Saturday, January 19, 2013
Ghallu Ghallu [ఘల్లు ఘల్లు] - Swana Kamalam
Title : Ghallu ghallu
Movie: Swarna Kamalam
Singers: S.P. Bala Subramanyam గారు , P. Suseela గారు
Lyricist: Sirivennala Seetarama sastry గారు
Composer: Illayaraja గారు
Director: K. Vishwanath గారు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
నల్లమబ్బు చల్లని చల్లని చిరుఝల్లు (2)
పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
వెల్లువొచ్చి సాగని తొలకరి అల్లర్లు (2)
ఎల్లలన్నవే ఎరుగని వేగంతో వెళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
లయకే నిలయమై నీపాదం సాగాలి... మలయానిలగతిలో సుమబాలగ తూగాలి
వలలో ఒదుగునా విహరించే చిరుగాలి.. సెలయేటికి నటనం నేర్పించే గురువేడి
తిరిగే కాలానికీ.... ఆ....ఆ....ఆ....ఆ....
తిరిగే కాలానికి తీరొకటుంది.... అదినీ పాఠానికి దొరకను అంది
నటరాజస్వామి ఝాటాఝూటిలోకి చేరకుంటే విరిచుకుపడు సురగంగకు విలువేముంది.. విలువేముంది
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
దూకేఅలలకు ఏ తాళం వేస్తారు... కమ్మని కలల పాట ఏ రాగం అంటారు
అలలకు అందునా ఆశించిన ఆకాశం.. కలలా కరగడమా జీవితాన పరమార్ధం
వద్దని ఆపలేరు.... ఆ... ఆ... ఆ... ఆ...
వద్దని ఆపలేరు ఉరికే ఊహని... హద్దులు దాటరాదు ఆశల వాహిని
అలుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటె విరివనముల పరమళముల విలువేముందీ... విలువేముందీ
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
నల్లమబ్బు చల్లని చల్లని చిరుఝల్లువెల్లువొచ్చి సాగని
తొలకరి అల్లర్లుపల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
English
ghallu ghallu ghallumaMTu merupallE tuLLu
jhallu jhallu jhalluna uppOMgu niMgi voLLu
nallamabbu challani challani chirujhallu (2)
pallaviMchani nElaku pachchani paravaLLu
ghallu ghallu ghallumaMTu merupallE tuLLu
jhallu jhallu jhalluna uppOMgu niMgi voLLu
velluvochchi sAgani tolakari allarlu (2)
ellalannavE erugani vEgaMtO veLLu
ghallu ghallu ghallumaMTu merupallE tuLLu
jhallu jhallu jhalluna uppOMgu niMgi voLLu
layakE nilayamai nIpAdaM sAgAli... malayAnilagatilO sumabAlaga tUgAli
valalO odugunA vihariMchE chirugAli.. selayETiki naTanaM nErpiMchE guruvEDi
tirigE kAlAnikI.... A....A....A....A....
tirigE kAlAniki tIrokaTuMdi.... adinI pAThAniki dorakanu aMdi
naTarAjaswAmi jhATAjhUTilOki chErakuMTE virichukupaDu suragaMgaku viluvEmuMdi.. viluvEmuMdi
ghallu ghallu ghallumaMTu merupallE tuLLu
jhallu jhallu jhalluna uppOMgu niMgi voLLu
dUkEalalaku E tALaM vEstAru... kammani kalala pATa E rAgaM aMTAru
alalaku aMdunA ASiMchina AkASaM.. kalalA karagaDamA jIvitAna paramArdhaM
vaddani ApalEru.... A... A... A... A...
vaddani ApalEru urikE Uhani... haddulu dATarAdu ASala vAhini
aluperugani ATalADu vasaMtAlu valadaMTe virivanamula paramaLamula viluvEmuMdI... viluvEmuMdI
ghallu ghallu ghallumaMTu merupallE tuLLu
jhallu jhallu jhalluna uppOMgu niMgi voLLu
nallamabbu challani challani chirujhallu
velluvochchi sAgani tolakari allarlu
pallaviMchani nElaku pachchani paravaLLu
ghallu ghallu ghallumaMTu merupallE tuLLu
jhallu jhallu jhalluna uppOMgu niMgi voLLu
Subscribe to:
Post Comments (Atom)
This song is written by sirivennela sitarama Sastry garu
ReplyDeletethank you. corrected this.
DeleteWhat a song! Amazing lyrics.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteఇంత గొప్ప సాహిత్యం తెలుగు జాతికి మళ్లీ దొరకాలి.
ReplyDeleteellalannaVE(ellalannade kadu. ellalu ante dikkulu toorpu padamara uttaram dakshinam. ellalu bahuvachanam kabatti ellalannave ani rayali) eragani vegamto vellu . namaste.
ReplyDeleteThanks. corrected.
DeleteSuper
ReplyDelete