Song Name: | Entha Entha Vintha Mohamo |
Movie: | Bhairava Dweepam |
Singers: | S.P.Balu, Sandhya |
Lyricist: | Sirivennela Seetarama Sastry |
Composer: | Madhavapeddi Suresh |
Director: | Singeetam Srinivasarao |
ఆలాపన :
చందమామ వచ్చినా చల్లగాలి వీచినా...
చిచ్చు ఆరదేలనమ్మా..
ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా...
చందనాలు పూసినా ఎంత సేవ చేసినా...
చింత తీరదేలనమ్మా?
ఓ సఖియా ఉన్నమాట ఒప్పుకోమ్మా...
జంట లేదనా..?? హా.. హా..హా...
ఇంత వేదనా..?? హో.. హో... హో...
జంట లేదనా.. ఇంత వేదనా..
ఎంత చిన్నబోతివమ్మా... ఆ...
చందమామ వచ్చినా చల్లగాలి వీచినా...
చిచ్చు ఆరదేలనమ్మా..
ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా...
ఓ సఖియా ఉన్నమాట ఒప్పుకోమ్మా...
ఓ ఓ ఓ.... మురిపాల మల్లికా....
దరిజేరుకుంటినే... పరువాల వల్లికా...
ఇది మరులుగొన్న మహిమో...
నిను మరువలేని మైకమో...
పల్లవి:
ఎంత ఎంత వింత మోహమో...
రతి కాంతుని శృంగార మంత్రమో..
ఎంత ఎంత వింత మోహమో...
రతి కాంతుని శృంగార మంత్రమో..
మరు మల్లెల సరమో..
విరి విల్లుల శరమో..
మరు మల్లెల సరమో..
విరి విల్లుల శరమో..
ప్రణయానుబంధమెంత చిత్రమో..
ఎంత ఎంత వింత మోహమో...
రతి కాంతుని శృంగార మంత్రమో..
చరణం1:
విరిసిన వనము యవ్వనము..
పిలిచింది చిలిపి వేడుకా...
కిలకిల పాట గా...
చలువల వరము.. కలవరము..
తరిమింది తీపి కోరికా
చెలువను చూడగా..
దరిశనమీయవే.. సరసకు చేరగా...
తెరలను తీయవే.. తళుకుల తారకా..
మదనుడి లేఖ, శశి రేఖ, అభిసారికా..
ఎంత ఎంత వింత మోహమో...
రతి కాంతుని శృంగార మంత్రమో.
చరణం 2:
కలలను రేపే కళ ఉంది..
అలివేణి కంటి సైగలో..
జిగిబిగి సోకులో..
ఎడదను ఊపే ఒడుపుంది..
సుమబాల తీగమేనిలో
సొగసుల త్రావి లో..
కదలని ఆటగా.. నిలిచిన వేడుకా..
బదులిడరావుగా.. పిలిచిన కోరికా..
బిడియమదేల, ప్రియురాలా, మణిమేఖలా...
ఎంత ఎంత వింత మోహమో...
రతి కాంతుని శృంగార మంత్రమో..
మరు మల్లెల సరమో..
విరి విల్లుల శరమో..
మరు మల్లెల సరమో..
విరి విల్లుల శరమో..
ప్రణయానుబంధమెంత చిత్రమో..
ఎంత ఎంత వింత మోహమో...
రతి కాంతుని శృంగార మంత్రమో..
No comments:
Post a Comment