Friday, October 16, 2026

Anuvu anuvuna velasina deva [అణువు అణువున వెలసిన దేవ] - Maanavudu Daanavudu / Manavudu Danavudu

Title :Anuvu anuvuna velasina deva
Movie:Maanavudu Daanavudu
Singers:S.P. Balasubramanyam గారు
Lyricist:C. Narayana Reddy (sinaare) గారు
Composer:Aswatthaama గారు
Director:C Chandrasekhara reddy గారు

అణువు అణువున వెలసిన దేవ, కనువెలుగై మము నడిపించ రావా

అణువు అణువున వెలసిన దేవ


మనిషిని మనిషే కరిచేవేళ, వేషం విషమై కురిసే వేళ

నిప్పులు మింగి నిజమును తెలిపి చల్లని మమతల సుధలను చిలికి

అమరజీవులై వెలిగిన మూర్తుల 

అమరజీవులై వెలిగిన మూర్తుల అమృతగుణం మాకందించరావా 

అమృతగుణం మాకందించరావా 

అణువు అణువున వెలసిన దేవ, కనువెలుగై మము నడిపించ రావా

అణువు అణువున వెలసిన దేవ


జాతికి గ్రహణం పట్టిన వేళ మాతృభూమి ఎరుపెక్కిన వేళ 

స్వరాజ్య సమరం సాగించి, స్వాతంత్ర్యఫలమును సాధించి

ధన్యచరితులై వెలిగిన మూర్తుల 

ధన్యచరితులై వెలిగిన మూర్తుల, త్యాగనిరతి మాకందించరావా 

త్యాగనిరతి మాకందించరావా 

అణువు అణువున వెలసిన దేవ, కనువెలుగై మము నడిపించ రావా

అణువు అణువున వెలసిన దేవ


వ్యాదులు బాధలు ముసిరే వేళ, మృత్యువు కోరలు సాచేవేల 

గుండెకు బదులుగ గుండెను పొదిగి, కొనఊపిరులకు ఊపిరులూది  

జీవనదాతలై వెలిగిన మూర్తుల, 

జీవనదాతలై వెలిగిన మూర్తుల, సేవాగుణం మాకందించరావా 

సేవాగుణం మాకందించరావా 

అణువు అణువున వెలసిన దేవ, కనువెలుగై మము నడిపించ రావా

అణువు అణువున వెలసిన దేవ 

No comments:

Post a Comment