Song Name : | Madhura murali hrudaya ravali |
Movie: | Oka radha iddaru krishnulu |
Singers: | S.P. Bala subramanyam garu, S. Janaki garu |
Lyricist: | Veturi Sundara rama murthy garu |
Composer: | Illayaraja garu |
Director: | Kondanda Rami reddy garu |
మధురమురళి హృదయరవళి అధరసుధల యమున పొరలి పొంగే ఎద పొంగే
ఈ బృందావిహారాలలోనా, నా అందాలు నీవేరా కన్నా
ఈ బృందావిహారాలలోనా, నా అందాలు నీవేరా కన్నా
మధురమురళి హృదయరవళి ఎదలుకలుపు ప్రణయకడలి సాగే సుడిరేగే
ఈ బృందావిహారాలలోనా, ఎవరున్నారు రాధమ్మ కన్నా
ఈ బృందావిహారాలలోనా, ఎవరున్నారు రాధమ్మ కన్నా
గోధూళి వేళల్లో గోపెమ్మకౌగిట్లో, లేలేత వన్నేచిన్నే దోచేవేళల్లో
పున్నాగ తోటల్లో సన్నాయి సందిట్లో, నాజూకులన్నీ నాకే దక్కేవేళల్లో
పగలో అవతారం రాత్రో శృంగారం ఎదలో తారంగం శ్రీవారికి
రాగాలెన్నైనా వేణువు ఒకటేలే, రూపాలెన్నైనా హృదయం ఒకటేలే
నాదే నీ దీపము, ఇక నీదే ఈ సరసాల సంగీతం
మధురమురళి హృదయరవళి ఎదలుకలుపు ప్రణయకడలి సాగే సుడిరేగే
ఈ బృందావిహారాలలోనా, నా అందాలు నీవేరా కన్నా
ఈ బృందావిహారాలలోనా, ఎవరున్నారు రాధమ్మ కన్నా
హేమంతవేళల్లో లేమంచు పందిట్లో, నావీణ ఉయ్యాలూగే నీలో ఈనాడే
కార్తీక వెన్నెల్లో ఏకంత సీమల్లో, ఆరాధనేదో సాగే అన్నీ నీవాయే
ముద్దే మందారం మనసే మకరందం సిగ్గే సింధూరం శ్రీదేవికీ
అందాలెన్నైన అందేదొకటేలే ఆరు రుతువుల్లో ఆమని మనదేలే
పాటే అనురాగము మన బాటే ఓ అందాల అనుబంధం
మధురమురళి హృదయరవళి అధరసుధల యమున పొరలి పొంగే ఎద పొంగే
ఈ బృందావిహారాలలోనా, ఎవరున్నారు రాధమ్మ కన్నా
ఈ బృందావిహారాలలోనా, నా అందాలు నీవేరా కన్నా
No comments:
Post a Comment