Song Name : | Sandhya ragapu |
Movie: | Indrudu chandrudu |
Singers: | S.P. Bala subramanyam garu, S. Janaki garu |
Lyricist: | Veturi Sundararama murthy garu |
Composer: | Illayaraja garu |
Director | Suresh krishna garu |
సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో
డోరేమీ రాగాల జోరేమీ, దాసాదా నా ప్రేమ నీ మీద శృతి కలిసిన
సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో
చినుకు చినుకు నడుములో చిలకలులికి పడెనులే
కనుల కనుల నడుమలో అలల సుడులు తిరిగెలే
పెదవి పెదవి తడుపులో వలపు మధువు తొలికెలే
తనువు తనువు కుదుపులో తమకమొకటి మెరిసెలే
సంధ్యలో తార లాగా స్వప్నమై పోకుమా
కన్నెలో సోయగాలు కంటితోనె తాగుమా
హంసలా హాయిగా ఆమనీ రేయిలా వాలిపో ప్రియ
ఓ..సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో
డోరేమీ రాగాల జోరేమీ, దాసాదా నా ప్రేమ నీ మీద శృతి కలిసిన
సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో
ఎదుట పడిన బిడీయమే, చెమట నుదుట చిలికెలే
వొణుకు తొణుకు పరువమే, వడికి వయసు కలిపెలే
వలపు పొడుపు కథలలో, చిలిపి ముడులు విడెనులే
మరుల విరుల పొదలలో, మరుడి పురుడు జరిగెలే
తేనెలే దోచుకెళ్ళే తుమ్మెదై పోకుమా
గాలికే గంధమిచ్చే కౌగిలింతే దూరమా
పాటలా కోటలో పల్లవే ప్రేమగా పాడుకో ప్రియ
ఓ..సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో
డోరేమీ రాగాల జోరేమీ, దాసాదా నా ప్రేమ నీ మీద శృతి కలిసిన
సంధ్యారాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో
No comments:
Post a Comment