Saturday, November 14, 2026

maa voori devudu andala ramudu [మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకి శ్రీరాముడు దేవుడు] - Alluda majaka

Title :ma oori devudu
Movie:alluda majaka
Singers:S.P. Balasubramanyam గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Koti గారు
Director:E.V.V. Satyanarayanaగారు

మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకి శ్రీరాముడు దేవుడు

మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకి శ్రీరాముడు దేవుడు

ఓ రామా రఘురామా, జగమేలే జయరామా

కదిలిరావయ్యా కళ్యాణ రామా, మనువు కోరింది సీతమ్మా భళిరా భళిరా భళిరా 

మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకి శ్రీరాముడు దేవుడు


చుక్కా చుక్కల లేడి రాం భజన సూదికన్నుల లేడి రాం భజన

చుక్కా చుక్కల లేడి రాం భజన సూదికన్నుల లేడి రాం భజన

రామయ్య నలుపంటా, సీతమ్మ తెలుపంట, పరువాలా ఈ జంట ప్రజల కన్నుల పంట

శ్రీ రాముడి కళ్యాణమే, సీతమ్మకే వైభోగమే 

మా పల్లెకే పేరంటము, లోకాలకే ఆనందము

ఛైత్రమాస కోకిలమ్మ పూలమేళమెట్టెనంట నింగివొంగి నేలపొంగి జంటతాళమేసెనంట 


చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా, తాళికట్టు బావయ్యే తారకరామయ్య రా 

తుళ్ళిపడ్డ కన్నెలకి పెళ్ళీడు పాపలకి, వలచిన వరుడంటే రామచంద్రుడే 

రాతినైనా నాతిగ చేసి, కోతినైన దూతగ పంపే

మహిమే నీ కథ రామా 

ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు ధర్మానికే నీవు దైవానివైవు

అన్నంటే నీవు ఆదర్శమైనావు కన్నోళ్ళకే నీవు కన్నీళ్ళు తుడిచావు 

ఆకాశ పందిళ్ళు భూలోక సందిళ్ళు ఓ రామ నీ పెళ్ళికే భళిరా భళిరా భళిరా 

మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకి శ్రీరాముడు దేవుడు


రక్కసి బాధలేని పల్లెటూళ్ళు మావూళ్ళురా, మంధర మాటవినే కైక లేదురా 

సీత సిరి పండించే మణూలు ఉన్న మాగాణిరా, కలిమికి చోటు ఇదే కరువు లేదు రా 

బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమో కప్పకిచ్చే ఘనతే నీ కథ రామా 

కంచర్ల గోపన్న బంధాలు తెంచావు, శబరి ఎంగిలిపళ్ళు నువ్వారగించావు 

త్యాగయ్య గానాల తానాలు చేసావు, బాపూజి ప్రాణాల కడ మాటవైనావు 

సీతమ్మ రామయ్య పెళ్ళాడుకుంటుంటే భూలోక కళ్యాణమే.. భళిరా భళిరా భళిరా 

మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకి శ్రీరాముడు దేవుడు 

No comments:

Post a Comment