Song Name : | Kanya kumari kanapada daari |
Movie: | Bobbili Raaja |
Singers: | S.P. Balasubramanyam garu, S. Janaki garu |
Lyricist: | Sirivennela Seetaraama Sastry garu |
Composer: | Illayaraja garu |
Director | B. Gopal garu |
కన్యాకుమారీ కనపడదా దారి, కయ్యాలమారి పడతావే జారి
పాతాళం కనిపెట్టేలా, ఆకాశం పనిపట్టేలా
ఊగకే మరి, మతిలేని సుందరి
జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం
గోపాలబాలా ఆపరఈగోల, ఈ కైపుఏలా ఊపర ఉయ్యాల
మైకంలో మయసభ చూడు మహరాజ రా నా తోడు
సాగనీ మరి సరదాల గారడీ
జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం
కొండలూ గుట్టలూ చిందులాడే తదిగిణతోం..
వాగులూ వంకలూ ఆగిచూసే కథచెబుదాం
తూనీగ రెక్కలెక్కుదాం సూరీడి పక్క నక్కుదాం
కుందేటి కొమ్ము వెతుకుదాం, బంగారు జింకనడుగుదాం
చూడమ్మా హంగామా, అడివంతారంగేట్రం సాగించే వెరైటీ ప్రోగ్రాం..
కళ్ళవిందుగా పైత్యాల పండగ
జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం
కన్యాకుమారీ కనపడదా దారి.. ఆహ
కయ్యాలమారి పడతావే జారి..
మైకంలో మయసభ చూడు మహరాజ రా నా తోడు
సాగనీ మరి సరదాల గారడీ
జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం
డేగతో ఈగలే ఫైటుచేసే చెడుగుడులో
చేపలే చెట్టుపై పళ్ళుకోసే గడబిడలో
నేలమ్మా తప్ప తాగెనో, ఏ మూలో తప్పిపోయెనో
మేఘాల కొంగు పట్టుకో, తూలేటి నడకనాపుకో
ఓయమ్మో.. మాయమ్మో ..దిక్కుల్నే ఆటాడించే కిక్కుల్లో గందరగోళం..
వొళ్ళు వూగగా ఎక్కిళ్ళు రేగగా
జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం
ఏయ్..గోపాలబాలా ఆపరఈగోల, ఈ కైపుఏలా ఊపర ఉయ్యాల
పాతాళం కనిపెట్టేలా, ఆకాశం పనిపట్టేలా
ఊగకే మరి, మతిలేని సుందరి
జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం
సాగనీ మరి సరదాల గారడీ
జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం
No comments:
Post a Comment