| Song Name : | Kinnerasani vachchindamma |
| Movie: | Sitara |
| Singers: | S.P. Balasubramanyam garu, S.P. Sailaja garu |
| Lyricist: | Veturi Sundara rama murthy garu |
| Composer: | Illayaraja garlu |
| Director | Vamsi garu |
జమక్కు జమక్కు జింజిన్న జింజిన్న జమక్కు జమక్కు జిన్న జిన్న జిన్న
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ
జమక్కు జమక్కు జింజిన్న జింజిన్న జమక్కు జమక్కు జిన్న జిన్న జిన్న
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ
విశ్వనాధ పలుకై అది విరుల తేనె చినుకై, కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
పచ్చని చేల.. పావడ కట్టీ..
పచ్చని చేల.. పావడ కట్టీ.. కొండమల్లెలే కొప్పునబెట్టి.. వచ్చే దొరసాని.. మా వన్నెల కిన్నెరసాని
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ
ఎండలకన్నే సోకని రాణీ.. పల్లెకు రాని పల్లవపాణి
కోటను విడిచి పేటను విడిచి
కోటను విడిచి పేటను విడిచి
కనులా గంగ పొంగే వేళ, నదిలా తానే సాగే వేళ
రాగాల రాదారి పూదారి అవుతుంటే, ఆ రాగాల రాదారి పూదారి అవుతుంటే
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ
మాగాణమ్మా చీరలు నేసే, మలిసందెమ్మా కుంకుమ పూసే
మువ్వల బొమ్మా ముద్దుల గుమ్మా
మువ్వల బొమ్మా ముద్దుల గుమ్మా
గడపా దాటీ నడిచేవేళ, అదుపే విడిచీ ఎగిరే వేళ
వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే, ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ
విశ్వనాధ పలుకై అది విరుల తేనె చినుకై, కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
పచ్చని చేల.. పావడ కట్టీ..
పచ్చని చేల.. పావడ కట్టీ.. కొండమల్లెలే కొప్పునబెట్టి.. వచ్చే దొరసాని.. మా వన్నెల కిన్నెరసాని
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసీ

No comments:
Post a Comment