| Title : | Kaastanduko darakhaastanduko |
| Movie: | Rendu rellu aaru |
| Singers: | గానగంధర్వ S.P. Balasubramanyam గారు, S. Janaki గారు |
| Lyricist: | Veturi Sundararama murthy గారు |
| Composer: | Rajan Nagendran గారు |
| Director: | హాస్యబ్రహ్మ Jandhyala గారు |
ముద్దులతోనే ముద్దరవేసి ప్రేయసి కౌగిలి అందుకో
కాస్తందుకో దరఖాస్తందుకో భామ దరఖాస్తందుకో
దగ్గర చేరి దస్ఖతుచేసి ప్రేయసి కౌగిలి అందుకో
కాస్తందుకో దరఖాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో
చిరుగాలి దరఖాస్తు లేకుంటె కరిమబ్బు
చిరుగాలి దరఖాస్తు లేకుంటె కరిమబ్బు
మెరుపంత నవ్వునా చినుకైన రాలునా
జడివాన దరఖాస్తు పడకుంటే సెలయేరు
జడివాన దరఖాస్తు పడకుంటే సెలయేరు
వరదల్లే పొంగునా కడలింక చేరునా
శుభమస్తు అంటే దరఖాస్తు ఓకే
కాస్తందుకో దరఖాస్తందుకో భామ దరఖాస్తందుకో
చలిగాలి దరఖాస్తు తొలి ఈడు వినకుంటే
చలిగాలి దరఖాస్తు తొలి ఈడు వినకుంటే
చెలి జంట చేరునా, చెలిమల్లే మారునా
నెలవంక దరఖాస్తు, లేకుంటే చెక్కిళ్ళు
నెలవంక దరఖాస్తు, లేకుంటే చెక్కిళ్ళు
ఎరుపెక్కి పోవునా ఎన్నెల్లు పండూనా
దరిచేరు కూడా దరఖాస్తులేలా
కాస్తందుకో దరఖాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో
దగ్గర చేరి దస్ఖతుచేసి ప్రేయసి కౌగిలి అందుకో
కాస్తందుకో దరఖాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో

No comments:
Post a Comment