| Song Name : | Jagadananda karaka |
| Movie: | Sri Rama Rajyam |
| Singers: | S.P. Bala subramanyam garu, Shreya Goshal garu |
| Lyricist: | Jonnavittula garu |
| Composer: | Illayaraja garu |
| Director | Bapu garu |
జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా
జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా
జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా
మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక ఔగాక, మా జీవనమే ఇక పావనమౌగాకా
నీ పాలన శ్రీకరమౌగాక, సుఖశాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమసుధామయమౌగాక
జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా
సార్వభౌమునిగ పూర్వకుంభముల స్వాగతాలుపలికే, రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాలపాడే
నాల్గువేదములు తన్మయత్వమున జలధి మారుమ్రోగే, న్యాయదేవతే శంఖమూదగ పూలవానకురిసే
రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం
సూర్యవంశ సింహాసనం పులకించిచేసె అభివందనం
సామ్రాజ్యలక్ష్మియే పాదస్పర్శకి పరవశించిపోయే
జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా
జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా
రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే, రామ శాసనము తిరుగులేనిదని జలధి గోధ చేసే
రామదర్శనము జన్మధన్యమని రాయికూడ తెలిపే, రామరాజ్యమే పౌరులందరిని నీతిబాట నిలిపే
రామమంత్రమే తారకం బహు శక్తి ముక్తి సందాయకం
రామనామమే అమృతం శ్రీరామకీర్తనం సుకృతం
ఈ రామచంద్రుడే లోకరక్ష అని అంతరాత్మ పలికే
జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా
జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా
మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక ఔగాక, మా జీవనమే ఇక పావనమౌగాకా
నీ పాలన శ్రీకరమౌగాక, సుఖశాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమసుధామయమౌగాక
జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా

Very good taken to add in your blog!👍👌🙏
ReplyDeleteThere are some mistakes please check
ReplyDeleteWould you kindly point out what are those?
DeleteVery good
ReplyDeleteIn second charanam it's not theru lenedani it's therugu lenidhgani
ReplyDeleteThanks. Good catch. corrected it now.
Delete