Song Name : | Oh bujji talli |
Movie: | Thandel |
Singers: | Javed Alo |
Lyricist: | Sree Mani |
Composer: | Devi Sri Prasad garu |
Director | Chandu Mondeti garu |
గాలిలొ ఊగిసలాడే దీపంలా, ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం
నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా, చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం
సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా
నీ కోసం వేచుందే, నా ప్రాణం .. ఓ బుజ్జితల్లీ
నా కోసం ఓ మాటైన, మాటాడే నా బుజ్జితల్లీ..
నీరులేని చేపల్లే, తారలేని నింగల్లే
జీవమేది నాలోనా నువ్వు మాటాలాడందే
మళ్ళియేళకొస్తానే కాళ్ళాయేళ్ళా పడతానే
లెంపలేసుకుంటానే ఇంక నిన్ను ఇడిపోనే
ఉప్పు నీటి ముప్పునికూడా గొప్పగదాటే గట్టోణ్ణే
నీకంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే
నీ కోసం వేచుందే, నా ప్రాణం .. ఓ బుజ్జితల్లీ
నా కోసం ఓ మాటైన, మాటాడే నా బుజ్జితల్లీ..
ఇన్నినాళ్ళ మన దూరం, తీయ్యనైన ఓ విరహం
చేదులాగ మారిందే అందిరాక నీ గారం
దేన్ని కానుకియ్యాలే ఎంత బుజ్జగించాలే
బెట్టు నువ్వు దించేలా లంచమేంటి కావాలే
గాలి వాన జాడేలేదే రవ్వంతైనా నాచుట్టూ
ఐన మునిగిపోతున్నానే దారే చూపెట్టూ
నీ కోసం వేచుందే, నా ప్రాణం .. ఓ బుజ్జితల్లీ
నా కోసం ఓ మాటైన, మాటాడే నా బుజ్జితల్లీ..