Thursday, October 3, 2024

బతుకమ్మ బతుకమ్మ (batukamma)

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 

తంగెళ్ళో దొరికిన తల్లి మా తల్లీ బతుకమ్మ

ఏ తల్లి కన్నదొ నిన్నూ మా తల్లీ బతుకమ్మ

నింగి నెలవంక ఓలే కడిగీన ముత్యామోలే కనువిందు చేసినావే మా పల్లెదీపం నీవే 

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 


స్వామి కోనేటి నీరే నీ తానానికి పన్నీరే

వీసే సిరుగాలి గంధం నీ మోముకుదిద్దేనందం 

నిను సూసి పత్తీ మురిసే, నీకోసం పొత్తిలి పరిసె 

సిలకమ్మా జోలపాడే సిన్నారీ నిద్దురపోవె 

వాలుబొమ్మన ఉయ్యాల ఊగాలి నూ జంపాల 

నీ బోసినవ్వులతోనె మా ఆశలు వికశించాల 

నీ పాదం మోపిన నేల సిగురించి సిందెయ్యాల 

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 


సేమంతీ పూసినట్టు  సెలయేరు నవ్వీనట్టు 

పొదనుండీ దూకీ జింక పొద్దువైపురికీనట్టూ   

వడి వడి నీ అడుగూలెంట ఊరంతా నడిసేనంట 

ఊట బావీ మోట నీ పాటకు దరువుల మోత 

ఊగేటి సద్దా సేను నీ మాటకు తలలూపంట 

అలమంద ఆగుధూళి నీ పాదాలకు పారాణి 

మా ఆశల ప్రతిరూపానివి బతుకమ్మ నువ్ మారాణి 

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 

తంగెళ్ళో దొరికిన తల్లి మా తల్లీ బతుకమ్మ

ఏ తల్లి కన్నదొ నిన్నూ మా తల్లీ బతుకమ్మ

నింగి నెలవంక ఓలే కడిగీన ముత్యామోలే కనువిందు చేసినావే మా పల్లెదీపం నీవే

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ 

బతుకమ్మ బతుకమ్మ, మా తల్లీ బతుకమ్మ  


No comments:

Post a Comment