Title : | Om namami andama |
Movie: | Aavida ma Aavide |
Singers: | Hariharan గారు, K.S. Chitra గారు |
Lyricist: | Sririvennela గారు |
Composer: | Srinivasa Chakravarthi గారు |
Director: | E.V.V. Satyanarayana గారు |
ఓం నమామి అందమా ఆనందమే అందించుమా
ఓం నమామి బంధమా నా నోములే పండించుమా
కౌగిళ్ళ కారాగారం చేరడానికి ఏనేరం చెయ్యాలో మరి
నూరేళ్ళు నీ గుండెల్లో ఉండడానికీ ఏవేమి ఇయ్యాలో మరి
ప్రాణమై చేరుకో ప్రియతమా ఓ...
ఓం నమామి అందమా ఆనందమే అందించుమా
ఓ.. సోన సొగసుమీన నిలువునా నిను మీటనా
నే.. రానా నరనరానా కలవరం కలిగించనా
కళ్ళారా నిన్నేచూస్తూ ఎన్నో కలలే కంటున్నా
ఇల్లాగే నిత్యం ఆకల్లోనే ఉండాలంటున్నా
ఈ క్షణం శాశ్వతం చేయ్యుమా ... ఓ...
ఓం నమామి అందమా ఆనందమే అందించుమా
నీ ఎదలో ఊయలూగే ఊపిరి నాదేమరి
నా ఒడిలో హాయిలాగే అయినది ఈ జాబిలి
ఎన్నెన్నో జన్మాలెత్తి నేనే నేనై పుట్టాలి
అన్నింట్లో మళ్ళి నేనే నీతో నేస్తం కట్టాలి
కాలమే ఏలుమా స్నేహమా ... ఓ...
ఓం నమామి అందమా ఆనందమే అందించుమా
ఓం నమామి బంధమా నా నోములే పండించుమా
కౌగిళ్ళ కారాగారం చేరడానికి ఏనేరం చెయ్యాలో మరి
నూరేళ్ళు నీ గుండెల్లో ఉండడానికీ ఏవేమి ఇయ్యాలో మరి
ప్రాణమై చేరుకో ప్రియతమా ఓ...
No comments:
Post a Comment