| Song Name : | Laali jo laali jo |
| Movie: | Indrudu chandrudu |
| Singers: | S.P. Bala subramanyam garu |
| Lyricist: | Sirivennela Seetaraama Sastry garu |
| Composer: | Illayaraja garu |
| Director | Suresh krishna garu |
లాలి జో లాలి జో ఊరుకో పాపాయి, పారిపోనీకుండా పట్టుకో నాచేయి
లాలి జో లాలి జో ఊరుకో పాపాయి, పారిపోనీకుండా పట్టుకో నాచేయి
తెలుసా ఈ ఊసు, చెబుతా తల ఉంచు
కాపురం చేస్తున్నా పావురం ఒకటుందీ
ఆలినే కాదందీ కాకినే కూడిందీ
అంతలో ఎవైందీ అడగవే పాపాయి, పారిపోనీకుండా పట్టుకో నాచేయి
మాయనే నమ్మిందీ బోయతో పోయింది
దెయ్యమే పూనిందో రాయిలా మారింది
వెళ్ళే పెడదారిలో ముళ్ళే పొడిచాకనే
తప్పిదం తెలిసిందీ ముప్పునే చూసింది
కన్నులే విప్పిందీ గండమే తప్పింది
ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నాచేయి
పిల్లలూ ఇల్లాలూ ఎంతగా ఎడ్చారు
గుండెలో ఇన్నాళ్ళూ కొండలే మోసారు
నేరం నాదైనా భారం నీ పైన
తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా
తల్లిలా మన్నించూ మెల్లగ దండించు
కాళిలా మారమ్మా కాలితో తన్నమ్మా
బుద్ధిలో లోపాలే దిద్దుకోనీవమ్మా

Namaskaram andi, ee paata vraasindhi veturi garu kaadhu, sirivennela seetharaama sastry garu. dayachesi saricheyagalaru.
ReplyDeleteDone. Thank you andi
Delete