Title : | Oho oho oho bulli pavurama |
Movie: | Brundavanvam |
Singers: | S.P. Balasubramanyam గారు, S. Janaki గారు |
Lyricist: | Vennelakanti గారు |
Composer: | Madhavapeddi Suresh గారు |
Director: | Singeetam Srinivasa Rao గారు |
ఒహొ ఒహొ ఒహో బుల్లి పావురమా, అయ్యో పాపం అంటే అదినేరమా
అతివలకింత పంతమా, అలకలు వారి సొంతమా
ఒహొ ఒహొ ఒహో బుజ్జి పావురమా, పదే పదే అదే వెటకారమా
అతివలు అంత సులభమా, ఓ.. శృతి ఇక మించనీకుమా
మాటే వినకుంటే బైటే పడుకుంటే, మంచే పడునంటా మంచే చెబుతుంటా
అమ్మో మగవారు అన్నిట తగువారు, హద్దే మరిచేరు చాలిక ఆ జోరు
కోపం తీరాలంట, తాపం తగ్గాలంట
తాపం తగ్గాలంటే, చొరవే మానాలంట
మాటా మంతీ మర్యాదే అపచారమా ..
ఒహొ ఒహొ ఒహో బుజ్జి పావురమా, పదే పదే అదే వెటకారమా
అతివలకింత పంతమా, అలకలు వారి సొంతమా
నెయ్యం తీయ్యంగ చెయ్యగ రమ్మంటా, వియ్యాల పందిట్లో కయ్యం తగదంట
గిల్లీ కజ్జాలే చెల్లవు పొమ్మంట, అల్లరిచాలిస్తే ఎంతో మేలంట
వెండి వెన్నెలంతా ఎండగా మారిందంట
కొంటే కుర్రాళ్ళకు అదియే సరియంట
తగనీ తెగనీ తగువంతా తన నైజమా
ఒహొ ఒహొ ఒహో బుల్లి పావురమా, అయ్యో పాపం అంటే అదినేరమా
అతివలు అంత సులభమా, ఓ.. శృతి ఇక మించనీకుమా
No comments:
Post a Comment