Friday, November 28, 2014

Andamaa Nee Peremiti..[అందమా.. నీ పేరేమిటి] from Allari Priyudu


Song Name :Andamaa Nee Peremiti..
Movie:Allari Priyudu
Singers:S.P. Balu
Lyricist:Veturi Sundararama Murthy
Composer:M.M.Keeravani
DirectorK.Raghavendra Rao




పల్లవి:
అందమా.. నీ పేరేమిటి అందమా?
అందమా.. నీ పేరేమిటి అందమా?
ఒంపుల హంపీ శిల్పమా? బాపూ గీసిన చిత్రమా?
తెలుపుమా తెలుపుమా తెలుపుమా....

పరువమా.. నీ ఊరేమిటి పరువమా?

పరువమా.. నీ ఊరేమిటి  పరువమా?
కృష్ణుని మధురా నగరమా? కృష్ణా సాగర కెరటమా?
తెలుపుమా తెలుపుమా తెలుపుమా....

చరణం1:
ఏ రవీంద్రుని భావమో గీతాంజలీ కళ వివరించే
ఎండతాకని పండు వెన్నెల.. గగనమొలికె నా కన్నుల..
ఎంకి పాటల రాగమే గోదారి అలలపై నిదురించే..
మూగబోయిన రాగ మాలిక ముసిరె నిపుడు నా గొంతున..
సంగీతమా.. ఆ.. ఆ.. ఆ..
నీ నింగిలో ఓ..ఓ..ఓ...
విరిసిన స్వరములే ఏడుగా వినబడు హరివిల్లెక్కడ?
తెలుపుమా తెలుపుమా తెలుపుమా....

అందమా.. నీ పేరేమిటి అందమా?

తెలుపుమా నీ ఊరేమిటి పరువమా?

చరణం2:
భావ కవితల బరువులో ఆ కృష్ణశాస్త్రి లా కవినైతే..
హాయి రెమ్మల కోయిలమ్మకు విరుల ఋతువు వికసించదా..?
తుమ్మెదడగని మధువులే చెలి సాకి వలపులే చిలికిస్తే
మాయ జగతికి ఏ ఖయామో మధుర కవిత వినిపించడా..?
ఓ కావ్యమా.. ఆ..ఆ..ఆ...
నీ తోటలో.. ఓ.. ఓ.. ఓ..
నవరస పోషణే గాలిగా.. నవ్విన పూలే మాలగా..
పూజకే సాధ్యమా.. తెలుపుమా...

అందమా.. నీ పేరేమిటి అందమా?

అందమా.. నీ పేరేమిటి అందమా?
ఒంపుల హంపీ శిల్పమా? బాపూ గీసిన చిత్రమా?
తెలుపుమా తెలుపుమా తెలుపుమా.... 

13 comments: