| Title : | vennela vennela |
| Movie: | Prema Desam |
| Singers: | Unni Krishnan గారు, S.P. Balasubramanyam గారు |
| Lyricist: | Bhuvana Chandra గారు |
| Composer: | A.R. Rahman గారు |
| Director: | Kathir గారు |
వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ
కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళ
వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
ఆశ ఎన్నడు విడువదా, అడగరాదని తెలియదా
నా ప్రాణం చెలియా నీవేలే
విరగబూసిన వెన్నెలా వదిలివేయకే నన్నిలా
రారాదా ఎదనీదే కాదా
నిదురనిచ్చే జాబిలి నిదురలేక నీవే వాడినావా
వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
మంచుతెరలో అలిసిపోయే మదన సంధ్య తూకెనే **
పుడమి ఒడిలో కలలు కంటూ పాపానీవు నిదురపో
మల్లె అందం మగువకెరుక మనసుబాధ తెలియదా
గుండెనిండా ఊసులే ఎదుటనుంటే మౌనమే
జోలపాట పాడినానే నిదురలేక వాడినా
వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ
కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళ
వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

No comments:
Post a Comment