Title : | Raamma chilakamma |
Movie: | Chudalanivundi |
Singers: | Udit Narayan గారు, Swarnalatha గారు |
Lyricist: | Veturi Sundararama sastry గారు |
Composer: | Manisharma గారు |
Director: | Guna Sekhar గారు |
రామ్మా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా
రామ్మా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా, రాధమ్మా..
పాలే తెలుపన్న, నీళ్ళే నలుపన్న గోపెమ్మా
ముక్కు మీద తీపి కోపాలా, మూగ కళ్ళ తేనే దీపాలా
గంగూలీ సందులో గజ్జెలగోల, బెంగాలి చిందులో మిర్చి మసాలా
అరే వేడెక్కీ వున్నదీ వెన్నెల బాల, మేడెక్కీ దిగదురా మేఘమాల
రామ్మా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా, రాధమ్మా..
పాలే తెలుపన్న, నీళ్ళే నలుపన్న గోపెమ్మా
గోపెమ్మో, గువ్వలేని గూడు కాకమ్మో
కృష్ణయ్యో పువ్వే నాదే పూచె నీదయ్యో
దొంగిలించుకున్న సొత్తు గోవిందా
ఆవలించకుంటె నిద్దరౌతుందా
ఉట్టీకొట్టేవేళ రైకమ్మో చట్టీ దాచిపెట్టు కోకమ్మో
కృష్ణమురారీ వాయిస్తావో చలికోలాటమేదో ఆడిస్తావో
అరె ఆయారే భయ్యా భన్సి భజావో, ఆంధ్రా కన్నయ్యా హాత్ మిలావో
రామ్మా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా, రాధమ్మా..
పాలే తెలుపన్న, నీళ్ళే నలుపన్న గోపెమ్మా
ఓలమ్మో ఛోళీలోన సోకు గోలమ్మో, ఓయమ్మో ఖాళీలేక వేసే ఈలమ్మో
వేణువంటె వెర్రి గాలిపాటేలే
అది వెన్నదోచుకున్న మిన్ను చాటేలే
జట్టేకడితే జంట రావమ్మో, పట్టు విడుపూ ఉంటే మేలమ్మో
ప్రేమాడే కృష్ణుడూ కన్ను కొట్టాలా, పెళ్ళాడే కృష్ణుడూ కాళ్ళుపట్టాలా
అరె అఆయారే నాచితే ఆంధ్రా బాలా, అరె గావోరే డింగుచికు దబ్లీగోలా
రామ్మా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా, రాధమ్మా..
పాలే తెలుపన్న, నీళ్ళే నలుపన్న గోపెమ్మా
ముక్కు మీద తీపి కోపాలా, మూగ కళ్ళ తేనే దీపాలా
గంగూలీ సందులో గజ్జెలగోల, బెంగాలి చిందులో మిర్చి మసాలా
అరే వేడెక్కీ వున్నదీ వెన్నెల బాల, మేడెక్కీ దిగదురా మేఘమాల
No comments:
Post a Comment