| Title : | Kotta kottaga unnadi |
| Movie: | Coolie No 1 |
| Singers: | S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు |
| Lyricist: | Veturi Sundararama murthy గారు |
| Composer: | Illayaraja గారు |
| Director: | K. Raghavendra Rao గారు |
కొత్తకొత్తగా ఉన్నది, స్వర్గమిక్కడే అన్నది
కోటితారలే పూలయేరులై
కోటితారలే పూలయేరులై నేలచేరగానే
కొత్తకొత్తగా ఉన్నది, స్వర్గమిక్కడే అన్నది
నా కన్ను ముద్దాడితే కన్నె కులుకాయె కనకాంబరం
నా చెంప సంపెంగలో కెంపు రంగాయె తొలి సంబరం
ఎన్ని పొంగులో కుమారి కొంగులో, ఎన్ని రంగులో సుమాల వాగులో
ఎన్ని పొంగులో కుమారి కొంగులో, ఎన్ని రంగులో సుమాల వాగులో
ఉద్యోగమిప్పించవా సోకు ఉద్యానవనమాలిగా
జీతమియ్యగా లేత వన్నెలే చెల్లించుకోనా..
కొత్తకొత్తగా ఉన్నది, స్వర్గమిక్కడే అన్నది
కోటితారలే పూలయేరులై
కోటితారలే పూలయేరులై నేలచేరగానే
కొత్తకొత్తగా ఉన్నది, స్వర్గమిక్కడే అన్నది
నీ నవ్వు ముద్దాడితే మల్లెపువ్వాయె నా యెవ్వనం
నాజూకు మందారమే ముళ్ళ రోజాగా మారే క్షణం
మొగలి పరిమళం మొగాడి కౌగిలి, మగువ పరవశం సుఖాల లోగిలి
మొగలి పరిమళం మొగాడి కౌగిలి, మగువ పరవశం సుఖాల లోగిలి
కండల్లో వైశాఖమా కైపు ఎండల్లో కరిగించుమా
తీగమల్లికి నరాల పందిరి అందించుకోనా..
కొత్తకొత్తగా ఉన్నది, స్వర్గమిక్కడే అన్నది
కోటితారలే పూలయేరులై
కోటితారలే పూలయేరులై నేలచేరగానే
కొత్తకొత్తగా ఉన్నది, స్వర్గమిక్కడే అన్నది

No comments:
Post a Comment