Title : | manohara na hrudayamune |
Movie: | Cheli |
Singers: | Bombay Jaysree గారు |
Lyricist: | Bhuvana chandra గారు |
Composer: | Harris Jayraj గారు |
Director: | Gowtham Menon గారు |
మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట
మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట
నా యవ్వనమే నీపరమై పులకించే వేళ
నా ఎదలో ఒకసుఖమే ఊగెనుగా ఉయ్యాల
జడివానై ప్రియా నన్నే చేరుకోమ్మా
శృతిమించుతోంది దాహం ఒక పాంపుపై పవళిద్దాం
కసి కసి పదాలెన్నో ఎన్నో కాసి
నను జయించుకుంటే నేస్తం, నా సర్వస్వం అర్పిస్తా
ఎన్నటికీ మాయదుగా చిగురాకుతొడిగే ఈ బంధం
ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపోవాలీ దేహం
మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
సుధాకర తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట
ఓ ప్రేమ ప్రేమ
సందెవేళ స్నానంచేసే నన్ను చేరి
నా చీరకొంగుతో వొళ్ళు నువ్వు తుడుస్తావే అదో కావ్యం
దొంగమల్లే ప్రియా ప్రియా సడేలేక
వెంకాలనుండి నన్ను హత్తుకుంటావే మధుకావ్యం
నీకోసం మదిలోనే గుడికట్టినానని తెలియనిదా
ఓసారి ప్రియమార ఒడీచేర్చుకోవ నీ చెలిని
మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట
నా యవ్వనమే నీపరమై పులకించే వేళ
నా ఎదలో ఒకసుఖమే ఊగెనుగా ఉయ్యాల
No comments:
Post a Comment