| Title : | Hello guru prema kosameroy |
| Movie: | Nirnayam |
| Singers: | S.P. Balasubramanyam గారు |
| Lyricist: | Sirivennela Seetharama sastry గారు |
| Composer: | Illayaraja గారు |
| Director: | Priyadarshan గారు |
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహామహా సుందరాంగులే పొందలేనివాణ్ణి హార్నీ
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం
ఉంగరాల జుట్టువాన్ని ఒడ్డుపొడుగు వున్నవాణ్ణి, చదువు సంధ్య గల్గినోడ్ని చౌకబేరమా
గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతటోడ్ని, కోరి నిన్ను కోరుకుంటే పెద్దనేరమా
నాకన్నా నీకున్న తాకీదులేంటమ్మా, నా ఎత్తు నా బరువు నీకన్న మోరమ్మా
నేనంటే కాదన్న లేడీసే లేరమ్మ, నాకంటె ప్రేమించే మొనగాడు ఎవరమ్మ
I love you darling. because you are charming
ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్లే, why not
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహామహా సుందరాంగులే పొందలేనివాణ్ణి Yeah Yeah
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం , మగాడితో ఆడదానికేలా పౌరుషం
కట్టుకుంటె నిన్నే తప్ప కట్టుకోనె కట్టుకోను, ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే
అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా, అల్లుకోవె నన్నెనీవు మల్లెతీగలా
నీచేతే పాడిస్తా లవ్‌సాంగ్లు డ్యూయెట్లు, నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లూ
ఆహా నా పెళ్ళంట ఓహో నాపెళ్ళంటా, అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంటా
అచ్చా మైనె ప్యార్ కియా, లుచ్చా కాం నహీ కియా , అమీ తుమీ తేలకుంటె నిను లేవదీస్కుపోతా
are you ready?
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహామహా సుందరాంగులే పొందలేనివాణ్ణి హార్నీ

No comments:
Post a Comment