Sunday, June 29, 2025

Manasa tullipadake telugu lyrics [మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే] - Srivaariki Premalekha

Song Name :Manasa tulli padake
Movie:Srivariki premalekha
Singers:S. Janaki garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Ramesh Naidu garu
DirectorJandhyala garu 


మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే 

అతనికి నీవు నచ్చావొ లేదో, ఆ శుభగడియా వచ్చేనొ రాదో 

తొందర పడితే అలుసే మనసా తెలుసా 

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే 


ఏమంత అందాలు కలవనీ, వస్తాడు నిన్ను వలచి

ఏమంత సిరివుంది నీకనీ, మురిసేను నిన్ను తలచి

చదువా పదవా ఏముంది నీకు, తళుకూ కులుకూ ఏదమ్మ నీకు 

శృతిమించకే నీవు మనసా..

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే 

అతనికి నీవు నచ్చావొ లేదో, ఆ శుభగడియా వచ్చేనొ రాదో 

తొందర పడితే అలుసే మనసా తెలుసా 

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే 


ఏ నోము నోచావు నీవనీ, దొరికేను ఆ ప్రేమ ఫలము

ఏ దేవుడిస్తాడు నీకనీ, అరుదైన అంత వరమూ 

మనసా వినవే అంత అందగాడు, తనుగా జతగా మనకందిరాడు

కలలాపవే కన్నె మనసా..

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే 

అతనికి నీవు నచ్చావొ లేదో, ఆ శుభగడియా వచ్చేనొ రాదో 

తొందర పడితే అలుసే మనసా తెలుసా 

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే   

No comments:

Post a Comment