| Song Name : | Kalake kalavo |
| Movie: | Amavasya Chandrudu |
| Singers: | S.P. Bala subramanyam garu |
| Lyricist: | Veturi Sundararama murthy garu |
| Composer: | Illayaraja garu |
| Director | Singeetam Srinivasa rao garu |
కళకే కళ ఈ అందమూ, ఏ కవీ రాయనీ తీయ్యనీ కావ్యమూ
కళకే కళ ఈ అందమూ
నీలి కురులు పోటీ పడెను మేఘమాలతో..
కోల కనులు పంతాలాడే గండుమీలతో.
వదనమో జలజమో నుదురదీ ఫలకమో
చెలి కఠం పలికే శ్రీ శంఖము
కళకే కళ ఈ అందమూ
పగడములను ఓడించినవీ చిగురు పెదవులు .. హా...
వరుసతీరి మెరిసే పళ్ళు మల్లె తొడుగులు
చూపులో తూపులో చెంపలో కెంపులో
ఒక అందం తెరలో దోబూచులు
కళకే కళ ఈ అందమూ
తీగలాగ ఊగే నడుము ఉండిలేనిది
దాని మీద పూవై పూచి నాభి ఉన్నదీ
కరములో కొమ్మలో కాళ్ళవీ బోదెలో
ఈ రూపం ఇలలో అపురూపము
కళకే కళ ఈ అందమూ

No comments:
Post a Comment