Song Name : | Na na hairaana |
Movie: | Game Changer |
Singers: | Karthik garu, Shreya Goshal garu |
Lyricist: | Rama Jogayya sastri garu |
Composer: | Thaman garu |
Director | Shankar garu |
నాధిరిదిన్న నాధిరిదిన్న నాధిరిదిన్న నాధిరిదిన్న నాధిరిదిన్న థిల్లానాధిన్న

నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయె నాలోన లలనా నీవలన
నానా హైరానా అరుదైన హైరానా నెమలీకలు పులకింతై నా చెంపలు నిమిరేనా
దానా ధీన ఈ వేళ నీలోన నాలోన కనివిననీ కలవరమే సుమశరమా
వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే, వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు పక్కన ఉంటే
వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే, మంచోణ్ణవుతున్నా మరికొంచెం నువ్వు నా పక్కన ఉంటే
నాధిరిదిన్న నాధిరిదిన్న నాధిరిదిన్న నాధిరిదిన్న నాధిరిదిన్న థిల్లానాధిన్న
నాధిరిదిన్న నాధిరిదిన్న నాధిరిదిన్న నాధిరిదిన్న నాధిరిదిన్న థిల్లానాధిన్న
ఎపుడూలేని లేని వింతలు ఇపుడే చూస్తున్నా
గగనాలన్ని పూలగొడుగులు భువనాలన్ని పాలమడుగులు
కదిలే రంగుల భంగిమలై, కనువిందాయెను పవనములు
ఎవరులేనే లేని దీవులు నీకూ నాకేనా
రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయె
ఎమ్మాయో మరియేమో నరనరమూ నైలు నదాయే
తనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అనగనగ సమయములొ తొలికధగా..
వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే, వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు పక్కన ఉంటే
వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే, మంచోణ్ణవుతున్నా మరికొంచెం నువ్వు నా పక్కన ఉంటే
నాధిరిదిన్న నాధిరిదిన్న నాధిరిదిన్న నాధిరిదిన్న నాధిరిదిన్న థిల్లానాధిన్న
నాధిరిదిన్న నాధిరిదిన్న నాధిరిదిన్న నాధిరిదిన్న నాధిరిదిన్న థిల్లానాధిన్న
No comments:
Post a Comment