Title : | ammayi muddu ivvande |
Movie: | Kshana Kshanam |
Singers: | S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు |
Lyricist: | Sririvennela Seetaramasastry గారు |
Composer: | M.M. Keeravani గారు |
Director: | Ram Gopal Varma గారు |
అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మా గొడవలే
ముద్దిమ్మంది బుగ్గ వద్దంటు అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా
ముద్దిమంటే బుగ్గ అగ్గల్లెవస్తే ఆగేదెట్టా హద్దూ పద్దూ వద్దా
మోజులేదనకు, ఉందనుకో ఇందరిలో ఎల్లా మనకు
మోగిపొమ్మనకు, చీకటిలో ఇద్దరమే ఉన్నామనుకో
చూడదా సహించని వెన్నెల, దహించిన కన్నులా
కళ్ళు మూసేసుకో హాయిగా
అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మా గొడవలే
పారిపోను కదా, అదిసరే అసలుకధ అవ్వాలికదా
ఏది ఆ సరదా, అన్నిటికీ సిద్ధపడే వచ్చాను కదా
అందుకే అటూఇటు చూడకు, సుఖాలను వీడకు
తొందరేముందిలే విందుకు
ముద్దిమ్మంది బుగ్గ వద్దంటు అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా
ముద్దిమంటే బుగ్గ అగ్గల్లెవస్తే ఆగేదెట్టా హద్దూ పద్దూ వద్దా
అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మా గొడవలే
ముద్దిమ్మంది బుగ్గ వద్దంటు అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా
ముద్దిమంటే బుగ్గ అగ్గల్లెవస్తే ఆగేదెట్టా హద్దూ పద్దూ వద్దా
No comments:
Post a Comment