Title : | Komuram bhimudo |
Movie: | RRR |
Singers: | Kaala bhairava |
Lyricist: | Suddala Ashok teja గారు |
Composer: | M.M. Keeravani గారు |
Director: | S.S. Rajamouli గారు |
భీమా నినుగన్న నేలతల్లి, ఊపిరిపోసిన సెట్టూసేమ, పేరుబెట్టిన గోండుజాతి నీతో మట్లాడుతుర్రా.. ఇనబడుతుందా
కొమురం భీముడో కొమురం భీముడో, కొర్రాసునెగడోలే మండాలీ కొడుకో మండాలీ కొడుకో
కొమురం భీముడో కొమురం భీముడో, రగరాగ సూరీడై రగలాలీ కొడుకో రగలాలీ కొడుకో
Make that bastard kneel now..!!
కాల్మొక్తా బాంచేనని వొంగీతోగాలా, కారడవీ తల్లికీ పుట్టానట్టేరో పుట్టానట్టేరో
జునుమూగద్దెకు తలను వొంచితోగాలా, జుడుమూతల్లీ పేగుల పెరగానట్టేరో పెరగానట్టేరో
కొమురం భీముడో కొమురం భీముడో, కొర్రాసునెగడోలే మండాలీ కొడుకో మండాలీ కొడుకో
సెర్మామొలిసే దెబ్బకు ఒప్పంటోగాలా, సినికే రత్తముసూసీ సెదిరితోగాలా
గుబులేసీ కన్నీరు ఒలికితోగాలా
భూతల్లిసనుబాలు తాగానట్టేరో.. తాగానట్టేరో
కొమురం భీముడో కొమురం భీముడో, కొర్రాసునెగడోలే మండాలీ కొడుకో మండాలీ కొడుకో
కాలువైపారే నీగుండేనెత్తురూ,
కాలువైపారే నీగుండేనెత్తురూ, నేలమ్మా నుదుటి బొట్టైతుందీ సూడు
అమ్మా కాళ్ళా పారాణైతుంది సూడు
తల్లీ పెదవులనవ్వై మెరిసింది సూడూ..
కొమురం భీముడో కొమురం భీముడో, పుడమి తల్లికి జనమా హరణామిస్తివిరో కొమురం భీముడో
No comments:
Post a Comment