Friday, December 27, 2024

జరుగుతున్నది జగన్నాటకం (Krishnam Vande Jagadgurum)

Song Name :Jarugutunnadu jagannatakam
Movie:Krishnam Vande jagatgurum
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Sirivennela Seethaaraama sastry garu
Composer:Manisharma garu
DirectorKrish Jaagarlamudi garu

జరుగుతున్నది జగన్నాటకం

జరుగుతున్నది జగన్నాటకం

పురాతనపు పురాణవర్ణన పైకి కనపడుతున్న కధనం 

నిత్య జీవన సత్యమని భాగవతలీలల అంతరార్థం 

జరుగుతున్నది జగన్నాటకం

జరుగుతున్నది జగన్నాటకం 


చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని

ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని

సత్యం వ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకి చేయూతనిచ్చి 

నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం 


చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే 

పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే 

బుసలుకొట్టే అసహనపు నిట్టూర్పుసెగలకు నీరసించక 

ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది 


క్షీరసాగర మధన మర్మం


ఉనికిని నిలిపే ఇలను కడలిలో కలుపగ ఉరికే ఉన్మాదమ్మును 

తరాళ దంష్టుల కుళ్ళగించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల 

ధీరోద్ధతి రణహుంకారం ఆదివరాహపు ఆకారం 


ఏదీ ఎక్కడరా నీహరి, దాక్కున్నాడేరా భయపడి, బయటకు రమ్మనరా 

ఎదుటబడి నన్ను గెలవగలడా తలబడి 

నూవ్ నిలచిన ఈ నేలని అడుగు, నీ నాడుల జీవజలమ్ముని అడుగు  

నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు, నీ ఊపిరిలో గాలిని అడుగు 

నీ అడుగుల ఆకాశాన్నడుగు, నీలో నరునీ హరినీ కలుపు  

నీవే నరహరివని నూవ్ తెలుపు 


ఉన్మత్త మాతంగ భంగి ఘాతుక వితతి

హంతృ సంఘాత నీ ఘృణ నిబిడమీ జగతి  

అఘము నగమై ఎదిగె అవనికిదె అశనిహతి 

ఆతతాయుల నిహతి అనివార్యమౌ నియతి  

చితమస్తి హతమస్తకారి నఖ సమకాసియో 

క్రూరాసి గ్రోసి హృతదాయ దంష్టుల ద్రోసి మసిజేయ మహితయఙ్నం 


అనేయమనూహ్యమనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మస్వరూపం 

ఈ మానుష రూపం కుక్జ్యాకృతిగా బుధ్ధిని భ్రమింపజేసే అల్పప్రమాణం

ముజ్జగాలను మూడడుగులతో కొలిచే కైవిక్రమ విస్తరణం 

జరుగుతున్నది జగన్నాటకం జగ జగ జగ జగ జగన్నాటకం

జరుగుతున్నది జగన్నాటకం జగ జగ జగ జగమే నాటకం 


పాపపు తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మఙ్నానిని పెరుగక  

పరశురాముడై భయదభీముడై పరశురాముడై భయదభీముడై 

ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన సౌద్రియ క్షత్రియ తత్వమె భార్గవుడు  


ఏ మహిమలూ లేక ఏ మాయలూ లేక నమ్మశక్యముగాని ఏ మర్మమూ లేక

మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగ మహిని మిగలగలిగే 

మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచే 


ఇన్ని రీతులుగ ఇన్నిన్ని పాత్రలుగ నిన్ను నీకే నూత్నపరిచితునిగా 

దర్శింపజేయగల ఙ్నాన దర్పణమూ కృష్ణావతారమే సృష్ట్యావరణతరణమూ..


అరిమగ మహిమగ గరిమగ లఖిమగ     

ప్రాప్తిగా ప్రాధామ్యవర్తిగా ఈశత్వముగా వశిత్వమ్ముగా 

నీలోని అష్టసిధ్ధులూ నీకు కన్వట్టగా   

స్వస్వరూపమే విశ్వరూపమ్ముగా 

నరుడిలోపల పరుడిపై దృష్టి పరుపగా 

తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతె  

నీఆర్తి కడదేర్చు ఆచార్యుడవు నీవే   


వందే కృష్ణం జగద్గురుం 

వందే కృష్ణం జగద్గురుం 

కృష్ణం వందే జగద్గురుం 

కృష్ణం వందే జగద్గురుం 

వందే కృష్ణం జగద్గురుం 

వందే కృష్ణం జగద్గురుం 

కృష్ణం వందే జగద్గురుం 

కృష్ణం వందే జగద్గురుం 


కృష్ణం వందే జగద్గురుం 




6 comments:

  1. "Nee anuvula aakasanni adugu" not adugula. Pls correct it. Excellent work by the way. Great effort. I have some suggestions if you are interested

    ReplyDelete
    Replies
    1. లేదండి. ఆ సందర్భంలో హిరణ్యకసిపునికి ప్రహ్లాదుడు చెప్తూ, శరీరంలో కనపడే భాగాలలో, కంటికి కనపడని వాటిలో హరిని ఉంటాడు చూడమని చెప్తున్నాడు. కొంచెం వెతికి కూడా చూసా. ఇంకా వెతికి సరిచేస్తా.

      మీ ప్రశంసలకి ధన్యవాదాలు.

      మీ సలహాలు చెప్పటానికి venkataramesh.kommoju@gmail.com మెయిల్ చెయ్యండి. నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.

      Delete
  2. Watch this link for this song's translation.
    https://www.youtube.com/watch?v=_vXS8Wc74H0

    ReplyDelete