Showing posts with label vassishta. Show all posts
Showing posts with label vassishta. Show all posts

Saturday, September 13, 2025

Rama rama [రామ రామ రామ రామ] - Viswambhara

Title :Rama Rama Rama Rama
Movie:Viswambhara
Singers:Shankar Mahadevan గారు, Lipsika
Lyricist:RamaJogayya Sastry గారు
Composer:M.M. Keeravani గారు
Director:Vassishta గారు

రామ...శ్రీ రామా. జై శ్రీరామ్

రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ (4)

హే తయ్యతక్క తక్కధిమి చెక్కాభజనాలాడి రాములోరి గొప్ప చెప్పుకుందామా 

ఆ సాములోరి పక్కనున్న సీతామాలచ్చుమమ్మ లక్షణాలు ముచ్చటించుకుందామా 

నీ గొంతుకలిపి మా వంత పాడగ రావయ్య అంజని హనుమా 

రామయ్య కీర్తన నోరార పలుకగ చిరంజీవి నీ జనుమ 

రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ (4)

శివుని ధనువు వొంచినోడు, రావణ మదము తెంచినోడు 

ధర్మము విలువ పెంచినోడు, దశరథ సుతుడు

అతడిజంటగ అమ్మతోడూ, మాయమ్మ సీతమ్మ సరిజోడు 

పట్టినమగని కొనవేలు , వీడలేదు ఎపుడూ  

పాదుకల్ని మోసినోడు తమ్ముడంటె వాడు 

ఆ తమ్ముడికి రాజ్యమిచ్చి అడవికేగినాడు 

అన్నయ్యంటే ఇతడు 

హే, రంగరంగ వైభవాల రామాకళ్యణవేళ, సంబరాల పాటపాడుకుందామ 

హే రంగురంగు ఉత్సవాల కోలాటమాడుకుంటు, చిన్నపెద్ద చిందులాడుకుందామా 

నీ గొంతుకలిపి మా వంత పాడగ రావయ్య అంజని హనుమా 

రామయ్య కీర్తన నోరార పలుకగ చిరంజీవి నీ జనుమ 

రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ (4)