Wednesday, July 29, 2026

Undiporade gundenidele [ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే] - Husharu

Title :undiporade gunde nidele
Movie:Husharu
Singers:Sid Sriram గారు
Lyricist:Kittu Vissapragada గారు
Composer:Radhan గారు
Director:Sri Harsha konuganti గారు

ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే

అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది

మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నది

అందం అమ్మాయైతే నీలావుందా అన్నట్టుందే

మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే

ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే


నిశిలో శశిలా నిన్నే చూసాక, మనసే మురిసే ఎగసే అలలాగ

ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే

మండేఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెపుడూ చూడలే

చీకట్లో కూడా నీడలా నీవెంటే నేనుండగా 

వేరే జన్మంటూ నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలులే

అందం అమ్మాయైతే నీలావుందా అన్నట్టుందే

మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే

ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే


Sad version

నిన్నే నమ్మి చేసానే నేరం, కళ్ళే తెరిచి వెళుతున్నా దూరం

ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ఉందే నువ్వుచేసిన మోసమే

గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే నీతో గడిపిన ఆ కాలమే 

కన్నీరంటూ రాకున్నదే బాధే తీరే దారుండదే 

మగువకి మరుపంటే ఎంతో తేలికని నిన్నే చూసాకే తెలిసెను నేడే 

కాలం చేసే గాయం మానేదారే లేనేలేదా 

నా గుండెల్లో ముళ్ళే గుచ్చి చంపేసావే నన్నిలా 

చెప్పుకోలేనే బాధ నీతోనే .. 

No comments:

Post a Comment