Sunday, June 28, 2026

Prema enta madhuram [ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం] - Abhinandana

Title :Prema enta madhuram
Movie:Abhinandana
Singers:గానగంధర్వ  S.P. Balasubramanyam గారు
Lyricist:Aatreya గారు
Composer:Illayaraja గారు
Director:Ashok Kumar గారు

ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం 

ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం 

చేసినాను ప్రేమక్షీరసాగర మధనం, మింగినాను హలాహలం

ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం 


ప్రేమించుటేనా నా దోషము, పూజించుటేనా నా పాపము 

ఎన్నాళ్ళని ఈ ఎదలో ముళ్ళు, కన్నీరుగయి కరిగే కళ్ళు 

నాలోని నీ రూపము, నా జీవనాధారము 

అది ఆరాలి పోవాలి ప్రాణము 

ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం 


నేనోర్వలేను ఈ తేజము, ఆర్పేయరాదా ఈ దీపము 

ఆ చీకటిలో కలిసేపోయి, నా రేపటిని మరిచేపోయి

మానాలి నీ ధ్యానము, కావాలి నే శూన్యము

అపుడాగాలి ఈ మూగ గానము

ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం 

చేసినాను ప్రేమక్షీరసాగర మధనం, మింగినాను హలాహలం


ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం

No comments:

Post a Comment