| Title : | Dhivara prasara souradhara |
| Movie: | Baahubali - The Beginning |
| Singers: | Ramya Behera గారు, Deepu గారు |
| Lyricist: | Ramajogayya Sastry గారు, Siva sakthi datta గారు |
| Composer: | M.M. Keeravani గారు |
| Director: | S.S. Rajamouli గారు |
హునన హూనన హూనన హూన నచ్చానా
హునన హూనన హూనన హూన అంతగానా
అందనిలోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా అల్లరి ఆశల అభిసారికనై నీకైచూస్తున్నా ఆ..
ధీవర ప్రసర శౌర్యధార ఉత్సర స్థిరగంభీరా
ధీవర ప్రసర శౌర్యధార ఉత్సర స్థిరగంభీరా
నననన యువ యువ యువ యువన యువయువన
అలసినా సొలసినా ఒడిలో నిన్ను లాలించనా
అడుగునై నడపనా నీ జంట పయనించనా
పడిపడి తలపడి వడివడి త్వరపడి వస్తున్నా ఎదేమైనా
సిగముడి విడిచిన శిఖరపు జలసిరి ధారల్ని జటాజూటంలా ఢీకొని సవాళ్లని తెగించి నీవైపు దూసుకొస్తున్నా
ఉత్క్రమ అసమశౌర్యధామ ప్రోద్గమ తవ భీతిర్మ
ఉత్క్రమ అసమశౌర్యధామ ప్రోద్గమ తవ భీతిర్మ
నిలువునా ఎదగరా నినురమ్మంది నాతొందరా
కదలికే కదనమై గగనానికెదురీదరా
విజితరిపు రుధిరధారా కలిత అసిధర కఠోరా
పులకుధర తులిత గంభీరా జయవిరాట్ వీరా
విలయగగనతలభీకరా గర్జద్ధారాధరా హృదయరసకాసారా విజితమధుపారాపార
భయకరం శౌ విభవసింధు శుభరదం గం భరణరంధిం
భయకరం శౌ విభవసింధు శుభరదం గం భరణరంధిం
భయకరం శౌ విభవసింధు శుభరదం గం భరణరంధిం
ధీవర ప్రసర శౌర్యధార ఉత్సర స్థిరగంభీరా
ధీవర ప్రసర శౌర్యధార ఉత్సర స్థిరగంభీరా
ధీవర ప్రసర శౌర్యధార దరికిచేరరారా ఉత్సర సుందరా స్థిరగంభీరా చెలి నీదేరా

No comments:
Post a Comment