Title : | Abbabba iddu |
Movie: | Chudalanivundi |
Singers: | S.P. Balasubramanyam గారు, Sujata గారు |
Lyricist: | Veturi Sundararama sastry గారు |
Composer: | Manisharma గారు |
Director: | Guna Sekhar గారు |
అబ్బబ్బా ఇద్దూ, అదిరేలా ముద్దు
అమ్మమ్మా దిద్దూ, మధురాలా మరు ముద్దు
అబ్బబ్బా ఇద్దూ, అదిరేలా ముద్దు
అమ్మమ్మా దిద్దూ, మధురాలా మరు ముద్దు
చలిపులి పంజా విసిరితే, సల సల కాగే వయసులో
గిలగిల లాడే సొగసుకే జోలాలీ..
అబ్బబ్బా ఇద్దూ, అదిరేలా ముద్దు
అమ్మమ్మా దిద్దూ, మధురాలా మరు ముద్దు
వాటేసుకో వదలకు వలపుల వల విసిరి
వాయించు నీ మురళిని వయసు గాలిపోసి
దోచేయ్యనా దొరికితే దొరకని కోకసిరి
రాసేయ్యనా పాటలే పైటచాటు చూసి
ఎవరికి తెలియవు ఎద రసనసలు
పరువాలాటకు పానుపు పిలిచాకా
తనువు తాకినా తనివి తీరని వేళా..
అబ్బబ్బా ఇద్దూ, అదిరేలా ముద్దు
అమ్మమ్మా దిద్దూ, మధురాలా మరు ముద్దు
జాబిల్లితో జతకలు జగడపు రగడలతో
పోంకాలతో నిలునిలు పొగడమాలలేసి
ఆకాశమే కొలు కొలు తొడిమెడు నడుమిదిగో
సూరీడునే పిలుపిలు చుక్క మంచుసోకి
అలకల చిలకలు చెలి రుసరుసలు
ఇక జాగెందుకు ఇరుకున పడిపోక
మనసుతీరినా వయసులారని వేళా..
అబ్బబ్బా ఇద్దూ, అదిరేలా ముద్దు
అమ్మమ్మా దిద్దూ, మధురాలా మరు ముద్దు
చలిపులి పంజా విసిరితే, సల సల కాగే వయసులో
గిలగిల లాడే సొగసుకే జోలాలీ..
అబ్బబ్బా ఇద్దూ, అదిరేలా ముద్దు
అమ్మమ్మా దిద్దూ, మధురాలా మరు ముద్దు
No comments:
Post a Comment