Thursday, October 3, 2024

బతుకమ్మ బతుకమ్మ (batukamma)

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 

తంగెళ్ళో దొరికిన తల్లి మా తల్లీ బతుకమ్మ

ఏ తల్లి కన్నదొ నిన్నూ మా తల్లీ బతుకమ్మ

నింగి నెలవంక ఓలే కడిగీన ముత్యామోలే కనువిందు చేసినావే మా పల్లెదీపం నీవే 

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 


స్వామి కోనేటి నీరే నీ తానానికి పన్నీరే

వీసే సిరుగాలి గంధం నీ మోముకుదిద్దేనందం 

నిను సూసి పత్తీ మురిసే, నీకోసం పొత్తిలి పరిసె 

సిలకమ్మా జోలపాడే సిన్నారీ నిద్దురపోవె 

వాలుబొమ్మన ఉయ్యాల ఊగాలి నూ జంపాల 

నీ బోసినవ్వులతోనె మా ఆశలు వికశించాల 

నీ పాదం మోపిన నేల సిగురించి సిందెయ్యాల 

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 


సేమంతీ పూసినట్టు  సెలయేరు నవ్వీనట్టు 

పొదనుండీ దూకీ జింక పొద్దువైపురికీనట్టూ   

వడి వడి నీ అడుగూలెంట ఊరంతా నడిసేనంట 

ఊట బావీ మోట నీ పాటకు దరువుల మోత 

ఊగేటి సద్దా సేను నీ మాటకు తలలూపంట 

అలమంద ఆగుధూళి నీ పాదాలకు పారాణి 

మా ఆశల ప్రతిరూపానివి బతుకమ్మ నువ్ మారాణి 

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 

తంగెళ్ళో దొరికిన తల్లి మా తల్లీ బతుకమ్మ

ఏ తల్లి కన్నదొ నిన్నూ మా తల్లీ బతుకమ్మ

నింగి నెలవంక ఓలే కడిగీన ముత్యామోలే కనువిందు చేసినావే మా పల్లెదీపం నీవే

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ  


చిత్తూ చిత్తులబొమ్మ శివుడీ ముద్దలగుమ్మ (chittu chittula bomma)

చిత్తూ చిత్తులబొమ్మ శివుడీ ముద్దలగుమ్మ 

చిత్తూ చిత్తులబొమ్మ శివుడీ ముద్దలగుమ్మ 

బంగారుబొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన 

బంగారుబొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన 

చిత్తూ చిత్తులబొమ్మ శివుడీ ముద్దలగుమ్మ 

చిత్తూ చిత్తులబొమ్మ శివుడీ ముద్దలగుమ్మ 

బంగారుబొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన 

బంగారుబొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన 

రాగి బిందెదీస్కా రమణి నీళ్ళాకుపోతె 

రాగి బిందెదీస్కా రమణి నీళ్ళాకుపోతె 

రాములోరు ఎదురాయెనమ్మో ఈ వాడలోన  

రాములోరు ఎదురాయెనమ్మో ఈ వాడలోన  

ముత్యాల బిందెదీస్కా ముదిత నీళ్ళాకుపోతె 

ముత్యాల బిందెదీస్కా ముదిత నీళ్ళాకుపోతె 

ముద్దుకృష్ణుడెదురాయెనమ్మో ఈ వాడలోన  

ముద్దుకృష్ణుడెదురాయెనమ్మో ఈ వాడలోన  

వెండీ బిందెదీస్కా వెలదీ నీళ్ళాకుపోతె 

వెండీ బిందెదీస్కా వెలదీ నీళ్ళాకుపోతె 

వెంకటేశుడెదురాయెనమ్మో ఈ వాడలోన  

వెంకటేశుడెదురాయెనమ్మో ఈ వాడలోన  

పగిడీ బిందెదీస్కా పడతీ నీళ్ళాకుపోతె 

పగిడీ బిందెదీస్కా పడతీ నీళ్ళాకుపోతె 

పరమేశుడెదురాయెనమ్మో ఈ వాడలోన  

పరమేశుడెదురాయెనమ్మో ఈ వాడలోన  

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో (Batukamma uyyalo)

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో 

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో 

ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో 

ఆ రాజు భర్యయూ ఉయ్యాలో అతిసత్యవతియండ్రు ఉయ్యాలో 

నూరు నోములు నోమి ఉయ్యాలో నూరు మందినిగాంచె ఉయ్యాలో 

వారు శూరులయ్యి ఉయ్యాలో వైరులచే హతమైరి ఉయ్యాలో 

తల్లిదండ్రులపుడు ఉయ్యాలో తరగాని శొకమున ఉయ్యాలో 

ధనధాన్యములబాసి ఉయ్యాలో దాయాదులబాసి ఉయ్యాలో 

వనితతో ఆ రాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో

కలికి లక్ష్మినిగూర్చి ఉయ్యాలో ఘనతపంబొనరింప ఉయ్యాలో

Wednesday, October 2, 2024

ఒక్కడై రావడం ఒక్కడై పోవడం (Aa Naluguru)

Song Name :Aa naluguru
Movie:Aa Naluguru
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Chaitanya Prasad garu
Composer:R.P. Patnaik garu
DirectorChandra Siddartha garu


ఒక్కడై రావడం ఒక్కడై పోవడం, నడుమ ఈ నాటకం విధిలీల

వెంట ఏ బంధము రక్తసంబంధము, తోడుగా రాదుగ తుదివేళ 

మరణమనేది ఖాయామని, మిగిలెను కీర్తిఖాయమని 

నీ బరువూ ని పరువూ మోసేదీ... ఆ నలుగురూ ... ఆ నలుగురూ..

ఆ నలుగురూ..ఆ నలుగురూ..


నలుగురూ మెచ్చిన నలుగురూ తిట్టినా, విలువలే శిలువగ మోసావు

అందరూ సుఖపడే సంఘమే కోరుతూ, మందిలో మార్గమే వేశావు

నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగ 

నీ వెనకే అనుచరులై నడిచారు...ఆ నలుగురూ.. ఆ నలుగురూ..

ఆ నలుగురూ.. ఆ నలుగురూ..


పోయిరా నేస్తమ పోయిరా ప్రియతమ, నీవుమా గుండెలో నిలిచావు

ఆత్మయే నిత్యము జీవితం సత్యము, చేతలే నిలుచురా కలకాలం 

బతికిననాడు బాసటగ పోయిన నాడు ఊరటగ 

అభిమానం అనురాగం చాటేదీ ఆ నలుగురూ.. ఆ నలుగురూ.. 

ఆ నలుగురూ.. ఆ నలుగురూ.. 

ప్రతిదినం నీ దర్శనం (Anumaanaspadam)

Song Name :Prati dinam nee darsanam
Movie:Anumanaspadam
Singers:Shreya goshal garu, Unni krishnan garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Illayaraja garu
DirectorVamsy garu


ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా 
నిను చూడలేని రోజు నాకు రోజుకాదు
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా 
నిను చూడలేని రోజు నాకు రోజుకాదు
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా 

నిదురేరాదు రాత్రంతా కలలు నేసెనాకు
వినగలనంటే తమాషగా ఒకటిచెప్పనా చెప్పు
ఇంద్రధనుస్సు కింద కూర్చునీ మాట్లాడదాం
అలాగే చందమామ తోటి కులాసా ఊసులాడదాం 
వింటుంటే వింతగావుంది కొత్తగావుంది ఎమిటీ కధనం
పొరపాటు కథ కాదు గతజన్మలోన జాజిపూలసువాసనేమో 
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా 
నిను చూడలేని రోజు నాకు రోజుకాదు
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా 

పూవుల నదిలో అందంగా నడుచుకుంటుపోనా    
ఊహలరచనే తియ్యంగ చేసి తిరిగిరానా  
వెన్నెలపొడిని నీ చెంపలకి రాసిచూడనా
సంపంగి పూల పరిమళం వయసుకి అద్ది ఆడనా     
అదేంటో మైకమే నను వదలినా పొద జరగదూ నిజమో 
జడివాన కురవాలి యదలోయలోకి జారిపోయె దారి చూడు     
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా 
నిను చూడలేని రోజు నాకు రోజుకాదు
ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణక్షణం నీ అర్చనం ఇక జరపనా