Wednesday, August 27, 2025

chitapata chinukulu arachetulalo [చిటపట చినుకులు అరచేతులలో ] - Aithe

Title :Chitapata chinukulu
Movie:Aithe
Singers:M.M. Keeravani గారు
Lyricist:Sirivennela Seetharamasastry గారు
Composer:Kalyani Malik గారు
Director:Chandrasekhar Yeleti గారు


చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే 

తరగని సిరులతొ తలరాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే

అడ్డు చెప్పదే అంబ్రెల్లా ఎపుడు ఓ వానా నువ్వొస్తానంటే 

నిధులకు తలుపులు తెరవగ మనకొక ఆలీబాబా వుంటే వుంటే

అడిగిన తరుణమె పరుగులు తీసే అల్లావుద్దీన్ జీనీ వుంటే వుంటే 

చూపదామరి ఆ మాయాదీపం మన ఫేటే ఫ్లైటయ్యే రన్‌వే 


నడిరాత్రే వస్తావే స్వప్నమా, పగలంతా ఏంచేస్తావ్ మిత్రమా 

ఊరికినే ఊరిస్తే న్యాయమా, సరదాగా నిజమైతే నష్టమా 

మోనాలీసా మొహమ్మీదా నిలుస్తావా ఓ చిరునవ్వా ఇలారావా 


వేకువనే మురిపించే ఆశలు, వెనువెంటనే అంతా నిట్టూర్పులు

లోకంలో లేవా ఏ రంగులు, నలుపొకటే చూపాలా కన్నులూ 

ఇలాగేనా ప్రతీరోజూ ఏనాడైనా ఏదోరోజూ మనదైరాదా 

చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే 

తరగని సిరులతొ తలరాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే

No comments:

Post a Comment