Title : | Jivvumani kondagali |
Movie: | Lankeswarudu |
Singers: | Mano (Nagur babu) గారు, S. Janaki గారు |
Lyricist: | Dasari Narayana Rao గారు |
Composer: | Raj- Koti గారు |
Director: | Dasari Narayana Rao గారు |
జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది, వెచ్చని కోరిక రగిలిందిలే
నీవే నా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమగీతం
కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది , తియ్యని కానుక దొరికిందిలే
నీవేనా ప్రేమవులే, నీకేలే అందుకో ప్రేమగీతం
జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది
ఒంపుల్లో సొంపుల్లో అందముంది, కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
ఒంపుల్లో సొంపుల్లో అందముంది, కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
కాశ్మీరకొండల్లో అందాలకే, కొత్త అందాలు ఇచ్చావో
కాశ్మీరవాగుల్లో పరుగులకే, కొత్త అడుగుల్ని నేర్పావో
నేనే నిను కోరి చేరి వాలిపోయాలి
కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది
మంచల్లే కరగాలి మురిపాలు, సెలయేరల్లే ఉరకాలి యెవ్వనాలు
మంచల్లే కరగాలి మురిపాలు, సెలయేరల్లే ఉరకాలి యెవ్వనాలు
కొమ్మల్లో పూలన్ని కానుకగా మన ముందుంచే పూలగాలి
పూవుల్లో దాగున్న అందాలనే మన ముందుంచే గంధాలుగా
నేనే నిను కోరి చేరి వాలిపోవాలి
జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది
కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది