Sunday, October 25, 2026

Urumuki merupuki- Jailer Title Song - Tiger ka hukum [ఉరుముకి మెరుపుకి పుట్టాడురా] - Jailer / Jailer 2

Title :Urumuki merupuki 
Movie:Jailer / Jailer 2
Singers:Dinker Kalvala గారు
Lyricist:Bhaskarabhatlaగారు
Composer:Anirudh Ravichander గారు
Director:Nelson గారు

హేయ్ ఇక్కడ నేనే కింగు నేను పెట్టినవే రూల్సు 

ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను 

అదివిని గప్ చుప్ గా ఫాలో అవ్వాలి 

అది వదిలేసి ఏదైన పిచ్చి పనులు చెయ్యాలని చూసావో

నిన్ను ఖండఖండాలుగా నరికి విసిరి పారేస్తాను

హుకుం ... టైగర్ కా హుకుం


ఉరుముకి మెరుపుకి పుట్టాడురా, పిడుగుని పిడికిట పట్టాడురా

అడుగడుగున గుడి కట్టాలిరా, తర తర తరముల సూపర్ స్టారురా 

మనిషిని మనిషిగా చూస్తాడురా, మనసుకి మనసుని ఇస్తాడురా

గడబిడ తరికిట చేస్తాడురా, మురిగిన మెడలకు ఉరితాడురా

తలైవా దమ్ వేస్తే స్టైల్  

తలైవా చిటికేస్తే స్టైల్

తలేగరేస్తుంటే స్టైల్

వయసుకు దొరకని ఇతనొక బాలుడు

తలైవా వాకింగే స్టైల్

తలైవా వార్నింగే స్టైల్

తలపడు డేరింగే స్టైల్

ఎముకలు విరవక ఎవడిని వదలడూ 


హేయ్ లేదు ఖాతరా, వేస్తాడు ఉప్పు పాతర

హేయ్ పట్టుకోకురా, పేలే మందుపాతర

జైలే వీడికున్న ఇల్లే, అస్సల్ నిదరపోవు కళ్ళే 

నకరాల్ చెయ్యమాకు సాలే కడతడు డొక్కచించి ఢోలే


టైగర్ కా హుకుం


ఉరుముకి మెరుపుకి ... పిడుగుని పిడికిట ...

నువ్వు మంచిగుంటే మంచి నువ్ చెడ్డగుంటే చెడ్డ

నీకేది ఇష్టమైతే అది తేల్చుకోర బిడ్డా 

మట్టగిడసల ఎగరకు కొడకా పొట్టుతీసి పులుసెడతా 

కన్ను కప్పుతు పారిపోతే ఎలక, తప్పదంటే కొండ తవ్వుతా 

తలైవా అడుగేస్తే స్టైల్ 

తలైవా విజిలేస్తే స్టైల్

తళ తళ డ్రెస్సేస్తే స్టైల్ 

దొరికిన వదలడు దొరికిన దేముడు  

తలైవా డాన్సింగే స్టైల్ 

తలైవా స్మోకింగే స్టైల్

తలనెరిసిన గానీ స్టైల్

తరగని చరితలొ నిలిచిన ఒక్కడు 


హేయ్ లేదు ఖాతరా, వేస్తాడు ఉప్పు పాతర

హేయ్ పట్టుకోకురా, పేలే మందుపాతర

జైలే వీడికున్న ఇల్లే, అస్సల్ నిదరపోవు కళ్ళే

నకరాల్ చెయ్యమాకు సాలే కడతడు డొక్కచించి ఢోలే

ఉరుముకి మెరుపుకి ... పిడుగుని పిడికిట ...

ఉరుముకి మెరుపుకి ... పిడుగుని పిడికిట ...

టైగర్ కా హుకుం.. అర్థమైందా రాజా..

No comments:

Post a Comment