Title : | E rojaite chusano |
Movie: | Gulabi |
Singers: | Sashi preetam గారు |
Lyricist: | Sirivennela Seetharama sastry గారు |
Composer: | Sashi Preetam గారు |
Director: | Krishna Vamsi గారు |
ఏరోజైతే చూసానో నిన్ను, ఆరోజే నువ్వైపోయా నేను
ఏరోజైతే చూసానో నిన్ను, ఆరోజే నువ్వైపోయా నేను
కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా, నీ ఊపిరినై నే జీవిస్తున్నాను
నీ స్పర్సే ఈ వీచేగాలుల్లో, నీ రూపే నా వేచేగుండెల్లో
నిన్నటి నీ స్మృతులే నన్ను నడిపిస్తూ ఉంటే
ఆ నీ నీడై వస్తాను ఎటువైపున్నా
నీ కష్టంలో నేను ఉన్నాను, కరిగే నీ కన్నీరౌతా నేను
చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి, నీ ఏకాంతంలో ఓదార్పౌతాను
కాలం ఏదో గాయం చేసింది, నిన్నే మాయం చేసానంటొంది
లోకం నన్నే అయ్యో అంటుంది, శొకం కమ్మి జోకొడతావుంది
గాయం కోస్తున్నా, నే జీవించే ఉన్నా, ఆ జీవం నీవని సాక్ష్యం ఇస్తున్నా
నీతో గడిపిన ఆ నిముషాలన్ని, నాలో మోగే గుండెల సవ్వడులే
చెరిగాయంటే నే నమ్మేదెట్టా, నూ లేకుంటే నేనంటూ ఉండనుగా
నీ స్పర్సే ఈ వీచేగాలుల్లో, నీ రూపే నా వేచేగుండెల్లో
నిన్నటి నీ స్మృతులే నన్ను నడిపిస్తూ ఉంటే
ఆ నీ నీడై వస్తాను ఎటువైపున్నా
నీ కష్టంలో నేను ఉన్నాను, కరిగే నీ కన్నీరౌతా నేను
చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి, నీ ఏకాంతంలో ఓదార్పౌతాను
No comments:
Post a Comment