Title : | Ranga ranga rangastalana |
Movie: | Rangasthalam |
Singers: | Rahul Sipligunj |
Lyricist: | Chandrabose గారు |
Composer: | Devi Sri Prasad గారు |
Director: | Sukumar గారు |
రంగా రంగ రంగస్థలానా... ఊ..
రంగా రంగ రంగస్థలానా... ఊ.. ఓ..హో.
వినబడేట్టు కాదురా, కనబడేట్టు కొట్టండెహే ..
రంగా రంగ రంగస్థలానా రంగుపూసుకోకున్నా వేషమేసుకోకున్నా
ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా
ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా
హే, రంగా రంగ రంగస్థలానా ఆటమొదలెట్టాకా మధ్యలోని ఆపలేని
ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా
ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా
కనపడని సెయ్యేదో ఆడిస్తున్నా ఆటబొమ్మలం అంటా
వినపడని పాటకి సిందాడేస్తున్నా తోలుబొమ్మలం అంటా
డుంగురూ డుంగురూ డుంగురూ డుముకో డుంగురూ డుంగురూ డుంగురూ
హే.. డుంగురూ డుంగురూ డుంగురూ డుముకో డుంగురూ డుంగురూ డుంగురూ
గంగంటే శివుడుగారి పెళ్ళామంటా, గాలంటే హనుమంతుడి నాన్నగారటా
గాలిపీల్చడానికైన గొంతుతడవడానికైన వాళ్ళు కనికరించాలంట
వేణువంటే కిట్టమూర్తి వాద్యం అంటా, శూలమంటె కాళికమ్మ ఆయుధమంట
పాటపాడడానికైన పోటుపొడవడానికైన వాళ్ళు ఆనతిస్తేనే అన్నీ జరిగేనంట
రంగా రంగ రంగస్థలానా రంగుపూసుకోకున్నా వేషమేసుకోకున్నా
ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా
ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా
పదితలలు ఉన్నోడు రావణుడంట, ఒక్కతలపుకూడ చెడులేదే రాముడికంట
రామరావణులబెట్టి రామాయణమాటగట్టి మంచిచెడులమధ్య మనని పెట్టారంట
ధర్మన్ని తప్పనోడు ధర్మరాజట, దయలేనివాడు యమధర్మరాజట
వీడిబాట నడవకుంటె వాడివేటు తప్పదంటు ఈ బతుకును నాటకంగ ఆడిస్తున్నారంట
రంగా రంగ రంగస్థలానా ఆడడానికంటెముందు సాధనంటుసెయ్యలేని
ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా
ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా
హే.. డుంగురూ డుంగురూ డుంగురూ డుముకో డుంగురూ డుంగురూ డుంగురూ
డుంగురూ డుంగురూ డుంగురూ డుముకో డుంగురూ డుంగురూ డుంగురూ
No comments:
Post a Comment