Song Name : | Swatilo mutyamanta |
Movie: | Bangaru Bullodu |
Singers: | S.P. Balasubramanyam garu, K.S. Chitra Garu |
Lyricist: | Veturi Sundara rama murthy garu |
Composer: | Raj-Koti garu |
Director | Raviraja Pinisetty garu |
వాన వాన వచ్చేనంట వాగు వంక మెచ్చేనంట
తీగ డొంక కదిలేనంట తట్టా బుట్ట తడిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగ కోండా కోనా నీళ్ళాడంగ
కృష్ణా గోదరమ్మ కలిసి పరవళ్ళెత్తి పరుగెత్తంగ
వాన వాన వచ్చేనంట వాగు వంక మెచ్చేనంట
స్వాతిలో ముత్యమంత, ముద్దులా ముట్టుకుంది సందె వానా
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా
అల్లో మల్లో అందాలెన్నో యాలో యాల
స్వాతిలో ముత్యమంత, ముద్దులా ముట్టుకుంది సందె వానా
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా
తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ
మేనక మెరుపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా
కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ
శ్రావణ సరిగమ యెవ్వన ఘుమఘుమలయ నీదమ్మా
వానా వానా వల్లపా వాటేస్తేనే తప్పా
సిగ్గు యెగ్గు చెల్లప్పా కాదయ్యో నీ గొప్పా
నీలో మేఘం నాలో దాహం యాలో యాల
స్వాతిలో ముత్యమంత, ముద్దులా ముట్టుకుంది సందె వానా
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా
వాన వాన వచ్చేనంట వాగు వంక మెచ్చేనంట
తీగ డొంక కదిలేనంట తట్టా బుట్ట తడిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగ కోండా కోనా నీళ్ళాడంగ
కృష్ణా గోదరమ్మ కలిసి పరవళ్ళెత్తి పరుగెత్తంగ
తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వానా
తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమను వొణికే వాన
జన్మకు దొరకని మన్మధ తళుకులు ముదిరే వానా
చాలని గొడుగున నాలుగు ఆదుగుల నటనే వాన
వానల్లోన సంపెంగా వొళ్ళంత ఓ బెంగా
గాలివానా గుళ్ళోనా ముద్దేలే జేగంట
నాలో రూపం నీలో తాపం యాలో యాల
వాన వాన వచ్చేనంట వాగు వంక మెచ్చేనంట
తీగ డొంక కదిలేనంట తట్టా బుట్ట తడిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగ కోండా కోనా నీళ్ళాడంగ
కృష్ణా గోదరమ్మ కలిసి పరవళ్ళెత్తి పరుగెత్తంగ
No comments:
Post a Comment