Saturday, July 5, 2025

Kalaganti Kalaganti telugu lyrics [కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ] - Annamayya

Song Name :Kalaganti kalaganti
Movie:Annamayya
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Annamacharyulu garu
Composer:M.M. Keeravani garu
DirectorK. Raghavendra Rao garu 


కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి 

ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి 

కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి 

ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి ఇప్పుడిటు కలగంటి 


అతిశయంబైన శేషాద్రి శిఖరము గంటి

ప్రతిలేని గోపుర ప్రభలు గంటి 

శతకోటి సూర్యతేజములు వెలుగడ గంటి

చతురాశ్యు పొడగంటి 

చతురాశ్యు పొడగంటి చయ్యన మేలుకొంటి 


ఇప్పుడిటు కలగంటి 


అరుదైన శంఖ చక్రాదులిరుగడ గంటి

సరిలేని అభయ హస్తమును కంటి 

తిరువేంకటాచలాధిపుని చూడగ కంటి   

హరి గంటి గురు గంటి 

హరి గంటి గురు గంటి అంతట మేలుకొంటి 


కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి 

ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి ఇప్పుడిటు కలగంటి 

ఇప్పుడిటు కలగంటి  

No comments:

Post a Comment