Title : | Bham bham bhole |
Movie: | Indra |
Singers: | Hari Haran గారు, Sankar Mahadevan గారు |
Lyricist: | Sririvennela Seetaramasastry గారు |
Composer: | Manisharma గారు |
Director: | B. Gopal గారు |
భం భం బోలే శంఖం మోగెలే, ఢం ఢం ఢోలే చెలరేగిందిలే

తద్దినకధిన్ దరువై సందడిరేగని, పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ

విలాసంగ సివానంద లహరి, మహాగంగ ప్రవాహంగ మారి
విశాలాక్షి సమేతంగచేరి, వరాలిచ్చే కాశీపురీ

భం భం బోలే భం భం బోలే భం భం బోలే భోలెనాథ్

బోలే నాచె చం చమా చం, బోలే నాచె చం చమా చం
ఢమరు భాజే ఢమరు భాజె ఢమరు భాజె ఢం ఢమా ఢం
బోలే నాచె చం చమా చం, బోలే నాచె చం చమా చం
వారణసిని వర్ణించే నాగీతిక, నాటి శ్రీనథుని కవితే వినిపించగా
ముక్తికే మర్గంచూపే మణికర్ణిక, అల్లదే అంది నా ఈ చిరుఘంటిక
నమక గమకాలై ఎదలయలే కీర్తన చేయగా
యమక గమకాలై పదగతులే నర్తన చేయగా
ప్రతీ అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా
విలాసంగ సివానంద లహరి, మహాగంగ ప్రవాహంగ మారి
విశాలాక్షి సమేతంగచేరి, వరాలిచ్చే కాశీపురీ
కార్తీకమాసాన వేవేల దీపాల వెలుగంత శివలీల కాదా
ప్రియమార మదిలోని ఈశ్వరుని ధ్యానిస్తే మనకష్టమే తొలగిపోదా
ఎదురయే శిలఏదైన శివలింగమే, మన్ను కాదు మాహాదేవుని వరదానమే
చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే, చరితలకు అందనిదీ కైలాశమే
గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే, గంగలో నిత్యం కనలేద శివకారుణ్యమే
తరలిరండి తెలుసుకోండి కాశిమహిమా..
విలాసంగ సివానంద లహరి, మహాగంగ ప్రవాహంగ మారి
విశాలాక్షి సమేతంగచేరి, వరాలిచ్చే కాశీపురీ
భం భం బోలే శంఖం మోగెలే, ఢం ఢం ఢోలే చెలరేగిందిలే
తద్దినకధిన్ దరువై సందడిరేగని, పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ
తద్దినకధిన్ దరువై సందడిరేగని, పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ
విలాసంగ సివానంద లహరి, మహాగంగ ప్రవాహంగ మారి
విశాలాక్షి సమేతంగచేరి, వరాలిచ్చే కాశీపురీ
No comments:
Post a Comment