| Song Name : | Yamaha Nagari.. |
| Movie: | Chudalani Undi |
| Singers: | Hariharan |
| Lyricist: | Veturi Sundararama Murthy |
| Composer: | Mani Sharma |
| Director: | Gunasekhar |
ఆలాపన:
స రి మా మ గా రీ స స సనిధప స..
స రి మా మ గా రీ స స సనిధప స..
రి మ ధా ని ధ ప సా సనిధప మగపమరీ..
యమహా నగరీ కలకత్తా పురీ..
పల్లవి:
యమహా నగరీ కలకత్తా పురి..
నమహో హుగిలి హౌరా వారధి
యమహా నగరీ కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి
యమహా నగరీ కలకత్తా పురీ..
నమహో హుగిలీ హౌరా వారధీ
చరణం 1:
నేతాజీ పుట్టినచోట గీతాంజలి పూసినచోట
పాడనా..తెలుగులో..
ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట
సాగనా...
పద గురూ పరుగు తీసింది పట్నం..
బ్రతుకుతో వేయి పందెం
కడకు చేరాలి గమ్యం కదిలిపోరా..
ఒకరితొ ఒకరికి
ముఖపరిచయములు
దొరకని క్షణముల
బిజిబిజి బ్రతుకుల
గజిబిజి ఉరుకుల పరుగులలో..
యమహా నగరీ కలకత్తా పురీ..
నమహో హుగిలి హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి
యమహా నగరీ కలకత్తా పురీ..
చరణం 2:
బెంగాలీ కోకిల బాల
తెలుగింటి కోడలు పిల్ల
మానినీ.. సరోజినీ...
రోజంతా సూర్యుని కింద
రాత్రంతా రజినిగంధా సాగనీ
పదుగురు ప్రేమలే లేని లోకం
దేవతా మార్కు మైకం
శరన్నవలాభిషేకం తెలుసుకోరా..
కలలకు నెలవట
కళళకు కొలువట
తిథులకు శెలవట
అతిథుల గొడవట
కలకట నగరపు కిటకిటలో..
యమహా నగరీ కలకత్తా పురి..
నమహో హుగిలి హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి
యమహా నగరీ కలకత్తా పురి..
చరణం 3:
వందేమాతరమే అన్న
వంగా భూతలమే మిన్న
జాతికే కీర్తిరా..
మాతంగి కాళీ నిలయ
చోరంగి రంగుల దునియా నీదిరా...
వినుగురూ.. సత్యజిత్ రే సితారా
ఎస్ డి బర్మన్ కిథారా
థెరిస్సా కే కుమారా..
కదిలి రారా..
జనగణమనముల
స్వరపద వనముల
హృదయపు లయలను
శృతిపరచిన ప్రియ
శుకపికముఖసుఖ రవళులతో..
యమహా నగరీ కలకత్తా పురీ..
నమహో హుగిలి హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి
చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మరి
యమహా నగరీ కలకత్తా పురీ..
నమహో హుగిలి హౌరా వారధీ...

No comments:
Post a Comment