 

హరి హరి హరి హరి

ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరె అరె అరే అరే 

నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకోనీ సందెవేళ 

ఓ.. నాపాట ఈ పూట నీ పైటలా దాచేసుకోనీ తొలిపొంగుల 

నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకోనీ సందెవేళ 

ఓ.. నాపాట ఈ పూట నీ పైటలా దాచేసుకోనీ తొలిపొంగుల 

నీ చూపు సోకాలి, నా ఊపిరాడాలి 

ఆ.. నీ చూపు సోకాలి, నా ఊపిరాడాలి 

నీ జంట నా తీపి చలిమంట కావాలి 

నీ వింత కవ్వింతకే కాగిపోవాలి 

నీ కౌగిలింతలోనే దాగిపోవాలి 

ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరె అరె అరె అరె, కోకెత్తుకెళ్ళింది కొండగాలి

నాకు ఉడుకెత్తిపోతోంది హరి హరి, హరి హరి హరి హరి

నీ వొంపులో సొంపులే హరివిల్లు, నీ చూపులో రాపులే విరిజల్లు

నీ రాక నా వలపు ఏరువాక, నిను తాక నీలిమబ్బు నా కోక 

నే రేగిపోవాలి, నేనూగిపోవాలి 

నే రేగిపోవాలి, నేనూగిపోవాలి 

చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి

ఈ జోడు పులకింతలే నాపాట కావాలి 

ఆ పాట పూబాటగా నినుచేరుకోవాలి 

ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరె అరె అరె అరె

కోకెత్తుకెళ్ళింది కొండగాలి

నువ్వు కొంటెచూపు చూస్తేనే చలి చలి,చలి చలి  చలి చలి

పారేసుకోవాలనారేసుకున్నవు అరె అరె అరె అరె

నీ ఏత్తు తెలిపింది కొండగాలి, నాకు ఉడుకెత్తిపోతోంది హరి హరి 

హరి హరి హరి హరి 

Sirimalle puvva [సిరిమల్లేపువ్వా సిరిమల్లేపువ్వా చిన్నారి చిలకమ్మా] - Padahaarella vayasu

Title :Sirimalle puvva
Movie:Padaharella vayasu
Singers:S. Janaki గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Chakravarthy గారు
Director:K. Raghavendra Rao గారు

సిరిమల్లేపువ్వా.. సిరిమల్లేపువ్వా సిరిమల్లేపువ్వా.. చిన్నారి చిలకమ్మా 

నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే 

సిరిమల్లేపువ్వా సిరిమల్లేపువ్వా చిన్నారి చిలకమ్మా 

నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే 

సిరిమల్లేపువ్వా ...

తెల్లారబోతుంటే నా కల్లోకివస్తాడే

కళ్ళారా చూదామంటే నా కళ్ళు మూస్తాడే

ఆ అందగాడు నా ఈడూ జోడు ఏడే

ఈ సందేకాడ నా చందమామ రాడే

చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో

సిరిమల్లేపువ్వా.. సిరిమల్లేపువ్వా సిరిమల్లేపువ్వా.. చిన్నారి చిలకమ్మా 

నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే 

సిరిమల్లేపువ్వా 

కొండల్లో కోనల్లో కూయన్న ఓ కోయిల

ఈ పూల వానల్లో ఝుమ్మన్న ఓ తుమ్మెద

వయసంతా వలపై మనసే మైమరుపై ఊగేనే 

పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే 

చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో

సిరిమల్లేపువ్వా.. సిరిమల్లేపువ్వా సిరిమల్లేపువ్వా.. చిన్నారి చిలకమ్మా 

నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే 

సిరిమల్లేపువ్వా.. సిరిమల్లేపువ్వా సిరిమల్లేపువ్వా..  

Wednesday, June 17, 2026

Elluvocchi godaramma [ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో] - Devatha

Title :Elluvocchi godaaramma
Movie:Devata / Devatha
Singers:S.P. Balasubramanyam గారు, P. Suseela గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Chakravarthy గారు
Director:K. Raghavendra Rao గారు

ఈ గీతంలో వాడిన తెలుగు మాండలికాన్ని (తూర్పు) మార్చకుండా రాయడం జరిగింది. (రచయిత వ్ బదులుగా యాసలొ య/ఎ ని వాడారు)

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీగిన్నేలయ్యేనమ్మో 

కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే..

ఓరయ్యో రావయ్యో 

ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా, మీగడంతా నీదేలే నా బుల్లోడా

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీగిన్నేలయ్యేనమ్మో 

కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే, 

ఓలమ్మో రావమ్మో  

ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు 

ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు 

ఈ కళ్ళకున్న ఆకళ్ళలోనా అందాల విందమ్మ నువ్వు

వాటేసుకుంటే వందేళ్ళపంట వద్దంటే విందమ్మ నవ్వు

చెయ్యేస్తే చేమంతి బుగ్గ, చెంగావి గన్నేరు మొగ్గ

చెయ్యేస్తే చేమంతి బుగ్గ, చెంగావి గన్నేరు మొగ్గ

ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే ఏడేసుకుంటవు గూడు 

కౌగిళ్ళలో నన్ను కూడు, ఆకళ్ళ కుంటాది కూడు

గుండెల్లో చోటుంది చూడు 

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీగిన్నేలయ్యేనమ్మో 

కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే

ఓరయ్యో రావయ్యో 

ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా, మీగడంతా నీదేలే నా బుల్లోడా

ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు 

నీ కళ్ళుసోక, నా తెల్లకోక అయ్యిందిలే గళ్ళకోక 

నీ మాటవిన్న నా జారుపైట పాడిందిలే గాలిపాట 

కళ్ళల్లో ఉన్నయి ముళ్ళు, నేకోరినా మూడు ముళ్ళు 

కళ్ళల్లో ఉన్నయి ముళ్ళు, నేకోరినా మూడు ముళ్ళు 

పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే కట్టేయ్యనా తాళిబొట్టు 

నా మాటకీఏరు తోడు, ఏరెండీనా ఊరు తోడు 

నీ తోడులో ఊపిరాడు  

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీగిన్నేలయ్యేనమ్మో 

కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే..

ఓలమ్మో రావమ్మో  

ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు 

ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా, మీగడంతా నీదేలే నా బుల్లోడా 

Tuesday, June 16, 2026

Gala gala [గల గల గల గల గజ్జలు తొడిగిన గ్రంథసాంగి] - Chatrapathi

Title :Gala gala
Movie:Chatrapathi
Singers:Jassie Gift గారు, K.S. Chitra  గారు
Lyricist:Chandra Bose గారు
Composer:M.M. Keeravani గారు
Director:S.S. Rajamouli గారు

గల గల గల గల గజ్జలు తొడిగిన గ్రంథసాంగి నీ కొసమే నేనేస్కునొచ్చా గళ్ళా గళ్ళ లుంగి

కొర కొర కొర కొర కొర కొర చూపుల కొంటె కోణంగి నా మనసులో ఏం దాగి ఉందో చూస్కో తొంగి తొంగి

చన్నీళ్ళో వేన్నీళ్ళు పోసీ, చల్లంగ వేడెక్కజేసి, నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి  

గల గల గల గల గజ్జలు తొడిగిన గ్రంథసాంగి నీ కొసమే నేనేస్కునొచ్చా గళ్ళా గళ్ళ లుంగి

కొర కొర కొర కొర కొర కొర చూపుల కొంటె కోణంగి నా మనసులో ఏం దాగి ఉందో చూస్కో తొంగి తొంగి

పండు కోయగలవా దాని తొక్క తీయగలవా, తొక్కలా బిరుసెక్కిన నా తిక్క తీర్చగలవా 

పండు పిండగలనే దాని తొక్క మెక్కగలనే, పక్కలో మగదిక్కునై రసమొక్కు తీర్చగలనే

వొలుచుకో వాటేసి వయసువరహా 

అదరహో అందాల ఆడతరహా 

తమాయించుకోరా.. దరువేసి 

గల గల గల గల గజ్జలు తొడిగిన గ్రంథసాంగి నీ కొసమే నేనేస్కునొచ్చా గళ్ళా గళ్ళ లుంగి

పట్టి చూడగలవా ఎదగట్టు దాటగలవా, గుట్టుగా రసపట్టులో చెలి ఉట్టికొట్టగలవా 

పట్టు పట్టగలనే జడపట్టి దూకగలనే, ఉత్తిగా ఊరించినా చిరు చట్టిపట్టగలనే 

అందుకెవరున్నారు నేను మినహా

అందుకే విన్నాను లేడి సలహా

తమాయించుకోరా తలుపేసి